Wednesday, May 15, 2024

కాంగ్రెస్‌తో కటీఫ్‌

తప్పక చదవండి
  • కాంగ్రెస్‌తో బెడిసిన సీపీఎం పొత్తు వ్యవహారం
  • ఒంటరిగానే 17 స్థానాల్లో పోటీకి సిద్ధం
  • ఒంటరిగా పోటీచేయాలని నిర్ణయించినట్లు తమ్మినేని వెల్లడి
  • టిక్కెట్లు విషయంలో నమ్మించి మోసం చేశారు
  • సీపీఐ నేత నారాయణ అసహనం

హైదరాబాద్‌ : కాంగ్రెస్‌తో పొత్తుకు బ్రేకప్‌ చెప్పేసింది సీపీఎం పార్టీ. యూ టర్న్‌ తీసుకున్న ఆ పార్టీతో ముందుకు సాగడంలేదని సీపీఎం నేత తమ్మినేని వీరభద్రం స్పష్టం చేశారు. అసెంబ్లీ ఎన్నికల కోసం పొత్తు కుదరకపోవడానికి కాంగ్రెస్సే కారణమన్నారు. తమకు తొలుత భద్రాచలం, పాలేరు, వైరా సీట్లు ఇస్తామని చెప్పారని, ఆ తర్వాత మొదటి రెండు స్థానాలను పక్కన పెట్టి, వైరా, మిర్యాలగూడ ఇస్తామని చెప్పారని, అయినా తాము వెనక్కి తగ్గామన్నారు. తమకు రెండు సీట్లు ఇస్తామని కాంగ్రెస్‌ చెప్పిందని, కానీ వాటిని కూడా ఇప్పుడు ఇవ్వడం లేదన్నారు.కాంగ్రెస్‌తో పొత్తు పొసగదని తెలిశాక తాము ఒంటరిగా పోటీ చేయాలని నిర్ణయించినట్లు తమ్మినేని వీరభద్రం చెప్పారు. ఇంత అవమానకరంగా పొత్తు పెట్టుకోవాల్సిన అవసరం తమకు లేదన్నారు. చప్పట్లు కొట్టాలంటే రెండు చేతులు కలవాలని, కాంగ్రెస్‌ వద్దనుకున్నప్పుడు తాము పొత్తుతో వెళ్లలేమన్నారు. కాంగ్రెస్‌ ఇచ్చిన గడువు కంటే ఎక్కువగా వేచి చూశామని, కానీ వారి నుంచి ఎలాంటి స్పందన లేదన్నారు. మల్లు భట్టి తనకు ఫోన్‌ చేసి సాయంత్రం వరకు వేచి చూడాలని చెప్పారని, కానీ ఆ పార్టీ నుంచి స్పందన లేకపోగా.. సీట్లు ఇవ్వం.. ఎమ్మెల్సీలుగా చేస్తాం.. మంత్రులుగా చేస్తామని మాకు చెబుతున్నారని మండిపడ్డారు తమ్మినేని. రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటివరకూ 17 సీట్లలో పోటీ చేస్తామని ప్రకటించారు తమ్మినేని వీరభద్రం. నకిరేకల్‌, మిర్యాలగూడ, నల్గొండ, భువనగిరి, హుజూర్‌ నగర్‌, కోదాడ, జనగామ, భద్రాచలం, అశ్వారావుపేట, పాలేరు, వైరా, సత్తుపల్లి, ఖమ్మం, మధిర, ఇబ్రహీంపట్నం, పటాన్‌చెరు, ముషీరాబాద్‌ నియోజకవర్గాల్లో పోటీ చేయనున్నట్లు చెప్పారు. అవసరమైతే మరో మూడు నాలుగు సీట్లు కలుస్తాయని, ఇరవై సీట్లలో పోటీ చేసే అవకాశముందన్నారు. అయితే ఇప్పుడు తాము ప్రకటించిన జాబితాలో సీపీఐ పోటీ చేస్తే కనుక తాము ఉపసంహరించుకుంటామన్నారు.తెలంగాణలో బీజేపీని ఒక్క సీటు కూడా గెలవనీయబోమని తమ్మినేని వీరభద్రం అన్నారు. ఇది లెఫ్టిస్టుల విధానమని చెప్పారు. బీజేపీ గెలిచే చోట్ల..రెండో స్థానంలో ఉండే కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌ అభ్యర్థులు ఎవరు ఉన్నా..వారికి సపోర్ట్‌ చేస్తామన్నారాయన. లెఫ్ట్‌ పార్టీలను గెలిపించాలని ప్రజలకు పిలుపునిచ్చారు తమ్మినేని వీరభద్రం. అసెంబ్లీలో ప్రజల తరఫున వాయిస్‌ వినిపించాలంటే వామపక్షపార్టీలు సభలో ఉండాలన్నారాయన. మరోవైపు అటు సీపీఐ కాంగ్రెస్‌పార్టీతో పొత్తుకు వెళ్తుందా..? వెళ్తే%ౌౌ%సీపీఎం చేసే నాలుగైదు స్థానాల్లో కొంత మార్పు ఉండవచ్చని చెబుతున్నారు తమ్మినేని. ఈ విషయంపై సీపీఐతో ఇంతకుముందే మాట్లాడినట్లు చెప్పుకొచ్చారాయన.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు