- తమిళి సై పై సంచలన వ్యాఖ్యలు చేసిన మంత్రి ప్రశాంత్ రెడ్డి
హైదరాబాద్ : తెలంగాణ ప్రభుత్వం సూచించిన ఇద్దరు ఎం.ఎల్.సి. అభ్యర్థులను గవర్నర్ తమిళి సై తిరస్కరించడంపై రాష్ట్ర మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.. ఆమె రాష్ట్రానికి గవర్నర్ గా కొనసాగే నైతిక హక్కును కోల్పోయారని పేర్కొన్నారు.. కనుక తక్షణమే ఆమెను ఆ పదవినుండి వైదొలగాలని ఆయన డిమాండ్ చేశారు.. కాగా తమిళి సై తమిళనాడు రాష్ట్ర భారతీయ జనతా పార్టీ అధ్యక్షురాలిగా కొనసాగుతూ ఒక రాష్ట్రానికి గవర్నర్ గా నామినేట్ అవడం అన్నది సర్కారియా కమిషన్ నిబంధనలకు విరుద్ధమని ప్రశాంత్ రెడ్డి పేర్కొన్నారు.. కాగా డా. దాసోజు శ్రావణ్, కుర్రా సత్యనారాయణలు సామాజిక కార్యక్రమాల్లో పాల్గొన్నవారే నాని, వారి పేర్లను తిరస్కరించడం గవర్నర్ కి సరికాదని మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు..