- ఊసరవెల్లి లా రంగులు మార్చే నాయకులు అవసరమా
- ప్రచారంలో మేము సైతం అంటున్న యువత
- ఓటర్ల మనోభావాలను దెబ్బతీసే నాయకులకు బుద్ధి చెబుదాం
- ఇంటింటికి బిజెపి మేనిఫెస్టో తీసుకెళ్దాం
హైదరాబాద్ : దేశం కోసం ధర్మం కోసం పాటుపడే వ్యక్తులను గెలిపించుకుంటే బాగుంటుంది. 30ఏళ్లుగా బీజేపీ పార్టీ సిద్ధాంతాల పట్ల పూర్తి విశ్వాసంతో పనిచేసిన తల్లోజి ఆచారిని కల్వకుర్తి నియోజకవర్గ ప్రజలు గెలిపించుకుంటారని ప్రజల విశ్వాసాన్ని నిలబె ట్టేందుకు ఆయన అహర్నిశలు కృషి చేస్తారని యువత గట్టి విశ్వాసంతో ఉన్నారు. యువత విశ్వాసాన్ని వారి నమ్మకాన్ని నిలబెట్టేందుకు ఆచారి సిద్ధంగా ఉన్నారు. నియోజకవర్గంలో ఇప్పటివరకు ఎంతోమంది కాంగ్రెస్, టీడీపీ, బీఆర్ఎస్, పార్టీలకు చెందిన ఎంతోమంది ఎమ్మెల్యేలుగా గెలుపొంది ఏ పాటి అభివృద్ధి చేశారో ప్రజలు చూశారు .
ఊసరవెల్లిలా రంగులు మార్చే నాయకులు అవసరమా
అవసరాన్ని బట్టి పార్టీలు మారే నాయకులు నియోజక వర్గంలో మనం చూస్తున్నాం. ఒక పార్టీలో టికెట్టు దక్కకపోతే సిద్ధాంతాలను తుంగలో తొక్కి కార్యకర్తల మనోభావాలను దెబ్బతీస్తూ డబ్బులతో ఇంకో పార్టీలో టికెట్లు కొనుకుంటున్న నాయకులు అవసరమా ఒకసారి ఆలోచించాలి. నిన్న మొన్నటి వరకు ఒకే పార్టీలో ఉన్న దొంగ నాయకులు టికెట్ రాలేదని ఇంకో పార్టీలో చేరి ఓటర్లను డబ్బులతో కొనాలని చూస్తున్నారని ఓట్లు కొనుక్కునే నాయకుడు నియోజకవర్గానికి సేవలు ఏం చేస్తాడు ప్రజలు గమనించాలని ఆయన అన్నారు. గత నాలుగు పర్యాయాలుగా ప్రజలకు ఎన్నో సేవలు చేస్తూ వారి మధ్యనే ఉంటూ వారి అభివృద్ధికి పాటుపడుతున్న ఆచారికి ఒక్క అవకాశం ఇవ్వాలని పలువురు యువత ప్రజలను కోరుతున్నారు. ముఖ్యంగా ఓటర్ల మనోభావాలు దెబ్బతీస్తున్న దొంగ కాంగ్రెస్ టిఆర్ఎస్ అభ్యర్థులను ఓడించాలని ఓటర్లకు విజ్ఞప్తిచేస్తున్నారు .
ప్రచారంలో మేము సైతం అంటున్న యువత
కల్వకుర్తి నియోజకవర్గంలో తల్లోజు ఆచారి గెలుపు కోసం రాష్ట్రవ్యాప్తంగా ఎంతోమంది వీహెచ్ పి, బజరంగ్దళ్, ఆర్ఎస్ఎస్, బీజేపీ కి చెందిన యువకులు గ్రామాలలోకి వెళ్లి తిరుగుతూ ఆచారిని గెలిపించాలని ప్రజలను వేడుకుంటున్నారు. ఆచారి కోసం మేము సైతం అంటూ తమ సొంత డబ్బులను ఖర్చు చేసుకుంటూ ఆయన కోసం ప్రచారంలో దూసుకుపోతున్నారు. ఇతర పార్టీల్లో అభ్యర్థులు కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్న తరుణంలో ఆచారి కోసం ఎవరికి వారే స్వచ్ఛందంగా డబ్బులు పోగేసుకొని ప్రచారంలో పాల్గొనడం పట్ల ప్రజలు కూడా సానుకూలంగా స్పందిస్తున్నారు.
ఇంటింటికి బీజేపీ మేనిఫెస్టో
తెలంగాణ సార్వత్రిక ఎన్నికల సందర్భంగా బీజేపీ పార్టీ తాము ప్రజలకు ఏం చేస్తాము. అని మేనిఫెస్టో విడుదల చేయడం జరిగింది. దానిని బీజేపీ అభ్యర్థి కోసం పల్లె పల్లె కు తీసుకెళ్లాల్సిన బాధ్యత నాయకులకు ఉన్నది. బీజేపీ పార్టీని అధికారంలోకి తీసుకొస్తే ప్రజలకు ఏం చేస్తామని మేనిఫెస్టో లోని ముఖ్య విషయాలు ధరణి స్థానంలో మీ భూమి యాప్ ప్రవేశపెట్టడం, గల్ఫ్ బాధితుల కోసం నోడల్ ఏజెన్సీల ఏర్పాటు చేయడం, ఉద్యోగులకు పెన్షనర్లకు ప్రతినెల ఒకటి తారీకు అన్ని వేతనాలు ఇవ్వడం, బీఆర్ఎస్ అవినీతి అక్రమాలపై కమిటీ వేయడం 4 శాతం ముస్లింల రిజర్వేషన్ రద్దు, ఉమ్మడి పౌరస్మృతి ముసాయిదా కమిటీ విధానం , బీసీ ముఖ్యమంత్రి, ఎస్సీ వర్గీకరణ సహకారం చేపట్టడం, అర్హులైన పేదలందరికీ ఇళ్ల స్థలాలు అర్హత కలిగిన కుటుంబాలకు కొత్త రేషన్ కార్డులు, ఒక పంటకు గాను రైతులకు ఎరువులు విత్తనాలకు కొనుగోలుకు ఎకరాకు 2500 సాయం, ఆసక్తి గల రైతులకు ఉచిత దేశీయ ఆవుల పంపిణీ, వరికి క్వింటాలుకు 3000 ఒక 100 మద్దతు ధర, నిజామాబాద్ లో టర్మరిక్ సిటీ అభివృద్ధి, డిగ్రీ విద్యార్థినులకు ఉచిత లాప్టాప్ లు, చేత బాలికల పేరు మీద ఫిక్స్ డిపాజిట్లు, ఉజ్వల పథకం లబ్ధిదారులకు ఏడాదికి నాలుగు గ్యాస్ సిలిండర్ల ఉచితం లాంటి పథకాలతో బీజేపీ అద్భుతమైన మేనిఫెస్టోను అందిస్తుందని బీజేపీని ఆదరించి గెలిపిస్తే నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేస్తారని అన్నారు.