Sunday, May 19, 2024

తెలంగాణలో డీఎస్సీ నియామక పరీక్ష వాయిదా..

తప్పక చదవండి

తెలంగాణలో ఉపాధ్యాయ నియామక పరీక్ష వాయిదా వేశారు. ఎన్నికల నేపథ్యంలో వాయిదా వేస్తున్నట్లు పాఠశాల విద్యాశాఖ తెలిపింది. షెడ్యూల్ ప్రకారం నవంబర్ 20 నుండి నవంబర్ 30 వరకు ఈ పరీక్షలు జరగాల్సి ఉన్నాయి. ఇప్పటికే గ్రూప్-2 పరీక్షలు వాయిదా పడగా.. తాజాగా డీఎస్పీ కూడా వాయిదా వేశారు. కొత్త తేదీలను కూడా ప్రకటించింది. ఇదే క్రమంలో డీఎస్సీ టీఆర్టీ 2023 పరీక్షపై అధికారుల్లోనూ, అభ్యర్థుల్లోనూ తర్జనభర్జనలు మొదలయ్యాయి. ఇప్పటికే దరఖాస్తుల ప్రక్రియ కొనసాగుతుండగా.. పరీక్షల షెడ్యూల్ కూడా వచ్చేసింది. కానీ ఎన్నికల షెడ్యూల్ విడుదల కావడంతో ఈ పరీక్షలు వాయిదా పడే అవకాశం ఉందనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. తెలంగాణ డీఎస్సీ నోటిఫికేషన్‌లో భాగంగా.. 5,089 పోస్టులను భర్తీ చేయనున్నారు. ఇందులో స్కూల్‌ అసిస్టెంట్‌, సెకండరీ గ్రేడ్‌ టీచర్‌, భాషాపండితులు, పీఈటీ పోస్టులున్నాయి. ఈ పరీక్షలను నవంబర్‌ 20 నుంచి 30 వరకు కంప్యూటర్‌ బేస్డ్‌ టెస్ట్‌ (సీబీటీ) పద్ధతిలో నిర్వహించనున్నారు. నవంబర్‌ 20, 21 తేదీల్లో స్కూల్‌ అసిస్టెంట్‌ అన్ని సబ్జెక్టులకు సంబంధించిన పరీక్షలు ఉంటాయి. నవంబర్‌ 22న స్కూల్‌ అసిస్టెంట్‌ లాంగ్వెజ్‌ సబ్జెక్టులు, నవంబరు 23న ఫిజికల్‌ ఎడ్యుకేషన్‌ టీచర్‌ పోస్టుల అభ్యర్థులకు నిర్వహిస్తారు. వీరందరికీ మొదటి విడతలోనే పరీక్షలు నిర్వహిస్తారు. నవంబరు 24న లాంగ్వేజ్‌ పండిట్‌ అభ్యర్థులకు రెండు విడతల్లో నిర్వహించనున్నారు. నవంబరు 25 నుంచి 30 వరకు సెకండరీ గ్రేడ్‌ టీచర్‌ (ఎస్జీటీ) పరీక్షలు నిర్వహించనున్నారు. అయితే.. రాష్ట్రంలో నవంబర్ 30వ తేదీనే పోలింగ్ ప్రక్రియ జరగనుంది. కేవలం 30వ తేదీనే కాకుండా అంతకుముందే సుమారు 20 రోజుల ముందునుంచే అధికారులు ఏర్పాట్లలో నిమగ్నమవుతారు. ఈ నేపథ్యంలో టీఎస్‌ డీఎస్సీ పరీక్షలు దాదాపు వాయిదా పడే అవకాశమున్నట్లు వినిపిస్తోంది. అంతేకాకుండా అభ్యర్థులు కూడా ఓటు వేసేందుకు గ్రాామాలకు వెళ్లాల్సి ఉంటుంది. మరోవైపు పరీక్షా కేంద్రాల వద్ద పోలీసు భద్రత కూడా అవసరం. ఓవైపు ఎన్నికల ప్రక్రియ విధుల్లో ఉండగా మరోవైపు పరీక్షల నిర్వహణ కష్టమవుతుందనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. త్వరలో తెలంగాణ డీఎస్సీ పరీక్షపై కూడా అధికారికంగా స్పష్టత వచ్చే అవకాశం ఉంది.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు