Saturday, July 27, 2024

ఎపిలో రేవంత్‌రెడ్డిని అభినందిస్తూ ఫ్లెక్సీలు

తప్పక చదవండి

అమరావతి : తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ ఘన విజయం సాధించింది. ఈ నేపథ్యంలో టీపీసీ ఛీప్‌ రేవంత్‌ రెడ్డిని అభినందిస్తూ రాష్ట్రంలో ఫ్లెక్సీలు వెలిశాయి. బెజవాడ బెంజ్‌ సెంటర్‌లో రేవంత్‌కు శుభాకాంక్షలు చెబుతూ ఫ్లెక్సీలు ఏర్పాటయ్యాయి. ఇటు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌రెడ్డి నివాసం సవిూపంలో కూడా రేవంత్‌ను అభినందిస్తూ ఫ్లెక్సీలు వెలిశాయి. తెలంగాణా ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరిస్తున్న రేవంత్‌ రెడ్డికి హార్ధిక శుభాకాంక్షలు అంటూ కోనేరు రాహుల్‌ చౌదరి పేరుతో ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. బెజవాడ జనం ఈ ఫ్లెక్సీలను ఆసక్తిగా తిలకిస్తున్నారు.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు