- ఖతార్‌లో గూఢచర్యం కేసులో కోర్టు కీలకనిర్ణయం
- తీర్పు పట్ల తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన కేంద్రం
ఖతార్ : ఖతార్ కోర్టు 8 మంది భారతీయ మాజీ నేవీ అధికారులకు మరణశిక్ష విధించడంపై విదేశాంగశాఖ దిగ్భ్రాంతిని వ్యక్తం చేసింది.. తప్పుడు కేసుల్లో భారతీయ అధికారులను ఇరికించారని ఆగ్రహం వ్యక్తం చేసింది. గూఢచర్యం కేసులో అరెస్టయిన 8 మంది మాజీ భారత నేవీ అధికారులు గత ఏడాది ఆగస్ట్ నుంచి జైల్లో మగ్గుతున్నారు. 8 మంది భారతీయులను విడిపించడానికి విదేశాంగశాఖ చాలా ప్రయత్నాలు చేసింది. భారత విజ్ఞప్తులను ఖతార్ కోర్టులు పట్టించుకోలేదు. వాళ్లంతా అమాయకులని, పూర్తి స్థాయి కోర్టు తీర్పు కోసం ఎదురు చూస్తునట్టు విదేశాంగశాఖ వెల్లడిరచింది. ఖతార్‌లో మరణశిక్ష పడిన మాజీ నేవీ అధికారులు గతంలో యుద్ద నౌకల్లో కీలకమైన విధులు నిర్వహించారు. దాహ్రా గ్లోబల్ టెక్నాలజీస్ తరపున ఖతార్ భద్రతా బలగాలకు వాళ్లు శిక్షణ ఇస్తున్నారు. భారత అధికారులు పలుమార్లు బెయిల్ పిటిషన్ దాఖలు చేసినప్పటికి ఖతార్ కోర్టులు పట్టించుకోలేదు. ఖతార్ కోర్టు ఉరిశిక్ష విధించిన వారిలో తెలుగు అధికారి పాకాల సుగుణాకర్ కూడా ఉండడం తీవ్ర కలకలం రేపుతోంది. గూఢచర్యం కేసులో 8 మంది మాజీ నేవీ సిబ్బందికి ఖతార్‌లోని కోర్టు గురువారం (అక్టోబర్ 26) మరణశిక్ష విధించింది. దీనికి సంబంధించి భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ ఒక ప్రకటన విడుదల చేసింది. మరణశిక్ష నిర్ణయం మమ్మల్ని ఆశ్చర్యానికి గురిచేస్తోందని, వివరణాత్మక నిర్ణయం కాపీ కోసం తాము ఎదురుచూస్తున్నాము అంటూ తెలిపింది. ‘మేము కుటుంబ సభ్యులు, న్యాయ బృందంతో టచ్‌లో ఉన్నాము. అన్ని చట్టపరమైన చర్యల కోసం అన్వేషిస్తున్నాం’ అని మంత్రిత్వ శాఖ తెలిపింది. మేము ఈ విషయాన్ని చాలా ముఖ్యమైనదిగా పరిగణించాం, దానిని నిశితంగా పరిశీలిస్తున్నాం. అన్ని కాన్సులర్, చట్టపరమైన సహాయాన్ని అందించడం కొనసాగుతుంది. ఖతార్ అధికారులతో కూడా నిర్ణయాన్ని లేవనెత్తుతుంది. ఈ ఎనిమిది మంది ఖతార్‌లోని అల్ దహ్రా కంపెనీలో పనిచేస్తున్నారని విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఒక ప్రకటన విడుదల చేసింది. వాస్తవానికి, ఈ ఎనిమిది మంది భారతీయులు గత ఏడాది అక్టోబర్ 2022 నుంచి ఖతార్‌లో ఖైదు చేయబడ్డారు.