Tuesday, May 21, 2024

మీకు సేవ చేసే అవకాశం కల్పించండి

తప్పక చదవండి
  • అధికారంలోకి వచ్చేది కాంగ్రెస్ పార్టీనే
  • ఆరు గ్యారెంటీలను అందిస్తుంది కాంగ్రెస్
  • కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థి సింగపురం ఇందిర

స్టేషన్గన్పూర్ : తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో వస్తుంది.. ఆరు గ్యారెంటీలను అమలుచేస్తుందని స్టేషన్ ఘన్పూర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి సింగపురం ఇందిర ధీమా వ్యక్తం చేశారు. ఘనపూర్ మండల పరిధిలోని అక్కపెళ్లి గూడెం గ్రామంలో రచ్చబండ కార్యక్రమంలో పాల్గొన్నారు. గ్రామ ప్రజలు మాట్లాడుతూ.. నాయకులు ఇప్పటివరకు ఏమి పట్టించుకోలేదని, మాకు ఇండ్లు కట్టేయలేదని, రైతు రుణమాఫీ ఇంకా కాలేదని, 30 గుంటలు ఎకరం రెండెకరాలు ఉన్న రైతుల పరిస్థితి మరి అధ్వానంగా ఉంది అని వాపోయారు. గ్రామానికి రోడ్లు నిర్మించాలని, పక్క ఇల్లు కట్టేయాలని, సైడ్ కాలువలు, లింకు రోడ్లు కావాలని రైతుల సౌకర్యార్థం రైతుక వేదికను ఏర్పాటు చేయాలని ఇందిరా ను కోరారు. అనంతరం కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి సింగపురం ఇందిరా మాట్లాడుతూ ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు వైయస్ రాజశేఖర్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ ఏకకాలంలో రైతు రుణమాఫీ చేసింది. కానీ నేటి కేసీఆర్ ప్రభుత్వం 9 సంవత్సరాలు గడిచిన ఒక రైతులుకు పూర్తిగా రుణమాఫీ చేసిన దాఖలు ఎక్కడ లేవని మండిపడ్డారు. కొత్తగా రుణాలు ఇచ్చిన సందర్భం కూడా లేదు. ఆనాడు రైతులకు సబ్సిడీ కింద ఎరువులు, వ్యవసాయ పనిముట్లు, డ్రిప్ పైపులు అందించిన ఘనత కాంగ్రెస్ పార్టీకే దక్కుతుందని గుర్తుచేశారు. 108 అంబులెన్స్ సర్వీసులు అందించిన ఘనత వైయస్ఆర్ కే దక్కుతుందని అన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే మీకు తప్పకుండా సాగు, తాగు నీరు అన్ని అందేలా చూస్తానని, మెయిన్ రోడ్డు తప్పకుండా వేస్తానని, హామీలు నెరవేరుస్తానని హామీ ఇచ్చారు. ఈ హామీలన్నీ నెరవేరాలంటే కాంగ్రెస్ పార్టీ చేయి గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు, మండల అధ్యక్షులు, మండల నాయకులు, ప్రజాప్రతినిధులు, మాజీ ప్రజాప్రతినిధులు, అనుబంధ సంఘాల అధ్యక్షులు, మహిళా నాయకురాలు, యువజన నాయకులు, గ్రామ శాఖ అధ్యక్షులు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు