Sunday, May 12, 2024

నేను టిడిపిలోనే ఉన్నా..ఎంపిగా పోటీ చేస్తా

తప్పక చదవండి
  • చంద్రబాబు నిజాయితీ కలిగిన రాజకీయనేత
  • విజయవాడ ఎంపి కేశినేని నాని వ్యాఖ్య

విజయవాడ : తాను టిడిపిలోనే ఉన్నానని,వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ నుంచే ఎంపీగా పోటీ చేస్తానని కేశినేని నాని స్పష్టం చేశారు. టీడీపీ అధినేత చంద్రబాబు దేశ రాజకీయాల్లోనే నిజాయితీ కలిగిన వ్యక్తి అని.. అవినీతి మచ్చ లేని నాయకుడు అని ఎంపీ కేశినేని నాని ప్రశంసించారు. ఐటీ నోటీసులు పెద్ద విషయం కాదని.. దానికి వివరణ ఇస్తారని.. ఇవన్నీ తాత్కాలికమేనన్నారు. విజయవాడ లో ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. తాను టీడీపీలోనే ఉన్నానని.. వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ నుంచే ఎంపీగా పోటీ చేస్తానని కేశినేని నాని స్పష్టం చేశారు. 40 సంవత్సరాల రాజకీయ జీవితంలో ఉన్న కింది స్థాయి నాయకులు ఇప్పటికీ కూడా చంద్రబాబు వద్దకు తీసుకువెళ్లక పోవడం దురదృష్టకరమన్నారు.వారిని రాజకీయంగా ఎదగకుండా ఈ ప్రాంతం వాళ్లు వాడుకోని వదిలేశారన్నారు. రాజకీయాల్లో ప్రజాసేవ మాత్రమే ముఖ్య పదవులు అవే వస్తాయన్నారు. పొత్తుల విషయం అధిష్టానం చూసుకుంటుందని కేశినేని నాని అన్నారు. నోటీసులు వచ్చినా సమాధానం చెప్పుకునే నిబద్దత,కమిట్‌ మెంట్‌ చంద్రబాబు వద్ద ఉంది .. నిస్వార్ధంగా అవినీతి మచ్చ లేకుండా రాష్ట్రఆన్ని ఏలిన వ్యక్తి చంద్రబాబు కేశినేని స్పష్టం చేశారు. నోటీసులు ఇవ్వడం రాజకీయపరమైంది..ఇది చాలా రొటీన్‌ విషయమన్నరా?. నోటీసులు రాజకీయపరంగా చిన్న ఈక్వేషన్‌ మాత్రమే డైరీలో చంద్రబాబు తాలూకా చీకి ,జకి ఇచ్చినట్లు రాసుకుంటారు… అలా రాసుకుంటే చంద్రబాబుకు ముట్టినట్లు ఎలా అవుతుందని ప్రశ్నించారు. నాకు తెలిసి అలా జరిగి ఉండరన్నారు. ఇండియా పాలిటిక్స్‌ లో అవినీతి మరక అంటని కొద్ది మందిలో చంద్రబాబు ఒకరన్నారు. ఈ రాష్ట్రం కోసం 40 ఏళ్లు కష్టపడి అవినీతి మచ్చ లేని వ్యక్తి చంద్రబాబు అని స్పష్టం చేశారు. కేశినేని నాని ఇటీవలి కాలంలో టీడీపీకి కాస్త దూరంగా ఉంటున్నారు. నారా లోకేష్‌ యువగళం పాదయాత్రలో కూడా పాల్గొనలేదు. దీంతో ఆయన టీడీపీకి దూరమవుతారన్న చర్చ జరుగుతోంది. కేశినేని నాని సోదరుడు శివనాథ్‌ పార్లమెంట్‌ నియోజకవర్గ పరిధిలో విస్తృతంగా పర్యటిస్తున్నారు. ఇద్దరికీ అభిప్రాయబేధాలున్నాయి. తనకు టిక్కెట్‌ ఇవ్వకపోతే ఇండిపెండెంట్‌ గా పోటీ చేస్తానని.. కేశినేని నాని చెబుతున్నారు. అయితే ఇప్పుడు మాత్రం తన ఐడియాలజీ టీడీపీనేనని అంటున్నారు. తాను టీడీపీ తరపునే పోటీ చేసి మూడో సారి ఎంపీగా పార్లమెంట్‌ కు వెళ్తానని చెబుతున్నారు. దీంతో ఆయన మనసు మార్చుకున్నారన్న వాదన వినిపిస్తోంది. విజయవాడ టీడీపీలో వర్గ పోరాటం ఎక్కువగా ఉంది. ఒకరంటే ఒకరికి పడని పరిస్థితి ఉంది. అందుకే.. కార్పొరేషన్‌ ఎన్నికల్లోనూ టీడీపీ ఓడిపోయిందన్న అభిప్రాయం ఉంది. అయితే ఎవరూ వెనక్కి తగ్గకపోవడంతో.. బెజవాడ టీడీపీలో ఎవరికి వారే అన్నట్లుగా పరిస్థితి మారింది. చంద్రబాబు అసంతృప్తిని సర్దుబాటు చేయాల్సి ఉంది. ఈ లోపు కేశినేని నాని అసంతృప్తి సంచలనం సృష్టించింది. మళ్లీ ఇప్పుడు ఆయన సర్దుకున్న సూచనలు కనిపిస్తున్నాయి.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు