Sunday, May 12, 2024

బండి సంజయ్‌పై హైకోర్టు సీరియస్..

తప్పక చదవండి
  • విచారణకు హాజరు కాకపోవటంపై అసహనం..
  • అమెరికాలో ఉండటంతో హాజరుకాని బండి సంజయ్..
  • ఈ నెల 12 హాజరవుతారన్న బండి తరఫు లాయర్..
  • సైనిక సంక్షేమ నిధికి రూ. 50 చెల్లించాలని కోర్టు ఆదేశం..

హైదరాబాద్ : బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్‌ తీరుపై తెలంగాణ ఉన్నత న్యాయస్థానం అసహనం వ్యక్తం చేసింది. రూ.50 వేల జరిమానా కూడా విధించింది. అయితే.. కరీంనగర్‌ ఎమ్మెల్యేగా ఉన్న మంత్రి గంగుల కమలాకర్‌ ఎన్నిక చెల్లదంటూ బండి సంజయ్ హైకోర్టులో పిటిషన్ వేసిన విషయం తెలిసిందే. ఈ పిటిషన్‌ మీద ఇప్పటికే హైకోర్టులో పలుమార్లు విచారణ జరగ్గా.. మంగళవారం రోజు విచారణ జరిగింది. అయితే విచారణ సందర్భంగా క్రాస్‌ ఎగ్జామినేషన్‌కు బండి సంజయ్‌ హాజరవకపోవటంపై ధర్మాసనం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇప్పటికే పలుమార్లు జరిగిన విచారణ సమయంలో కూడా క్రాస్‌ ఎగ్జామినేషన్‌కు బండి తరఫు న్యాయవాది గడువు కోరారు. కాగా.. ఇప్పుడు బండి సంజయ్ అమెరికా పర్యటనలో ఉన్న నేపథ్యంలో మరోసారి గడువు ఇవ్వాలని కోరటంతో.. ధర్మాసనం తీవ్ర అసహనం వ్యక్తం చేసింది. ఎన్నికలకు సంబంధించి పిటిషన్లు ఆరు నెలల్లో తేల్చాల్సి ఉన్న నేపథ్యంలో.. ఈ పిటిషన్ విచారణను ముగిస్తామంటూ తెలంగాణ ఉన్నత న్యాయస్థానం హెచ్చరించింది. కాగా.. ఈ నెల 12న బండి సంజయ్‌ కచ్చితంగా హాజరవుతారని ధర్మాసనాన్ని న్యాయవాది అభ్యర్థించారు. న్యాయవాది అభ్యర్థనను పరిగణలోకి తీసుకున్న ధర్మాసనం.. బండి సంజయ్‌ క్రాస్‌ ఎగ్జామినేషన్‌కు హాజరుకావాలంటే సైనిక సంక్షేమ నిధికి రూ. 50 వేలు చెల్లించాలని ఆదేశించింది.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు