Wednesday, February 28, 2024

నేను గెలిస్తే మీరంతా గెలిచినట్లే..

తప్పక చదవండి
  • పార్టీలు కాదు.. ప్రజలు గెలవాల్సిన సమయం ఆసన్నమైంది…
  • రెండు పార్టీలు మోసం చేసిన ప్రజలు అండగా ఉన్నారు..
  • మహిపాల్ రెడ్డి వెనకాల లీడర్లు ఉంటే నా వెంట పటాన్ చెరు ప్రజలున్నారు..
  • అధికారం లేకున్నా మీ సేవకుడిగా పని చేశా..
  • మీ ఇంటి బిడ్డకు ఒక్క అవకాశం ఇవ్వండి..
  • ఎమ్మెల్యేగా గెలుపొందితే నిరుపేదలకు 100 గజాల ఇంటి స్థలం..
  • బీఎస్పీ ఎమ్మెల్యే అభ్యర్థి నీలం మధు ముదిరాజ్..
  • ముత్తంగి, చిట్కుల్ గ్రామాలలో బీఎస్పీ ఎన్నికల ప్రచారం..

హైదరాబాద్ : పటాన్ చెరు నియోజకవర్గంలో గెలవాల్సింది పార్టీలు కాదని ప్రజలు గెలవాల్సిన సమయం ఆసన్నమైందని పటాన్ చెరు బీఎస్పీ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి నీలం మధు ముదిరాజ్ అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆదివారం పటాన్ చెరు మండల పరిధిలోని తన స్వగ్రామం చిట్కుల్ తో పాటు ముత్తంగి ఇస్నాపూర్ గ్రామపంచాయతీ పరిధిలో పలు కాలనీలలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మన బహుజన సబండవర్గాల బిడ్డలు చట్టసభల్లో గొంతు ఎత్తితేనే మన వర్గాలకు అన్ని విధాలుగా న్యాయం జరుగుతుందని తెలిపారు. బహుజన సబ్బండ వర్గాల ఆత్మ గౌరవమే లక్ష్యంగా పని చేస్తున్న మనల్ని బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు మోసం చేశాయని ఆరోపించారు. అయితే రెండు పార్టీలు మోసం చేసిన నియోజకవర్గ ప్రజలు మాత్రం తన వెన్నంటే ఉంటూ తనకు మద్దతునిస్తున్నారని వెల్లడించారు. ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి వెంట లీడర్లు ఉంటే గరీబోళ్ల బిడ్డ అయిన నా వెంట పటాన్ చెరు నియోజకవర్గ ప్రజానీకం ఉందన్నారు. ఒక పేదింటి బీసీ బిడ్డగా నాకు జరిగిన అన్యాయాన్ని చూసి అన్ని వర్గాల ప్రజలు అక్కున చేర్చుకుంటున్నారని పేర్కొన్నారు. నాకు వస్తున్న ప్రజాదరణను చూసి నోట్ల కట్టలతో ఓట్లను కొనే కుట్రకు కొందరు తెరలేపారని అయితే అక్రమంగా సంపాదించిన ఆ నోట్లను తీసుకుని ఓటు మాత్రం మీ ఇంటి బిడ్డ అయిన నన్ను గెలిపించడానికి ఏనుగు గుర్తు పై వేయాలని విజ్ఞప్తి చేశారు. నన్ను గెలిపించిన మరుక్షణమే ఇండ్లు లేని మన ప్రాంత నిరుపేదలకు ప్రతి ఒక్కరికి 100 గజాల చొప్పున ఇండ్ల పట్టాలను అందిస్తానని హామీ ఇచ్చారు. ఇప్పుడున్న నాయకులు కేవలం గ్రామాల్లోకి వచ్చి అభివృద్ధి పనుల పేరుతో నలుగురు లీడర్లను కలిసి వెళుతున్నారని తాను మాత్రం గుడ్ మార్నింగ్ పటాన్చెరు పేరుతో ప్రతి ఒక్క ఇంటికి వెళుతూ కష్టనష్టాలను తెలుసుకొని పరిష్కరిస్తానని భరోసా ఇచ్చారు. నవంబర్ 30వ తేదీన ప్రజలంతా విజ్ఞతతో ఆలోచించి బహుజన్ సమాజ్ పార్టీ బలపరిచి ఏనుగు గుర్తుపై ఓటు వేసి తనని గెలిపించాలని విజ్ఞప్తి చేశారు.

నీలం మధుకు మా మద్దతు: బీసీ సంఘాలు
బీసీ నేత, పటాన్ చెరు బీఎస్పీ ఎమ్మెల్యే అభ్యర్థి నీలం మధుకు తెలంగాణలోని అన్ని బీసీ సంఘాలు సంపూర్ణ మద్దతు తెలియజేస్తున్నాయని బీసీ యువజన సంఘం రాష్ట్ర అధ్యక్షుడు నీలం వెంకటేష్ తెలిపారు. హైదరాబాద్ బషీరాబాగ్ లో ఆదివారం ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్ లో ఆయన మాట్లాడారు. బీసీల గొంతుకైన నీలం మధును అసెంబ్లీకి పంపాలన్నారు. ఈ కార్యక్రమంలో బీసీ విద్యార్థి, మహిళా, నిరుద్యోగ, తెలంగాణ ఉద్యమకారుల సంఘాల సభ్యులు పాల్గొన్నారు.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు