Friday, May 3, 2024

ఈ అక్రమ కట్టడాలపై చర్యలు తీసుకోరా..?

తప్పక చదవండి
  • చర్యలు తీసుకుంటారా మనకెందుకులే అని వదిలేస్తారా..?
    సికింద్రాబాద్‌ : నియోజకవర్గంలోని అయిదు డివిజన్‌ లలో ఏ డివిజన్‌ లో చూసిన అక్రమ కట్టడాలు దర్శనం ఇస్తున్నాయి. సీతాఫల్‌ మండి, తార్నాక, మెట్టుగూడా, బౌద్ద నగర్‌ లో పదుల సంఖ్యలో అక్రమ కట్టడాలు కడుతున్న అధికారులు చర్యలు తీసుకోవడంలో వెనుకాడుతున్నారు. జి ప్లస్‌ వన్‌,జి ప్లస్‌ 2 టు అనుమతితో నాలుగు, ఐదు అంతస్తుల అక్రమ కట్టడాలు ఆ పై పెంట్‌ హౌస్‌ లు కడుతున్న అధికారులు చర్యలు తీసుకోవడంలో వెనుకడుగు వేస్తున్నారు. సీతాఫల్‌ మండిలోని ఇంద్ర నగర్‌ లో ఎదురింటి నంబర్‌ 12-10-627/3 బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా ఎటిఎం పక్క వీధిలో అక్రమ కట్టడానికి సంబంధించి వార్త పత్రికలో కథనాలు వచ్చిన అధికారులు ఇప్పటి వరకు చర్యలు తీసుకోలేదు. నోటీసులు ఇచ్చి చేతులు దులుపుకున్నారు. చిలకలగూడ పార్క్‌ ఎదురుగా అక్రమ కట్టడం పై కూడా కథనాలు వచ్చినా అధికారులు చర్యలు తీసుకోలేదు. శ్రీనివాస నగర్‌ లోని అక్బర్‌ కేఫ్‌ ఎదురు గల్లీలో మూడు అక్రమ నిర్మాణాలు, సీతాఫల్‌ మండి ప్రధాన రహదారిలో కుషాల్‌ బంగారం షాప్‌ పక్కన అక్రమ సెల్లర్‌ తో పాటు అదనపు అంతస్థుల అక్రమ నిర్మాణం, బిట్టు వైన్స్‌ పక్కన అక్రమ సెల్లార్‌ అదనపు అంతస్థుల అక్రమ నిర్మాణం కడుతున్న అధికారులు చూసి చూడనట్లు వ్యవహరిస్తూన్నారు. బౌద్ద నగర్‌ లోని జామై ఉస్మానియా రైల్వే స్టేషన్‌ కు వెళ్లే దారిలో అనుమతులు లేకుండా ఇల్లిగల్‌ సెల్లార్‌ నిర్మాణాలు చేపడుతున్న అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారు. సర్కిల్‌ పరిధిలో అక్రమ కట్టడాలు యథేచ్ఛగా కొనసాగుతున్న అధికారులు మాత్రం నోటీసులు ఇచ్చి తమ పని పూర్తి ఐపో యినట్టు మళ్ళీ ఆ అక్రమ కట్టడం వైపు చూడకపోవడం విడ్డూరం. నిబంధనలకు విరుద్ధంగా సెట్‌ బ్యాక్‌ లేకుండా, అక్రమ అంత స్తులు కడుతున్న అధికారులు తమకి రావలసిన మామూళ్లు తీసు కొని అక్రమ కట్టడాలపై చూసి చూడనట్లు వ్యవహరిస్తున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ మధ్య హైదరాబాద్‌ నగరంలో అక్రమ కట్టడాల వల్ల పలు ప్రమాదాలు జరిగిన విషయం అందరికి తెలిసిందే. జీహెచ్‌ ఎంసీ నూతన కమిషనర్‌ రోనాల్డ్‌ రోస్‌ అక్రమ కట్టడాలను సహించేది లేదు అని అంటుంటే సికింద్రాబాద్‌ జీహెచ్‌ఎంసి టౌన్‌ ప్లానింగ్‌ అధికారుల తీరు మాత్రం అక్రమ కట్టడాలను పోత్సహిస్తాం అనేలా ఉంది. సర్కిల్‌ పరిధిలో ఇన్ని అక్రమ నిర్మాణాలు అవుతుంటే సికింద్రాబాద్‌ సర్కిల్‌ జెడ్‌ సి, డీసీ అసలు ఉన్నారా అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. సికింద్రాబాద్‌ నియోజకవర్గంలో జరిగే అక్రమ కట్టడాలపై చర్యలు తీసుకొని జిహెచ్‌ఎంసి ఆదాయానికి గండి పడకుండా చూడాలని పలువురు అభిప్రాయపడుతున్నారు.
    చర్యలు తీసుకుంటారా మనకెందుకులే అని వదిలేస్తారా..?
-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు