Saturday, May 11, 2024

నిప్పుల కొలిమిలో భూగోళం!

తప్పక చదవండి

గత రెండు శతాబ్దాల్లో వాతావరణంలో కార్బన్‌ డై ఆక్సైడ్‌ స్థాయి 40 శాతం వరకు పెరగడం ఓ ప్రమాద హెచ్చరికగా తెలుసు కోవాలి. 18వ శతాబ్దంలో 280 పిపియం ఉన్న కార్బన్‌ డై ఆక్సైడ్‌ పరిమాణం 2020 నాటికి 414 పిపియంలకు చేరడం గమనిం చారు. 1800వ సంవత్సరంలో భారత జనాభా 17 కోట్లు ఉండ గా నేడు 140 కోట్ల మార్కును దాటడం మనకు విధితమే. గత 75 ఏండ్ల స్వతంత్ర భారతంలో పేదరికం గణనీయంగా తగ్గినప్ప టికీ, అదే క్రమంలో భూతాపానికి కారణమైన కార్బన్‌ డై ఆక్సైడ్‌ లాంటి గ్రీన్‌హౌజ్‌గ్యాసెస్‌ (హరిత గృహవాయువులు) పరిమాణం కూడా గణనీయంగా పెరగడం ప్రమాదకరంగా మారుతు న్నది. ప్రపంచంలో 1800వ సంవత్సరప్రాంతంలో పారిశ్రామిక విప్లవం ప్రారంభమైన తరువాత మానవాళి శిలాజ ఇంధనాలను విచక్షణా రహితంగా వినియోగించడంతో కార్బన్‌ డై ఆక్సైడ్‌, ఓజో న్‌, నైట్రస్‌ ఆక్సైడ్‌, మీథేన్‌, సల్ఫర్‌ సమ్మేళనాలు వాతావరణంలో విప రీతంగా పెరిగి ప్రతికూలమార్పులకు దారితీయడం మ్నెదలైంది.
భారత్‌ను భూతాప భూతం కబళించనుందా..?.. భూతాప భూతం భారత దేశాన్ని కబళించేందుకు సిద్ధంగా ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. చేతులు కాలక ముందే ఆకులు సిద్ధం చేసుకోవడానికి భారత ప్రభుత్వం కీలక చర్యలను చేపట్టాల్సి ఉంది. వాతావరణ ప్రతికూల మార్పులు, భూతాపాలను కట్టడి చేయడానికి భారత ప్రభుత్వం దశలవారీగా అనేక చర్యలను చేపట్టడానికి కంకణ బద్దత వ్యక్తం చేసింది. 2030 నాటికి దాదాపు 50 శాతం ఉద్గారాలను తగ్గించడానికి శిలాజ ఇంధన వినియోగానికి దశల వారీగా స్వస్తి పలికి, 500 గీగా వాట్ల సాంప్రదాయేతర శక్తి వనరుల వినియోగానికి శ్రీకారం చుట్టడం పెద్ద ఎత్తున మ్నెదలైంది. ఈ లక్ష్యం చేరడానికి భారత ప్రభుత్వం ప్రతి ఏట ఒక బిలియన్‌ టన్నుల కార్బన్‌ ఉద్గారాలను తగ్గించాల్సి ఉంటుంది. 2070 నాటికి భారతంలో పూర్తిగా కార్బన్‌ ఉద్గారాలను తగ్గించుటకు (జీరో కార్బన్‌) ప్రతిన బూనడం మనకు తెలుసు. ప్రపంచ దేశాలు వాతావరణ ప్రతికూల మార్పులను అరికట్టే ప్రయత్నాల 180 దేశాల జాబితాలో ఇండియా 165వ స్థానంలో ఉండడం గమనించారు. భారత దేశంలో సాలీనా దాదాపు 3 గీగా టన్నుల కార్బన్‌ డై ఆక్సైడ్‌ వాతావరణంలో చేరుతోంది. ప్రపంచ కార్బన్‌ ఉద్గారాల్లో ఇండియా 7 శాతం కారణం అవుతున్నది. దేశ ప్రమాదకర ఉద్గారాల్లో 79 శాతం కార్బన్‌ డై ఆక్సైడ్‌, 14 శాతం మీథేన్‌, 5 శాతం నైట్రస్‌ ఆక్సైడ్‌ ఉన్నట్లు తేలింది. ప్రపంచ స్థాయిలో ప్రతి వ్యక్తి సాలీనా 1 టన్ను కార్బన్‌ డై ఆక్సైడ్‌ విడుదలకు కారణం కాగా ఇండియాలో ఒక్కొక్కరు సగటున 2 టన్నుల ఉద్గారాలను విడుదల చేయడం గమనించారు. వివిధ దేశాల అధిక కార్బన్‌ ఉద్గారాల జాబితాలో చైనా, అమెరికా, ఇండియా, రష్యాలు తొలి నాలుగు స్థానాల్లో ఉండడంతో వాటిని తగ్గించే బాధ్యత కూడా ఆయా దేశాల మీదనే ఉందని గమనించాలి. 2050 నాటికి న్యూజిలాండ్‌ జీరో కార్బన్‌ ఉద్గార దేశంగా ప్రపంచ దేశాలకు ఆదర్శం కానుంది.
భూతాపాన్ని కట్టడి చేసే వ్యవసాయం: ఐరాస ఆహార, వ్యవసాయ సంస్థ (ఫుడ్‌ అండ్‌ అగ్రికల్చర్‌ ఆర్గనైజేషన్‌, యఫ్‌ఏఓ) వివరాల ప్రకారం భారత్‌లో 70 శాతం గ్రామీణ జనాభా ఉంటూ వ్యవసా యం, దాని అనుబంధ రంగాలు ప్రధాన వృత్తిపై ఆధారపడి ఉన్నారు. భారత్‌లో సాలీనా 275 మిలియన్‌ టన్నుల ఆహార ధాన్యాల ఉత్పత్తి జరుగుతోంది. బియ్యం, గోధుమలు, చెరుకు, పత్తి, వేరుశనగల దిగుబడుల్లో భారత్‌ ద్వితీయ స్థానంలో నిలవ డం మనకు తెలుసు. వ్యవసాయ రంగం ద్వారా హరిత గృహ వాయువులను కట్టడి చేయడానికి మార్గాలను వెతకాల్సిన సమ యం ఆసన్నమైంది. వ్యవసాయ రంగంలో శిలాజ ఇంధన విని యోగానికి ప్రత్యామ్నాయంగా ఆధునిక విప్లవాత్మక మార్పులకు స్వీకారం చుట్టే సౌర విధ్యుత్తు వినియోగం ఆచరణ సాధ్యం కావాలి. వాతావరణ హిత సాగు పద్దతులను అమలులోకి తేవడం ద్వారా సాలీనా దాదాపు 60 మిలియన్‌ టన్నుల కార్బన్‌ ఉద్గారాలు తగ్గుతాయని విశ్లేషించారు. రైతుల ఆదాయం పెరగడంతో పాటు డబ్బు ఆదా కావడానికి వ్యవసాయరంగంలో సౌర విత్యుత్తు వినియోగాన్ని ప్రోత్సహిం చాల్సిన బాధ్యత ప్రభుత్వాలు, వృత్తినిపుణు ల మీద ఉన్నది. 2020-21లో భారత రైతాంగం కృషితో సాలీనా 12.15 కోట్ల టన్నుల బియ్యం, 10.9 కోట్ల టన్నుల గోధుమల ఉత్పత్తి జరుగుతూనే ఇతర పలు రకాలైన ధాన్యాలైన మిలెట్స్‌, మ్నెక్క జొన్న లాంటివి పండిస్తూ ఆకలిని, పేదరికాన్ని భారత్‌ పొలిమేరల ఆవలికి తరిమే గట్టి ప్రయ త్నాలు జరుగుతున్నాయి. బియ్యం, గోధు మల కన్న మిలెట్స్‌లో ప్రోటీన్లు, కొవ్వులు, పీచు పదార్థాలు అధికం గా ఉన్నందున వాటి వాడకం ఆరోగ్యదాయకమని తెలుస్తున్నది. భారతీయుల్లో 70 శాతం జనాభా మటన్‌, చికెన్‌, చేపల వంటి మాంసాహారాన్ని అధికంగా తీసుకొంటున్నారు. మాంసం, చికెన్‌ వినియోగం కన్న చేపలను వాడటం వల్ల పోషక విలువలు అంద డమే కాకుండా కార్బన్‌ ఫూట్‌ప్రింట్‌ గణనీయంగా తగ్గుతుంది.
పునరుత్పాదక శక్తి వనరుల వినియోగం :
నేటి ప్రతికూల వాతా రణ మార్పుల నేపథ్యంలో ప్రపంచ దేశాలు తమ కర్తవ్యాల ను గుర్తెరిగి సాంప్రదాయ తరిగే శిలాజ ఇంధనాల వినియోగాలను పూర్తిగా తగ్గించుకుంటూ తరగని సాంప్రదాయేతర పునరుత్పాదక శక్తి సామర్థ్యాలను పెంచుకుంటూ భూతాపం, మహమ్మారుల విజృంభన లాంటి విపత్తులను అరికట్టుటకు ప్రతి బూనాలి. భూతాపానికి ప్రధాన కారణమైన కార్బన్‌ డై ఆక్సైడ్‌ ఉద్గారాలను క్రమం తగ్గిస్తేనే భూమి నివాసయోగ్యతను అవుతుందని తెలుసు కోవాలి. ఇలాగే ప్రపంచ మానవాళి నిర్లక్ష్యం చేస్తే ‘తను కూర్చున్న కొమ్మను తానే నరుక్కున్న చందం’గా మానవాళితో పాటు జీవకోటి వినాశనానికి సిద్ధంగా ఉండాల్సి ఉంటుంది. ‘దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకుందాం’, తక్షణమే కార్బన్‌ ఉద్గార కార్యాలకు చర మగీతం పాడుతూ, పునరుత్పాదక శక్తి వినియోగాన్ని పెంచు కుంటూ, రాబోయే తరాలకు నివాసయోగ్య ధరణిని బహుమతిగా అందజేద్దాం.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు