Monday, May 6, 2024

చైనా సబ్‌మెరైన్‌లో చిక్కుకుపోయి నావికులు మృతి..

తప్పక చదవండి

చైనా కు చెందిన ఓ న్యూక్లియర్‌ సబ్‌మెరైన్‌ ప్రమాదానికి గురైంది. శత్రు దేశాల కోసం గతంలో ఎల్లో సీ లో డ్రాగన్‌ ఏర్పాటు చేసిన ట్రాప్‌ లో ఆ దేశ సబ్‌మెరైనే చిక్కుకుంది. ఈ ఘటనలో 55 మంది చైనా నావికులు జలసమాధి అయ్యారు. ఇందుకు సంబంధించిన వివరాలను యూకే కు చెందని ఓ రిపోర్ట్‌ నివేదించింది.
ఆ నివేదిక ప్రకారం.. చైనాలోని షాండాంగ్‌ ప్రావిన్స్‌లోని ఎల్లో సముద్రంలో ఆగస్టు 21వ తేదీన ఈ ఘటన చోటు చేసుకుంది. పీపుల్స్‌ లిబరేషన్‌ ఆర్మీ నేవీకి చెందిన న్యూక్లియర్‌ సబ్‌మెరైన్‌ ‘093-417’ సముద్రంలో చిక్కుకుపోయింది. దీంతో అది ఎటూ కదలకుండా గంటల తరబడి అక్కడే నిలిచి పోయింది. నావికుల కోసం ఏర్పాటు చేసిన ఆక్సిజన్ వ్యవస్థ కూడా పనిచేయలేదు. ఎమర్జెన్సీ టైంలో పని చేయాల్సిన సిస్టమ్ కూడా ఆఫ్ అయింది. దీంతో ఊపిరాడక, ఉక్కిరిబిక్కిరి అయి సబ్‌మెరైన్‌లో ఉన్న 55 మంది నావికులు అందులోనే జల సమాధి అయ్యారు. మరణించిన వారిలో కెప్టెన్ కల్నల్ జు యోంగ్-పెంగ్ తో పాటు.. 22 మంది ఆఫీసర్లు, ఏడుగురు ఆఫీస్ క్యాడెట్లు, 17 మంది నావికులు, 9 మంది ఇతర సిబ్బంది ఉన్నారు. సబ్‌మెరైన్‌లో సిస్టమ్ వైఫల్యం కారణంగానే వారంతా చనిపోయినట్లు రిపోర్ట్ నివేదించింది.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు