Tuesday, May 21, 2024

మహేశ్వరంలో రోజు రోజుకు పెరుగుతున్న హస్తం గ్రాఫ్..

తప్పక చదవండి
  • నియోజకవర్గంలో గెలిచేది మళ్లీ కాంగ్రెస్సే అంటున్న ప్రజలు
  • భారీ చేరికలతో విస్తృతంగా ప్రచారం..ఏకతాటిపైకి కాంగ్రెస్ క్యాడర్….
  • ప్రజలతో మమేకమై ప్రచారం నిర్వహిస్తున్న కెఎల్ఆర్!!
  • మహేశ్వరం నియోజకవర్గం అభివృద్ధి బాధ్యత నాదే..
  • నియోజకవర్గాన్ని అధోగతి పాలు చేసిన సబితమ్మ..
  • దళితులు, బహుజనులు కాంగ్రెస్ కుటుంబ సభ్యులే అంటున్నకిచ్చెన్నగారి లక్షారెడ్డి!

మహేశ్వరం : ఈనెల 30న జరగనున్న అసెంబ్లీ ఎన్నికలలో మహేశ్వరంలో ఘనవిజయం సాధించి తెలంగాణ ఇచ్చిన సోనియమ్మకు పుట్టినరోజు కానుకగా అందించేందుకు నియోజకవర్గ ప్రజలు సిద్ధంగా ఉన్నారని మాజీ ఎమ్మెల్యే, మహేశ్వరం నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కిచ్చెన్నగారి లక్ష్మారెడ్డి పేర్కొన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం కొలువుతీరుతుందని మహేశ్వరం అభివృద్ధి బాధ్యత నాదేనని తెలిపారు. గతంలో సైతం దళితులు బలహీన వర్గాల అభివృద్ధి కి శాసనసభలో గళం విప్పానని గుర్తు చేశారు. బిఆర్ఎస్ ప్రభుత్వ వైఫల్యంతో కాంగ్రెస్ గ్రాఫ్ పెరిగిందని, భాజపా, భారాస పార్టీల నుంచి కాంగ్రెస్ లో భారీగా చేరికలతో హస్తం పార్టీ బల నిరూపణకు సిద్ధంగా ఉందని చెప్పారు. సదా బడుగు బలహీన వర్గాలకు హస్తం చేయూతనందిస్తుందని లక్ష్మారెడ్డి చెప్పారు. పార్టీలో నాయకులు, కార్యకర్తలు ఏకతాటిపైకి వచ్చి గెలుపే లక్ష్యంగా ముందుకెలుతున్నారన్నారు. మహేశ్వరం నియోజకవర్గాన్ని అధోగతి పాలు చేసిన సబితమ్మ ను చిత్తు చిత్తుగా ఓడించాలని సూచించారు. ప్రజలతో మమేకమవుతూ పార్టీ ప్రకటించిన ఆరు గ్యారెంటీ లను ప్రజలలోకి తీసుకువెళుతున్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ గాలి విపరీతంగా వీస్తుందని, ఇది చూసి తట్టుకోలేక బిఆర్ఎస్, భాజపాలు కాంగ్రెస్ పార్టీ పై అసత్య ఆరోపణలు చేస్తున్నారని విమర్శించారు. హస్తం పార్టీ సృష్టించే సునామీలో బిఆర్ఎస్, భాజపాలు ఖలాస్ అని మహేశ్వరం నియోజకవర్గంలో కాంగ్రెస్ జెండా రెప రెపలాడటం ఖాయమని ఆనందం వ్యక్తం చేశారు. మహేశ్వరం లో అభివృద్ధి జాడ కనిపించడం లేదని, నియోజకవర్గంలో అభివృద్ధిపై బహిరంగ చర్చకు సిద్ధమా అని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి, నియోజక వర్గ బారాసా అభ్యర్థి సబితమ్మకు సవాల్ విసిరారు. అభివృద్ధి నెపంతో గెలిపించిన పార్టీని, ప్రజలను ఓడించి స్వలాభం కోసం మంత్రి పదవి కోసం కేసీఆర్ పంచన చేరిన సబితమ్మ సాక్షాత్తు విద్యాశాఖ మంత్రి అయి ఉండి నియోజకవర్గంలో విద్యకు విద్యార్థినీ, విద్యార్థులకు, ఏలాంటి సదుపాయాలు కల్పించలేదని సరిపడా నిధులను మంజూరు చేయలేకపోయారని, యువతకు, మహిళలకు ఉపాధి అవకాశాలు కల్పించలేదని మండిపడ్డారు. తాను గెలిచిన పిదప అభివృద్ధి అంటే ఏమిటో రుచి చూపిస్తాను అని సవాల్ విసిరారు. అభివృద్ధిపై, ప్రజా సమస్యలపై తనకు పూర్తి అవగాహన ఉందని అన్నారు.

బీసీ సాధికారత కాంగ్రెస్ తోనే సాధ్యమని బీసీలందరూ కాంగ్రెస్ వెంటే ఉన్నారని అన్నారు. రాబోయే ప్రభుత్వ సహాయంతో నియోజకవర్గంలో అభివృద్ధిని పరుగులు పెట్టిస్తానని ధీమా వ్యక్తం చేశారు. తనకు పదవులు ముఖ్యం కాదని సదా ప్రజలలో ఉండే సాధారణ వ్యక్తినని సమాజ శ్రేయస్సుకై కేఎల్ఆర్ ట్రస్టుతో అన్ని వర్గాలకూ అండగా నిలిచి భరోసా అందిస్తున్నానని తెలిపారు. బారాస ప్రభుత్వం అవినీతిలో కూరుకుపోయిందని నియోజకవర్గంలో సబితమ్మ అక్రమార్కులకు అండగా నిలిచారని విమర్శించారు. అక్రమ దందాలు, భూకబ్జాలతో అమాయకులను హడలెత్తిస్తున్నారని రాష్ట్రంలో రైతుల, నిరుద్యోగుల బలవన్మరణానికి కారణమైన కెసిఆర్ ప్రభుత్వాన్ని గద్దె దించాలని ప్రజలకు పిలుపునిచ్చారు. మహేశ్వరం నియోజకవర్గంలో నామమాత్రంగా కార్పొరేషన్, మున్సిపాలిటీలను ఏర్పాటు చేసి నిధులు విడుదల చేయకుండా అభివృద్ధికి దూరం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అభివృద్ధి అవకాశాలు కల్పించకుండా కేవలం ముఠాలను రౌడీయిజాన్ని పెంచి పోషించింది బి.ఆర్.ఎస్ అని, వచ్చే ఎన్నికలలో హస్తం గుర్తుపై ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించి, కారు గుర్తుకు బుద్ధి చెప్పాలని తెలియచెప్పారు. రాబోయే కాంగ్రెస్ ప్రభుత్వం ఆరు గ్యారెంటీ లతో అన్ని వర్గాలను ఆదుకుని, రాష్ట్రంలో అభివృద్ధిని పరుగులు పెట్టిస్తుందని తెలిపారు.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు