Sunday, April 28, 2024

ఇప్పుడే అయోధ్యకు వెళ్లొద్దు..

తప్పక చదవండి
  • అయోధ్య విజయంతో మోడీకి కేబినేట్‌ అభినందన
  • జన్మజన్మలకు ఒక్కసారి మాత్రమే వచ్చే అవకాశం
  • ఏకవాక్య తీర్మానంతో మంత్రివర్గం తీర్మానం
  • అయోధ్యలో రద్దీ తగ్గేవరకు వెళ్లొద్దని మంత్రులకు మోడీ హితవు
  • ముందస్తు వివరాలు ఇవ్వాలని వీఐపీలకు సూచన

న్యూఢిల్లీ : అయోధ్యలో రామమందిర ప్రతిష్ఠాపన కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించిన ప్రధాన మంత్రి నరేంద్ర మోదీని అభినందిస్తూ కేంద్ర క్యాబినెట్‌ బుధవారంనాడు ఏకగ్రీవంగా ఒక తీర్మానాన్ని ఆమోదించింది. మోదీని ప్రశంసలతో ముంచెత్తింది. రామమందిర నిర్మాణం జన్మకొకసారి వచ్చే అవకాశం కాదని, జన్మజన్మలకు ఒకసారి వచ్చే అవకాశం అని పేర్కొంది. శతాబ్దాలుగా అయోధ్యలో రామాలయ నిర్మాణం జరగాలన్న ప్రజల ఆకాంక్షలను మోదీ నెరవేర్చారని ఆ తీర్మానం కొనియాడిరది. క్యాబినెట్‌ సమావేశంలో కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ తన మంత్రివర్గ సహచరుల తరఫున మోదీని అభినందిస్తూ తీర్మానాన్ని చదవి వినిపించారు. బుధవారంనాడు జరిగిన మంత్రివర్గ సమావేశం ఒక చారిత్రక సమావేశమని ఆయన పేర్కొన్నారు. దేశంలో క్యాబినెట్‌ సిస్టం మొదలైనప్పటి నుంచి ఎన్నో చారిత్రక నిర్ణయాలు తీసుకోవడం జరిగిందని, అయితే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సారథ్యంలో అయోధ్యలో విజయవంతంగా రామాలయ నిర్మాణం జరగడం, ప్రాణప్రతిష్ఠ నిర్వహించడం చరిత్రలోనే ప్రముఖంగా నిలిచిపోతుందని అన్నారు. 1947లో దేశానికి స్వాతంత్యర్ర వచ్చినప్పటికీ, దేశ ఆత్మ ’ప్రాణప్రతిష్ఠ’ 2024 జనవరి 22న జరిగిందని రాజ్‌నాథ్‌ అభివర్ణించారు. మోదీకి అభినందనలు తెలుపుతూ క్యాబినెట్‌ ఏకగ్రీవ తీర్మానం చేసినట్టు సమావేశానంతరం కేంద్ర మంత్రి అనురాగ్‌ ఠాకూర్‌ మీడియాకు వెల్లడిరచారు. ఇదిలావుంటే అయోధ్యలో బాలక్‌ రామ్‌ దర్శనం కోసం లక్షలాది భక్తులు తరలి వస్తుండటంతో ఏర్పడిన రద్దీని దృష్టిలో ఉంచుకుని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ తన మంత్రివర్గ సహచరులకు తగిన సూచనలు ఇచ్చారు. రామాలయం పర్యటనలను ప్రస్తుతానికి వాయిదా వేసుకోవాలని కోరారు. మోదీ అధ్యక్షతన బుధవారంనాడు జరిగిన మంత్రివర్గ సమావేశంలో ఆయన ఈ మేరకు సలహా ఇచ్చారు. అయోధ్య రామాలయం వద్ద రద్దీ ఎక్కువగా ఉండటంతో వీవీఐపీలు, వీఐపీల పర్యటన వల్ల భక్తులకు ఇబ్బందులు కలిగే అవకాశాలున్నాయని మోదీ అభిప్రాయపడినట్టు తెలుస్తోంది. మంత్రులు తమ పర్యటనలను మార్చికి వాయిదా వేసుకోవాలని, అప్పుడైతే సజావుగా రామయ్యను దర్శించుకోవచ్చని, చక్కటి దర్శనానుభూతిని పొందవచ్చని ప్రధాని సూచించారు. కాగా, అయోధ్యలో బాలరాముడి ప్రతిష్ఠ అనంతరం లక్షల సంఖ్యలో భక్తులు క్యూలు కడుతున్నారు. వీరి రద్దీని దృష్టిలో ఉంచుకుని దర్శనం వేళలు పెంచేందుకు అధికారులు నిర్ణయించారు. ఇంతవరకూ రాత్రి 7 గంటల వరకూ ఉన్న దర్శన వేళలను 10 గంటల వరకూ పొడిగించారు. 29వ తేదీ వరకూ ఆన్‌లైన్‌ బుకింగ్‌లను నిలిపేశారు.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు