Saturday, May 4, 2024

వసూళ్ల రాంబాబు..! (పార్ట్‌-2)

తప్పక చదవండి
  • వసూళ్ల కోసమే కో-ఆర్టినేషన్‌
  • స్వచ్ఛ ఆటోల కేటాయింపులకు.. రొక్కం ముట్టజెప్పాల్సిందే
  • కాసుల కోసం ఆటోలను అమ్మేస్తున్న వైనం
  • గోషామహల్‌ సర్కిల్‌-14లో ఔట్‌ సోర్సింగ్‌..
  • అవినీతి తిమింగలం రాంబాబు చిత్రవిచిత్రాలు
  • పూర్తిగా సహకరిస్తున్న ఏఎంహెచ్‌ఓ శ్రీకాంత్‌ రెడ్డి

హైదరాబాద్‌ : జీహెచ్‌ఎంసీ గోషామహల్‌ సర్కిల్‌-14లో ఔట్‌ సోర్సింగ్‌ పద్ధతిన శాటిటేషన్‌ విభాగంలో కో-ఆర్డినేటర్‌గా విధులు నిర్వహిస్తున్న రాంబాబు లీలలు తవ్వినకొద్ది వెలుగులోకి వస్తున్నాయి. కో-ఆర్డినేటర్‌ ఎస్‌ఎఫ్‌ఏలను అడ్డం పెట్టుకొని సపాయి కార్మికుల దొంగ సంతకాలు, నకిలీ థంబ్‌ ఇంప్రెషన్స్‌ తో ఎలా డబ్బులు నొక్కేస్తున్నారనే దానిపై ఆదాబ్‌లో కథనం ప్రచురి తమైంది. ఈ వార్త జీహెచ్‌ఎంసీ సర్కిల్స్‌లో తీవ్ర కలకలం రేపింది. ఈనేపథ్యంలోనే కో-ఆర్డినేటర్‌ రాంబాబు అరాచకాలపై మరింత ఫోకస్‌ పెట్టిన ఆదాబ్‌కు ఆయన గారికి సంబంధించిన మరిన్ని లీలలు బయటపడ్డాయి. కో ఆర్డినేటర్‌ ముసుగులో రాంబాబు చేస్తున్న వసూళ్ల పర్వాలు ఒక్కొక్కటిగా వెలుగు చూస్తున్నాయి. అందులో భాగంగానే గోషామహల్‌ సర్కిల్‌ కింగ్‌ మేకర్‌ రాంబాబుపై ఆదాబ్‌ హైదరాబాద్‌ స్వీక్వెల్‌ స్టోరీ. రాంబాబు సపాయి కార్మికుల దొంగ థంబ్‌ ఇంప్రెషన్స్‌ తో డబ్బులు నొక్కేయడమే కాదు.. స్వచ్చ ఆటోల అలాట్మెంట్‌, వాటి అమ్మకం ద్వారా పెద్ద మొత్తంలో పైసల వసూల్‌ కు పాల్పడుతున్నారు. సర్కిల్‌ పరిధిలో కామాటిగా విధులు నిర్వహిస్తున్న అంజయ్య అనే వ్యక్తికి స్వచ్ఛ ఆటో అలాట్మెంట్‌ చేయించుకోవడం జరిగింది. ఆటో కేటాయించబడిన అంజయ్య, బంగారయ్య అనే డ్రైవర్‌ను నియమించుకొని కోఠి ఈ.ఎన్‌.టి హాస్పిటల్‌ ఏరి యాలో స్వచ్‌ ఆటో ద్వారా చెత్త ను సేకరించడం జరు గుతుంది.

ఈ విషయాన్ని గమనించిన మన కింగ్‌ మేకర్‌ రాంబాబు అంజయ్యకు కేటాయించిన స్వచ్ఛ ఆటోను అంబర్‌ పేట్‌లోని మరో వ్యక్తికి సుమారు రూ.5 లక్షలకు ఏరియాను కేటాయించి అమ్మినట్లు తెలుస్తుంది. అంజయ్య ను ఎస్‌ఎఫ్‌ఏ మధుకర్‌ దగ్గర కామాటిగా విధులలో నియమించి, అంజయ్య దగ్గర పనిచేస్తున్న ఆటో డ్రైవర్‌ బంగారయ్యను ఎస్‌ఎఫ్‌ఏ రహీం మొబైల్‌ టీం నందు కామాటిగా చేర్పించడం జరిగింది. అయితే రాష్ట్ర ప్రభుత్వం నగరం క్లీన్‌ అండ్‌ గ్రీన్‌ గా ఉండాలన్న గొప్ప ఆలోచనతో, కొంత మందికి ఉపాధి అవకాశాలు కల్పించాలనే ఉద్దేశ్యంతో సబ్సిడీ ద్వారా స్వచ్‌ ఆటోలను ఇవ్వడం జరిగింది. కానీ, రాంబాబు లాంటి వసూల్‌ రాజాలు తన స్వార్థ ప్రయోజనాల కోసం వ్యవస్థను నాశనం చేస్తూ ప్రభుత్వ ఆశయానికి తూట్లు పొడిచి స్వచ్ఛ ఆటోను మరో వ్యక్తికి అమ్మేస్తుండడం అత్యంత బాధాకరం. గోషామహల్‌ సర్కిల్లో జిహెచ్‌ఎంసి స్వచ్‌ ఆటోల అలాట్మెంట్‌ లోను లబ్ధిదారుల నుంచి రూ.20 నుంచి 30 వేలు అధికంగా వసూలు చేసినట్లు ఆరోపణలు వెల్లువెత్తున్నాయి. ఇక రాంబాబు చెప్పినట్టు బిల్లులు సర్దుబాటు చేయడం లేదని, కంప్యూటర్‌ ఆపరేటర్‌ వికాస్‌, పర్యావరణ ఇంజనీర్‌ చందు లను, ఏఎంహెచ్‌ఓ శ్రీకాంత్‌ రెడ్డికి ఫిర్యాదు చేసి వారిని బదిలీ చేయించడం జరిగింది. అంతేకాకుండా జిహెచ్‌ఎంసి కాంట్రాక్ట్‌ ఒప్పందం ప్రకారం ఓపెన్‌ పాయింట్ల నుండి చెత్తను సేకరించే రాంకీ సంస్థ కార్మికులకు రాంబాబు అతని చెప్పిన హోటల్స్‌ నుండి, షాపింగ్‌ మాల్స్‌ నుండి చెత్త సేకరించకుంటే వారిపై రాంకీ సంస్థ ప్రతినిధులకు ఫిర్యాదు చేసి వారిని మార్చమని ఒత్తిడి చేసేవాడని తెలుస్తుంది. ఈ విధంగా గోషామహల్‌ సర్కిల్‌లో అనేక చట్ట వ్యతిరేక కార్యక్రమాలకు ప్రోత్సహిస్తూ.. వసూళ్లలో కింగ్‌ మేకర్‌గా మారిన రాంబాబు పై అధికారులు చర్యలు తీసుకుంటారా…? లేదా…? వేచి చూడాలి మరి. అయితే ఈ విషయంలో జీహెచ్‌ఎంసీ, సర్కిల్‌ ఉన్నతాధికారులు స్పందించే వరకు, కార్మికులకు న్యాయం జరిగే వరకు ఆదాబ్‌ హైదరాబాద్‌ అక్షర పోరాటం ఆగదు.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు