Sunday, April 28, 2024

అధికారికంగా తెలంగాణ విమోచన గతేడాది మాదిరగానే ఉత్సవాలు: కిషన్‌ రెడ్డి

తప్పక చదవండి

హైదరాబాద్‌ : తెలంగాణ విమోచన దినోత్సవం సెప్టెంబర్‌ 17ను గత సంవత్సరం మాదిరిగానే సికింద్రాబాద్‌ పరేడ్‌ గ్రౌండ్‌లో నిర్వహిస్తామని కేంద్ర మంత్రి కిషన్‌ రెడ్డి పేర్కొన్నారు. ఈ సారి కూడా కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలోనే అధికారికంగా నిర్వహిస్తామన్నారు. అతిథులుగా ఎవరు వస్తారన్నది ఇంకా ధృవీకరణ కాలేదని పేర్కొన్నారు. ఎన్నికల్లో గెలవగా ముందు కేసీఆర్‌ అధికారకంగా నిర్వహిస్తామన్నారని గుర్తు చేశారు. తెలంగాణ వచ్చిన తరువాత.. అధికారంలోకి వచ్చి ఇప్పుడు మాట తప్పారని కిషన్‌ రెడ్డి పేర్కొన్నారు. మజ్లిస్‌ పార్టీకి ఒవైసీ ఒత్తిడి తలొగ్గి విమోచన కార్యక్రమాలు చేయడం లేదని కిషన్‌ రెడ్డి విమర్శించారు. ఒవైసీ కేసీఆర్‌ భయపడి కార్యక్రమాలు చేయడం లేదన్నారు. ఆనాటి కేంద్ర హోంమంత్రి సర్దార్‌ వల్లభాయ్‌ పటేల్‌ తెలంగాణ గడ్డపైనా జెండా ఎగురవేశారన్నారు. ఇప్పుడు 70 ఏళ్ల తరువాత మళ్లీ అభినవ సర్దార్‌ వల్లభాయ్‌ పటేల్‌ అయిన అమిత్‌ షా జెండా ఎగుర వేశారన్నారు. దేశానికి స్వాతంత్యర్ర వచ్చి 75 సంవత్సరాలు అవుతున్న సందర్భంగా అమృత్‌ మహోత్సవాలు చేశామని కిషన్‌ రెడ్డి పేర్కొన్నారు.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు