Tuesday, May 14, 2024

దేశ భవితవ్యం – ఉపాధ్యాయుల పాత్ర

తప్పక చదవండి

మారుతున్న కాలానికి అనుగుణంగా చదువుల్లో గుణాత్మకమైన మార్పురావాలి. విద్యార్థుల భవిష్యత్తు కోసం ఉపాధ్యాయులు నిరంతరం శ్రమించాలి. విద్యాబోధనలో సులభమైన పద్దతులు అందుబాటు లోకి వచ్చాయి. వాటిని అందుకుని నాణ్యతా ప్రమాణాల గల విద్యను భావితరాలకు అందించాలి. విద్యార్ధులకు ఉపాధ్యాయులకు మధ్య గల సంబంధం కేవలం తరగతి గదులకే పరిమితమయ్యే గురుశిష్యల సంబంధం మాత్రమే కారాదు. విజ్ఞానాన్ని ప్రపంచం నలుచెరగులా వ్యాపింప చేసి, అభివృద్ధికి ఆలంబనగా ఉండాలి. ఉపాధ్యాయులు నవ ప్రపంచ నిర్మాతలు. విద్యార్ధులకు మార్గ నిర్ధేశకులు.విశ్వానికి వెలుగు రేఖలు ఉపాధ్యాయులు ఉపాధ్యాయుల హక్కులను బాధ్యతలను గుర్తు చేస్తూ, వారిని గౌరవించే ప్రక్రియలో భాగంగా యునెస్కో తీర్మానం ప్రకారం 1994 సంవత్సరం నుండి ప్రతీ ఏటా అక్టోబర్‌ 5వ తేదీన ప్రపంచవ్యాప్తంగా ఉపాధ్యాయుల దినోత్సవం జరుగుతున్నది. ప్రపంచ ఉపాధ్యాయుల దినోత్సవానికి ఫ్రాన్స్‌ రాజధాని పారిస్‌ నాందీ వాక్యం పలికింది.అజ్ఞానమనే అంధ కారం నుండి విజ్ఞానమనే వెలుగు వైపు పయనింప చేసే శక్తి కేవలం ఉపాధ్యాయులకే సాధ్యం. ప్రపంచ ప్రగతి సాధన ఉత్తమ విద్య ద్వారా మాత్రమే సాధ్యం. ఉత్తమ నాణ్యతా ప్రమాణాలను నెలకొల్పి, విద్యార్థుల్లో నైపుణ్యానికి ఉపాధ్యాయులు, విద్యా వంతు లు కృషి చేయాలి. కంఠస్థం చేయడం వలన కంఠశోష తప్ప ప్రయోజనం శూన్యం.దురదృష్ట వశాత్తూ ఈనాటికీ ప్రపం చంలో చాలా మందికి విద్యావకాశాలు గగనకుసుమంలా మారా యి. కొన్ని దేశాల్లో స్త్రీలకు చదువుకునే స్వేచ్ఛ లేదు. మరికొన్ని దేశాల్లో కుటుంబాల ఆర్ధిక స్థోమత సరిగా లేక, చదువుకునే అవకాశాలు మృగ్యమైపోతున్నాయి. బాలకార్మి కులుగా, వీధి బాలల్లా మిగిలి పోతున్నారు. ఒక వైపు ఇలాంటి పరిస్థితులు తాండవిస్తుంటే, మరొకవైపు నాణ్యత లేని విద్యల వలన ఉద్యోగా వకాశాలు సన్నగిల్లుతున్నాయి. నైపుణ్యం లోపించిన చదువుల వలన ప్రపంచ ప్రగతి సాధ్యం కాదు.ఉత్తమ ప్రమాణాలు నెలకొల్పడంలో ఉపాధ్యాయుల పాత్ర కీలకం. ఉపాధ్యాయులు అంకిత భావంతో కృషి చేసి, విద్యార్ధులను ఉత్తమంగా తీర్చిదిద్దాలి.విద్య యొక్క ప్రాధాన్యతను పెంచే విధంగా సంస్కరణలు రావాలి. నిజమైన విద్యకోసం పాటుపడాలి. సాంకేతిక రంగాన్ని చెడిపోవడానికే వినియోగించుకునే ధోరణిలో మార్పురావాలి. వాస్తవ ప్రపంచా నికి దూరంగా, రంగుల లోకంలో విహరిస్తూ పెనుభారంగా తయారైన యువత చాలా ప్రమాదకరం. ఊహల్లో తేలియాడే ప్రపంచానికై ఉర్రూతలూగు తున్న యువతను సంస్కరించాలి. తల్లిదండ్రుల దృక్పథంలో కూడా మార్పు రావాలి.తల్లి దండ్రులు ఒక స్థాయి వరకు తమ పిల్లలను తమ వద్దే పెరిగేటట్టు చూడాలి. బాహ్య ప్రపంచంలోని అనైతిక ధోరణుల వలన కలిగే పర్య వసానాల గురించి తెలియచెప్పాలి. ఉపాధ్యాయులు కూడా తమ వృత్తి పట్ల అంకితభావం ప్రదర్శించాలి. భావితరాలను మేథాశక్తి సుసంపన్నులు తయారు చేయడంలో వారి పట్ల గురుతరమైన బాధ్యత ఉంది. ఉపాధ్యా యుల ఆలోచనల్లోనే నిజమైన దేశ నిర్మాణం ఆధారపడి ఉంది. అందుకోసం ఉపాధ్యాయులు నిరం తర విద్యార్ధులై శ్రమించాలి. విద్యార్థులను ఉన్నతంగా తీర్చిది ద్దాలి. ఉపాధ్యాయుల ధ్యాసంతా విద్యార్థులపై కేంద్రీకరించినప్పుడే ఉత్తమ ఫలితాలు సాధించ వచ్చు. విద్యార్ధులను నాణ్యమైన విద్యాబోధనతో అన్నిరంగాల్లో నిష్ణాతులుగా తీర్చిదిద్దడం.. విలువలతో ఉత్తమపౌరులుగా తయారు చేయడం. అందుకు అనువైన పరిస్థితుల ను ప్రభు త్వాలు నెలకొల్పాలి. ఏదేశ మైనా అన్ని రంగాల్లో అభివృద్ధి సాధించి నప్పుడే ప్రజలకు సజావుగా జీవించడా నికి మౌలిక సదుపాయాలు అందు తాయి. జీవనోపాధి లభిస్తుంది. ప్రజలం తా ఎలాంటి ఒడిదు డుకులు లేకుండా జీవించగలిగినప్ఫుడే అలజడులు, అరాచకాలు తగ్గి ప్రశాంత వాతావరణం ఏర్పడి, శాంతి భద్రతలు నెలకొని, దేశం అభివృద్ధి పథంలో పయనిస్తుంది. వీటన్నింటికీ మూలాధారం విద్య. విద్య అనేది అత్యంత శక్తివంతమైన ఆయుధం. విద్య ద్వారా సాధించలేని దంటూ ఏదీ లేదు. అలాంటి నాణ్యమైన విద్య దేశంలో ప్రతీ ఒక్కరికీ అందాలి.సక్రమమైన విద్యల వలన విద్యావంతులు విభిన్న రంగాల్లో తమ ప్రతిభా పాటవాలను ప్రదర్శించి దేశాభివృద్ధిని శిఖరాగ్ర భాగంలో నిలబెట్టగలరు. ప్రపంచ గతిని మార్చగలరు. మనిషి మానసిక ఎదుగుదలకు, వ్యక్తిత్వ వికాసానికి విద్య అవసరం.విద్యావ్యవస్థలో విప్లవాత్మక మార్పులు రావాలి. విద్యార్ధులను అన్నిరంగాల్లో నిష్ణాతులుగా తీర్చిదిద్దాలి. అప్పుడే మనం ఆశించిన నిజమైన దేశాభివృద్ధి,ప్రపంచాభివృధ్ది సాధ్యపడు తుంది. విద్యార్ధులంతా చక్కని విద్యా సాధనతో విలువలతో కూడిన నవ ప్రపంచాన్ని సృష్టించడమే ప్రపంచ ఉపాధ్యాయ దినోత్సవం యొక్క ముఖ్య లక్ష్యం కావాలి. భావితరాల బంగారు భవిష్యత్తులో ఉపాధ్యాయులు కీలక పాత్ర వహించాలి.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు