Saturday, May 18, 2024

డాక్టర్‌ అవతారం ఎత్తిన…దోమ ప్రభుత్వ ఆసుపత్రి హెల్త్‌ అసిస్టెంట్‌

తప్పక చదవండి
  • ఆసుపత్రిగా ఏర్పాటు చేసుకున్న బిల్డింగ్‌కి పేరు లేకపోవడం విశేషం
  • జిల్లాలో అనుమతి లేని ప్రైవేటు ఆస్పత్రులు
  • రోగుల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్న హరి డేకేర్‌ క్లినిక్‌
  • నిబంధనలకు విరుద్ధంగా రోగులకు వైద్య చికిత్సలు
  • లక్షల రూపాయలు పోగు చేసుకుంటున్న హెల్త్‌ అసిస్టెంట్‌ వైద్యధికారి
  • చూసి చూడనట్లు వ్యవహరిస్తున్న సంబంధిత జిల్లా వైద్య అధికారులు

పరిగి : వచ్చిరాని వైద్యంతో రోగుల ప్రాణాలతో చెలగాటమాడుతూ లక్షల రూపాయలు సంపాదిస్తున్నారు ఆర్‌ఎంపీలు, వికారాబాద్‌ జిల్లా,కుల్కచర్ల మండల కేంద్రంలో అనుమతులు లేకుండానే ఆసుపత్రులు పుట్టగొడుగుల పుట్టుకొస్తున్నాయి. అర్హత లేని ఏఎన్‌ఎం జిఎన్‌ఎమ్‌ లను నియమించుకొని రోగుల దగ్గర వేల రూపాయలు సంపాదిస్తున్నారు. రోగానికి సంబంధించిన వైద్యం చేయకుండా మరొక వైద్యం చేస్తూ ఇంజక్షన్‌లు ఇస్తూ పెద్ద మొత్తంలో డబ్బులు దండుకుంటున్నారు. అయితే జిల్లా వైద్య అధికారుల అండదండలతో ఈ తతంగం నడుస్తున్నాయని ఆరోపణలు జోరుగా వినబడుతున్నాయి.వికారాబాద్‌ జిల్లా,దోమ మండల కేంద్రం ప్రభుత్వ ఆసుపత్రిలో హెల్త్‌ అసిస్టెంట్‌గా విధులు నిర్వహిస్తున్న శ్రీనివాసరావు కుల్కచర్ల మండల కేంద్రంలో బిల్డింగ్‌ లో ఆస్పత్రిని ఏర్పాటు చేసుకొని ఏఎన్‌ఎం జిఎన్‌ఎంలుగా అనుభవం లేని వారిని పెట్టుకొని వచ్చిరాని వైద్యంతో జనాల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. చౌడపూర్‌ మండలం వాళ్య నాయక్‌ తండాకు చెందిన మాణిక్య నాయక్‌ తన ఎడమ చేతి నొప్పిగా ఉందని కుల్కచర్ల మండల కేంద్రంలోని ప్రవేట్‌ ఆస్పత్రి అయినా హరి డెకేర్‌ డాక్టర్‌గా అవతారమెత్తిన శ్రీనివాసరావును బుధవారం సంప్రదించాడు. వచ్చిరాని వైద్యంతో చేతికి మందు రాసి రెండో ఇంజక్షన్లు ఇచ్చి మందులు రాసి పంపాడు. మరుసటి రోజు తన చేతికి బొబ్బలు వచ్చి చర్మం మొత్తం ఊడిపోయింది. దీంతో నొప్పిగా ఉందని తన భార్య సాదుబాయిని వెంటపెట్టుకొని వైద్యుడు దగ్గరికి వెళ్తే నాకు ఏమీ సంబంధం లేదని దుర్భాషలాడుతూ వేరే ఏదైన ఆసుపత్రికి వెళ్లి చూపించుకో పో అని బెదిరించాడు. హెల్త్‌ అసిస్టెంట్‌గా విధులు నిర్వహిస్తూ ఆర్‌.ఎం.పి డాక్టర్‌గా ఇంజక్షన్‌ ఇవ్వడంతో రోగికి వైద్యం వికటించి చెయ్యి చర్మం మొత్తం ఊడిపోయింది. కావున ప్రజల ప్రాణాలతో చెలగాట మాడుతున్న ఆర్‌ఎంపీ డాక్టర్‌పై జిల్లా వైద్యాధి కారులు చర్యలు తీసుకో వాలని మండల ప్రజలు కోరుతున్నారు. పత్రికా మిత్రులు : కుల్కచర్ల మండల, పరిగి నియోజక వర్గం పత్రికా మిత్రులు డాక్టర్‌ శ్రీనివాస్‌ రావును వివరణ అడగగా పంతన లేని సమాధానాలు చెబుతూ ఏం చేస్తారో చేసుకోండి అని సమాధానం ఇచ్చారు.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు