Wednesday, February 28, 2024

పొద్దున రాజీనామా..సాయంత్రానికి ప్రమాణస్వీకారం..

తప్పక చదవండి
  • బిహార్‌లో కొలువు దీరిన కొత్త ప్రభుత్వం
  • 9వ సారి సీఎంగా ప్రమాణం చేసిన జేడీయూ అధినేత
  • కూటమికి గుడ్ బై చెప్పిన కొన్ని గంటలకే ప్రభుత్వ ఏర్పాటు
  • ఏడాదిన్నరలో మళ్లీ కూటమి మార్చిన నితీశ్ కుమార్
  • మలుపులు తిరుగుతున్న బీహార్ రాజకీయ చదరంగం
  • బీజేపీ నుంచి ఇద్దరికి డిప్యూటీ సీఎంలుగా అవకాశం

బిహార్‌ ముఖ్యమంత్రి జేడీయూ అధినేత నితీశ్ కుమార్ రికార్డుస్థాయిలో తొమ్మిదో సారి ప్రమాణస్వీకారం చేశారు. రాజ్‌భవన్‌లో నితీష్‌ కుమార్‌తో గవర్నర్ రాజేంద్ర అర్లేకర్ ప్రమాణం స్వీకారం చేయించారు. తొమ్మిదోసారి ముఖ్యమంత్రిగా ప్రమాణం చేసిన నితీశ్.. సరికొత్త రికార్డును నెలకొల్పారు. నితీశ్‌తో పాటు మరో ఎనిమిది మందిని మంత్రులుగా ప్రమాణస్వీకారం చేయించారు గవర్నర్. బీజేపీకి చెందిన విజయ్ కుమార్ సిన్షా, సామ్రాట్ చౌదరిలను డిప్యూటీ సీఎంలుగా నియమించారు. గత కొన్ని రోజులుగా బీహార్ రాజకీయాల్లో నెలకొన్న అనిశ్చితి ఆదివారంతో తొలగిపోయింది. మీడియా రిపోర్టులు పేర్కొన్నట్టుగానే నితీశ్ కుమార్ విపక్షాల ఇండియా కూటమికి గుడ్‌బై చెప్పారు. ఆదివారం ఉదయం 10 గంటల సమయంలో పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీలతో చర్చించారు. అనంతరం గవర్నర్‌కు రాజీనామా లేఖ సమర్పించారు. దీంతో ప్రభుత్వ ఏర్పాటులో 18 నెలల కిందట మద్ధతు ఇచ్చిన ఆర్జేడీకి నితీశ్ పెద్ద షాక్ ఇచ్చారు. ఆర్జేడీతో పొత్తును ముగించుకుని ప్రతిపక్ష కూటమి నుంచి వైదొలగుతున్నట్టు నితీశ్ కుమార్ తన నిర్ణయాన్ని ప్రకటించారు. ఇక బీజేపీ సారథ్యంలోని ఎన్డీయేలో చేరడమే మిగిలి ఉంది.

ప్రధాని అభినందనలు..
బిహార్‌లో కొత్త ప్రభుత్వం కొలువుదీరడంపై ప్రధాని నరేంద్ర మోదీ స్పందించారు. ఎక్స్ వేదికగా ఓ పోస్ట్ పెట్టారు. బిహార్‌లో ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పాటు కావడం సంతోషంగా ఉందని, రాష్ట్ర అభివృద్ధికి ఇది బాటలు వేస్తుందని అన్నారు. రాష్ట్ర ప్రజల ఆకాంక్షల మేరకు ప్రభుత్వం నడుచుకుంటుందని తెలిపారు.

- Advertisement -

పట్నా సమీపంలోని ఓ భక్తియార్పర్లో 1951లో సీతీశ్ కుమార్ జన్మించారు. ఆయన తండ్రి స్వాతంత్య్ర్య సమరయోదుడు. ఆయుర్వేద వైద్యుడు. బిహార్ ఇంజినీరింగ్ కాలేజ్ (ప్రస్తుతం పట్నా ఎన్ఐటీ)లో ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్ పూర్తిచేసిన నీతీశ్.. విద్యార్థి దశ నుంచే రాజకీయాల్లో చురుగ్గా వ్యవహరించేవారు. జయప్రకాశ్ నారాయణ్ చేపట్టిన ఉద్యమంలో పాల్గొన్నారు. ఆ సమయంలోనే లాలూ ప్రసాద్, సుశీల్ కుమార్ మోదీ వంటి నేతలతో పరిచయం ఏర్పడింది.

1985 బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ భారీ విజయం సాదించినప్పటికీ.. నీతీశ్ లోక్ దళ్ పార్టీ తరపున హర్నెత్ నుంచి గెలుపొంది తొలిసారి అసెంబ్లీలో అడుగుపెట్టారు. ఐదేళ్ల తర్వాత ఎంపీగా ఎన్నికయ్యారు. బీహార్లో రిజర్వేషన్ల ఉద్యమం కొనసాగుతోన్న తరుణంలో జార్జ్ ఫెర్నాండెజ్తో కలిసి 1994లో సమతా పార్టీని ఏర్పాటు చేశారు. తొలిసారి ముఖ్యమంత్రి బాధ్యతలు చేపట్టిన ఆయన కేవలం వారం రోజులే (2000 మార్చి 3- 10) కొనసాగారు. అనంతరం జనతాదళ్ (యునైటెడ్)ను ఏర్పాటు చేసి.. రాష్ట్రంలో మిత్రపక్షాలతో ప్రభుత్వాన్ని ఏర్పాటు. చేస్తున్నారు. 2005లో బిహార్ ముఖ్యమంత్రిగా మరోసారి బాధ్యతలు చేపట్టిన నీతీశ్ కుమార్.. మొదటి ఐదేళ్లలో దూకుడుగా వ్యవహరించారు. ప్రత్యర్ధుల పై దాడులు, డబ్బుల కోసం కిడ్నాప్లతో రాష్ట్రం అట్టుడికిపోతున్న తరుణంలో శాంతిభద్రతలను గాడిన పెట్టి విమర్శకుల మన్ననలు పొందారు. భాజపాతో మిత్రపక్షంగా కొనసాగుతూనే ముస్లిం (పస్మందా) వర్గానికి చేరువయ్యే ప్రయత్నం చేశారు. 2014 మే వరకు అధికారంలో కొనసాగారు.

2013లో భాజపాకు బ్రేకప్ చెప్పిన నీతీశ్ కుమార్.. కాంగ్రెస్, సీపీఐ సాయంతో ప్రభుత్వాన్ని కొనసాగించారు. తదుపరి ఏడాది లోక్ సభ ఎన్నికల్లో జేడీయూ ఓటమికి నైతిక బాధ్యత వహిస్తూ అధికారం నుంచి వైదొలిగారు. ఆ సమయంలో తొమ్మిది నెలలపాటు జితన్రామ్ మాంఝి సీఎంగా కొనసాగారు. 2015లో జేడీయూ, కాంగ్రెస్, ఆర్జేడీ కలిపి మహా కూటమిగా ఏర్పడి ప్రభుత్వం ఏర్పాటు చేశాయి. అది రెండేళ్లపాటే కొనసాగింది. ఉపముఖ్యమంత్రిగా ఉన్న తేజస్వీ యాదవ్పై ఆవినీతి ఆరోపణలు రావడంతో నిర్ణయాన్ని మార్చుకున్న నీతీశ్. 2017లో తిరిగి ఎన్డీఏ గూటికి చేరారు. 2020 అసెంబ్లీ ఎన్నికల్లో జేడీయూ పరాజయానికి కారణం భాజపానే అని భావించిన నీతీశ్ కుమార్.. 2022లో మళ్లీ ఎన్డీఏను వీదారు. తిరిగి మహాకూటమికి చేరువైన ఆయన.. సీఎంగా బాధ్యతలు చేపట్టి 18నెలలు గడవక ముందే మళ్లీ కాషాయ పార్టీతో దోస్తీకి సై అన్నారు.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు