Monday, April 29, 2024

హాలీవుడ్‌ సినీ ఫక్కీలో నౌకపై హెలికాప్టర్‌ దాడి

తప్పక చదవండి

టోక్యో : ఎర్ర సముద్రంలో సరకు రవాణా నౌక గెలాక్సీ లీడర్‌ను హెలికా ప్టర్‌తో వెంబడిరచి హౌతీ రెబల్స్‌ స్వాధీనం చేసుకున్న వీడియో దృశ్యాలు హాలీవుడ్‌ సినిమాల్లోని యాక్షన్‌ సీన్లకు ఏ మాత్రం తీసిపోని విధంగా ఉన్నాయి. దీనికి సంబంధించిన వీడియోను తిరుగుబా టుదారులు విడుదల చేశారు. గాజాపై యుద్దాన్ని ఆపేంత వరకు ఇజ్రాయెల్‌పై సముద్ర దాడులు చేస్తామంటూ మరోసారి హెచ్చరించారు. నౌకను విడిపించేందుకు సంప్రదింపులు జరుపుతున్నట్లు జపాన్‌ వెల్లడిరచింది. తిరుగుబాటుదారులు హెలికాప్టర్‌లో ఎర్ర సముద్రంపై ఉన్న నౌక దగ్గరకు చేరుకున్నారు. షిప్‌పై ఎవరూ లేని సమయంలో డెక్‌పై హెలికాప్టర్‌ ల్యాండ్‌ అయింది. అందులోం చి దిగిన హౌతీ రెబల్స్‌ నినాదాలు చేస్తూ, కాల్పులు జరుపుతూ పరుగెత్తి.. వీల్‌హౌస్‌, కంట్రోల్‌ సెంటర్‌ను తమ ఆధీనంలోకి తీసుకున్నారు. తర్వాత నౌకను యెమెన్‌లోని సలీఫ్‌ పోర్టుకు మళ్లిం చారు. ఓడపై దాడి కేవలం ఆరంభం మాత్రమేననీ.. గాజాపై యుద్దాన్ని ఆపేంత వరకు ఇజ్రాయెల్‌ పై సముద్ర దాడులు చేస్తామని హౌతీ అధికార ప్రతినిధి తెలిపారు. నౌక తుర్కియే నుంచి భారత్‌కు వస్తున్న సమయంలో హైజాక్‌ జరిగింది. అందులోని 25 మంది సిబ్బందిని హౌతీ రెబల్స్‌ బందీలు గా తీసుకున్నారు. హౌతీలు గెలాక్సీ లీడర్‌ నౌకను స్వాధీనం చేసుకోవడంపై ఐక్యరాజ్య సమితి సెక్రె టరీ జనరల్‌ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ఈ ఘటనను ఖండిరచారు. ఇది ఇలావుంటే, ఆ నౌక తమది కాదని ఇజ్రాయెల్‌ స్పష్టం చేసింది. ఈ నౌక యజమాని బ్రిటన్‌ వాసి కాగా, జపాన్‌కు చెంది న ఎన్‌వైకే లైన్‌ అనే సంస్థ దీనిని నిర్వహిస్తున్నట్లు తెలిసింది. దీంతో జపాన్‌ ప్రభుత్వం రంగంలోకి దిగి తిరుగుబాటుదారులతో నేరుగా సంప్రదింపులు జరుపుతోంది. నౌకను విడుదల చేయించేందుకు కృషి చేయాలని ఇరాన్‌, సౌదీ అరేబియా, ఒమన్‌ దేశాలకు విజ్ఞప్తి చేసింది.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు