Wednesday, April 17, 2024

శ్రీవిష్ణు కెరీర్‌లోనే బిగ్గెస్ట్‌ హిట్‌..

తప్పక చదవండి

హిట్టు, ఫ్లాపుతో సంబంధం లేకుండా కథాబలమున్న సినిమాలు చేస్తుంటాడు టాలీవుడ్‌ హీరో శ్రీవిష్ణు. ఇటీవలే వివాహ భోజనంబు ఫేం రామ్‌ అబ్బరాజు దర్శకత్వంలో సామజవరగమన సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చాడు. ఫన్‌ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన ఈ చిత్రం జూన్ 29న థియేటర్లలో గ్రాండ్‌గా విడుదలైంది. ప్రీమియర్ షోలకు మంచి రెస్పాన్స్ రావడం.. సినిమాకు బాగా కలిసొచ్చింటున్నారు సినీ క్రిటిక్స్‌. ఇప్పటికే ఈ చిత్రం యూఎస్‌ఏ బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లు రాబడుతున్నట్టు అప్‌డేట్స్‌ కూడా వచ్చాయి. తాజాగా సామజవరగమన కలెక్షన్లను అందరితో షేర్ చేసుకున్నారు మేకర్స్‌. ఈ చిత్రం ఇటీవలే మూడో వారంలోకి ఎంట్రీ ఇచ్చింది. ఇప్పటికీ మంచి కలెక్షన్లు రాబడుతూ.. ఈ మధ్య కాలంలో వచ్చిన ఏ చిన్న సినిమా కూడా సాధించని రికార్డును సృష్టించబోతుందని తాజా అప్‌డేట్‌తో అర్థమవుతోంది. శ్రీవిష్ణు తాజా చిత్రం రూ.50 కోట్లు గ్రాస్‌ మార్క్‌ దిశగా పయనిస్తోంది. తాజాగా మేకర్స్‌ షేర్ చేసిన న్యూస్‌ ప్రకారం సామజవరగమన ఇప్పటివరకు (17 రోజులు) రూ.47.24 కోట్లు గ్రాస్‌ వసూళ్లు చేసింది. మరికొన్ని రోజుల్లోనే రూ.50 కోట్లు గ్రాస్‌ మార్క్‌ను కూడా చేరుకునే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయంటున్నారు ట్రేడ్ పండితులు. ఈ చిత్రం శ్రీవిష్ణు కెరీర్‌లోనే బిగ్గెస్ట్‌ హిట్‌గా నిలిచిందని తాజా అప్‌డేట్స్ చెబుతున్నాయి.

సామజవరగమన గ్లింప్స్ వీడియో, టీజర్‌, ట్రైలర్‌.. ఇలా ప్రతీది సినిమాపై హైప్‌ పెంచేసి మంచి బజ్‌ క్రియేట్ చేశాయి. ఈ చిత్రంలో బిగిల్‌ (విజిల్‌) ఫేం రెబా మోనికా జాన్‌ ఫీ మేల్ లీడ్ రోల్‌ పోషించగా.. సుదర్శన్‌, శ్రీకాంత్ అయ్యంగార్‌, వెన్నెల కిశోర్‌, రఘుబాబు, రాజీవ్ కనకాల, దేవీ ప్రసాద్‌, ప్రియ ఇతర నటీనటులు కీలక పాత్రలు పోషించారు. ఈ చిత్రాన్ని ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్‌ తో కలిసి హాస్య మూవీస్‌ బ్యానర్‌ పై రాజేశ్‌ దండా నిర్మించారు.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు