Wednesday, October 9, 2024
spot_img

కేంద్ర నిధులపై తప్పుదోవ పట్టిస్తున్న కెసిఆర్‌

తప్పక చదవండి
  • ఎన్నికల పోరాటనికి బిజెపి శ్రేణులు సిద్దంగా ఉండాలి
  • కిషన్‌ రెడ్డి పిలుపు
    హైదరాబాద్‌ : కేంద్ర నిధుల విషయంలో సీఎం కేసీఆర్‌ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని తెలంగాణ బీజేపీ చీఫ్‌ కిషన్‌ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. శుక్రవారం విూడియాతో మాట్లాడుతూ.. అసెంబ్లీ ఎన్నికలకు సిద్ధం కావాలని బీజేపీ క్యాడర్‌కు పిలుపునిచ్చారు. తొమ్మిదేళ్ళ కాలంలో కేసీఆర్‌ సర్కార్‌ ఒక్క రేషన్‌ కార్డు కూడా ఇవ్వలేదన్నారు. ఎన్నికల హావిూలను అమలు చేయటంలో కేసీఆర్‌ విఫలమయ్యారన్నారు. పోటీ పరీక్షలను కూడా నిర్వహించలేని అసమర్థ ప్రభుత్వం కేసీఆర్‌ సర్కార్‌ అంటూ విరుచుకుపడ్డారు. సెప్టెంబర్‌ 17ను అత్యంత ప్రతిష్టాత్మకంగా కేంద్రం నిర్వహిస్తోం దన్నారు. ప్రధాని మోదీ జన్మదినం సందర్భంగా.. సెప్టెంబర్‌ 17నుంచి అక్టోబర్‌ 2వరకు సేవా కార్యక్రమాలు ఉంటాయన్నారు. వివిధ రూపాల్లో 27 లక్షల కోట్ల రూపాయలు తెలంగాణకు ఇప్పటి వరకు కేంద్రం ఇచ్చిందని తెలిపారు. డబుల్‌ బెడ్రూం, పెన్షన్లపై కేసీఆర్‌ ఇచ్చిన మాట మాట తప్పారని కిషన్‌రెడ్డి వ్యాఖ్యలు చేశారు.
-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు