Tuesday, May 7, 2024

ఎన్నికల వాగ్దానాల పార్టీలను నమ్మొద్దు

తప్పక చదవండి
  • నినాదాలు కాదు..నిజం చేసే పార్టీ బిఆర్‌ఎస్‌
  • బిఆర్‌ఎస్‌లో చేరిన యాతాకుల భాస్కర
  • కండువా కప్పి ఆహ్వానించిన మంత్రి హరీష్‌ రావు

హైదరాబాద్‌ : కొన్ని పార్టీలు ఎన్నికలు రాగానే నోటికొచ్చిన వాగ్దానాలు చేస్తాయని మంత్రి హరీశ్‌ రావు ఎద్దేవా చేశారు. నినాదాలు ఇచ్చేవి కొన్ని పార్టీలు అయితే నినాదాలను నిజం చేసే పార్టీ బీఆర్‌ఎస్‌ అని చెప్పారు. నకిలీ మాటలు, వెకిలి చేష్టలు చేసే పార్టీలు ఎక్కువయ్యాయని విమర్శించారు. బీఆర్‌ఎస్‌ స్లోగన్‌ సర్కార్‌ కాదని, సొల్యూషన్‌ సర్కారని స్పష్టం చేశారు. హైదరాబాద్‌ తెలంగాణ భవన్‌లో ఎంఆర్పీఎస్‌ రాష్ట్ర నాయకుడు యాతాకుల భాస్కర్‌ మంత్రి హరీశ్‌ రావు ఆధ్వర్యంలో బీఆర్‌ఎస్‌లో చేరారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. కాంగ్రెస్‌ పార్టీ ఇచ్చి హావిూలు ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు ఖర్గే సొంత రాష్ట్రమైన కర్ణాటకలోనే అమలవుతలేవన్నారు. కర్ణాటకలో బీజేపీపై ప్రజలకు కక్కొస్తే కాంగ్రెస్‌ గెలిచిందని చెప్పారు. అమిత్‌ షాకు తెలంగాణపై అవగాహన లేదని, ఎవరో ఇచ్చిన స్క్రిప్ట్‌ చదివి పోయారని ఎద్దేవా చేశారు. ముందు ఆయన గుజరాత్‌ గుడ్డి పాలనను సరిచేసుకోవాలని హితవు పలికారు. తెలంగాణ రాష్ట్ర అక్కా చెల్లెళ్లకు మంత్రి రాఖీ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. దళిత జాతి మేలు కోసం జీవితాన్ని అంకితం చేసిన వ్యక్తి యాతాకుల భాస్కర్‌ అని చెప్పారు. దళితుల అభివృద్ధి కోసం కేసీఆర్‌ తీసుకున్న నిర్ణయాలు భాస్కర్‌ను ఆకట్టుకున్నాయన్నారు. అంబేద్కర్‌ ఓవర్‌సీస్‌ స్కాలర్‌షిప్‌ కింద దళితులకు కేసీఆర్‌ సర్కార్‌ రూ.20 లక్షలు ఇస్తున్నదని, రెసిడెన్షియల్‌ స్కూళ్లు, 80కి పైగా మహిళా డిగ్రీ కాలేజీలను ఏర్పాటుచేశామని వెల్లడిరచారు. 1200 రెసిడెన్షియల్‌ జూనియర్‌ కాలేజీలు, 125 అడుగుల అంబెద్కర్‌ విగ్రహాన్ని పెట్టిన ప్రభుత్వమన్నారు. సెక్రటేరియట్‌కు అంబేద్కర్‌ పేరుపెట్టి భక్తిని చాటుకున్నా మని తెలిపారు. పార్లమెంట్‌కు ఆ మహనీయుడి పేరు పెట్టమంటే కేంద్రం ముఖం చాటేసిందని విమర్శించారు. అంబేద్కర్‌ మార్గంలో నడుస్తున్న ప్రభుత్వం బీఆర్‌ఎస్‌ సర్కార్‌ మాత్రమేనని స్పష్టం చేశారు. గిరిజనుల గురించి మాట్లాడే హక్కు బీజేపీ, కాంగ్రెస్‌లకు లేదని చెప్పారు. తండాలను గ్రామాలుగా మార్చామని, ఎస్టీలకు 10 శాతం రిజర్వేషన్లు అమలు చేస్తున్నామని తెలిపారు. కాంగ్రెస్‌, బీజేపీ నాయకులను తెలంగాణ జాతి నమ్మదని, ఆ పార్టీలు అధికారంలో ఉన్న రాష్టాల్ల్రో మత కలహాలు, కరెంట్‌ సమస్యలు, నీళ్ల కష్టాలతో కొట్టుమిట్టాడుతున్నాయని చెప్పారు. కేసీఆర్‌ను మూడోసారి సీఎం చేయాలని, బీఆర్‌ఎస్‌ను అధికారంలోకి తేవాలని ప్రజలు సెల్ఫ్‌ డిక్లరేషన్‌ చేసుకున్నారని వెల్లడిరచారు. యాతాకుల భాస్కర్‌ సేవలను బీఆర్‌ఎస్‌ తప్పకుండా ఉపయోగించుకొని భవిష్యత్తులో ఉన్నత స్థానం కల్పిస్తుందని తెలిపారు. తెలంగాణ కన్నా మెరుగైన పాలన ఎక్కడ ఉందో చెప్పాలన్నారు. ఎన్నికలు దగ్గర పడుతుండటంతో పొలిటికల్‌ టూరిస్టులు వస్తుంటారంటూ ఎద్దేవా చేశారు. మొన్న అమిత్‌ షా, నిన్న ఖర్గే వచ్చి పేపర్‌ పై రాసిచ్చిన హావిూలు చదివి వెళ్లారన్నారు. వారికి రాష్ట్రం పైన ఎలాంటి అవగాహన లేదని తెలిపారు. తెలంగాణ అభివృద్ధి విషయంలో మాటలు కాకుండా చర్చకు రావాలని సవాల్‌ విసిరారు. వైద్యారోగ్య రంగంలో దేశంలోనే 3 వ స్థానంలో ఉన్నామన్నారు. తలసరి ఆదాయంలో భారతదేశంలో నెంబర్‌ వన్‌గా ఉన్నది తెలంగాణ ప్రభుత్వమని అన్నారు. కేవలం తెలంగాణ రాష్ట్రనికే కాదు దేశానికే అన్నం పెట్టె స్థాయికి రాష్టాన్న్రి అభివృద్ధి చేశారని తెలిపారు. ముచ్చటగా మూడోసారి బీఆర్‌ఎస్‌ పార్టీ వస్తుందని… హ్యాట్రిక్‌ కొట్టబోతుందని ధీమా వ్యక్తం చేశారు. మూడవ సారి ముఖ్యమంత్రిగా కేసీఆర్‌
రానున్నారని తెలిపారు. బీఆర్‌ఎస్‌ స్లోగన్‌లు చేసే పార్టీ కాదు… సొల్యూషన్‌ ఇచ్చే పార్టీ అని మంత్రి హరీష్‌రావు పేర్కొన్నారు.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు