Monday, April 29, 2024

యూపీఎస్సీలో లీగల్, సైంటిఫిక్ ఆఫీసర్ ఉద్యోగాలు..

తప్పక చదవండి

కెమికల్, బాలిస్టిక్స్, టాక్సికాలజీ, ఆక్యుపేషనల్ హెల్త్, డాక్యూమెంట్స్ త‌దిత‌ర విభాగాల‌లో లీగల్ ఆఫీసర్, సైంటిఫిక్ ఆఫీసర్, డిప్యూటీ ఆర్కిటెక్ట్, సైంటిస్ట్ బి, జూనియర్ సైంటిఫిక్ ఆఫీసర్, అసిస్టెంట్ డైరెక్టర్ ఆఫ్ మైన్స్ సేఫ్టీ, డైరెక్టర్ జనరల్, అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ పోస్టుల భ‌ర్తీకి భారత ప్రభుత్వరంగ సంస్థ అయిన యూనియన్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్ (యూపీఎస్సీ) ప్ర‌క‌ట‌న విడుద‌ల చేసింది. ద‌ర‌ఖాస్తు చేసుకునే అభ్య‌ర్థులు పోస్టుల‌ను బ‌ట్టి బ్యాచిలర్ డిగ్రీ, మాస్టర్స్‌ డిగ్రీ, న్యాయశాస్త్రంలో డిగ్రీ, ఎంఎస్సీ, ఎంఈ, ఎంటెక్, ఉత్తీర్ణ‌తతో పాటు ప‌ని అనుభ‌వం క‌లిగి ఉండాలి. రిక్రూట్‌మెంట్ టెస్ట్, ఇంటర్వ్యూ ద్వారా అభ్య‌ర్థులు ఎంపిక ఉంటుంది.

మొత్తం పోస్టులు : 71.. పోస్టులు : లీగల్ ఆఫీసర్, సైంటిఫిక్ ఆఫీసర్, డిప్యూటీ ఆర్కిటెక్ట్, సైంటిస్ట్ బి, జూనియర్ సైంటిఫిక్ ఆఫీసర్, అసిస్టెంట్ డైరెక్టర్ ఆఫ్ మైన్స్ సేఫ్టీ, డైరెక్టర్ జనరల్, అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్.. విభాగాలు : కెమికల్, బాలిస్టిక్స్, టాక్సికాలజీ, ఆక్యుపేషనల్ హెల్త్, డాక్యూమెంట్స్.. అర్హ‌త‌లు : బ్యాచిలర్ డిగ్రీ, మాస్టర్స్‌ డిగ్రీ, న్యాయశాస్త్రంలో డిగ్రీ, ఎంఎస్సీ, ఎంఈ, ఎంటెక్, ఉత్తీర్ణ‌తతో పాటు ప‌ని అనుభ‌వం క‌లిగి ఉండాలి… వయసు: 30 నుంచి 58 ఏండ్ల మ‌ధ్య‌ ఉండాలి.. ఎంపిక : రిక్రూట్‌మెంట్ టెస్ట్, ఇంటర్వ్యూ ద్వారా.. జీతం : రూ. 44900 నుంచి రూ.225000 వ‌ర‌కు (పోస్టులను బ‌ట్టి).. దరఖాస్తు ఫీజు: రూ.25.. దరఖాస్తు : ఆన్‌లైన్‌లో.. చివరి తేది: జూలై 27.. వెబ్‌సైట్ : https://www.upsc.gov.in/

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు