Wednesday, September 11, 2024
spot_img

నేటి నుంచే కాంగ్రెస్ బస్సు యాత్ర..

తప్పక చదవండి
  • ప్రారంభించనున్న కాంగ్రెస్ అగ్రనేతలు రాహుల్, ప్రియాంక..
  • ములుగు జిల్లా రామప్పలో ప్రత్యేక పూజల నిర్వహణ..
  • మూడు రోజుల పాటు తెలంగాణాలో బస్సు యాత్ర..
  • రైతులు, మహిళలు, నిరుద్యోగులతో విస్త్రుత సమావేశాలు..

హైదరాబాద్ : తెలంగాణలో ఎన్నికల ప్రచారాన్ని కాంగ్రెస్ షూరూ చేస్తోంది. దానిలో భాగంగా రేపటి నుంచి బస్సు యాత్ర మొదలుపెట్టనుంది. కాంగ్రెస్ అగ్రనేతలు రాహుల్‌గాంధీ, ప్రియాంకగాంధీ బస్సు యాత్రను ప్రారంభించనున్నారు. ముందుగా.. ములుగు జిల్లాలోని రామప్ప దేవాలయంలో రాహుల్, ప్రియాంక ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు. అనంతరం అక్కడినుంచి బస్సు యాత్రను స్టార్ట్‌ చేయనున్నారు. ఇక.. మూడు రోజుల పాటు తెలంగాణలో బస్సు యాత్ర నిర్వహించనున్న రాహుల్‌, ప్రియాంక.. రైతులు, మహిళలు, నిరుద్యోగులతో సమావేశమవుతారు. అలాగే.. పలుచోట్ల బహిరంగ సభల్లో పాల్గొననున్నారు.

షెడ్యూల్ వివారాలు : 18న ములుగు, భూపాలపల్లిలో పర్యటన.. 19న రామగుండం, పెద్దపల్లి, కరీంనగర్‌లో యాత్ర.. 20న నిజామాబాద్ జిల్లాలో రాహుల్‌ బస్సు యాత్ర.. ఆర్మూరులో పసుపు రైతులతో భేటీ కానున్న రాహుల్‌.. బస్సుయాత్రలో భాగంగా.. నేడు ములుగు, భూపాలపల్లిలో పర్యటించడంతోపాటు ములుగు బహిరంగ సభలో ప్రసంగిస్తారు రాహుల్‌గాంధీ. 19న ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని రామగుండం, పెద్దపల్లి, కరీంనగర్‌ పట్టణంలో ప్రచారం నిర్వహించనున్నారు. సింగరేణి, ఎన్టీపీసీ వర్కర్స్‌ యూనియర్‌ నేతలతో భేటీ కానున్నారు. ఆపై.. పెద్దపల్లి బహిరంగ సభలో పాల్గొననున్నారు రాహుల్‌గాంధీ. మరోవైపు… 20న నిజామాబాద్ జిల్లాలో రాహుల్‌గాంధీ బస్సు యాత్ర కొనసాగించనున్నారు. దానిలో భాగంగా.. బోధన్‌, ఆర్మూర్‌, నిజామాబాద్‌ పట్టణాల్లో పర్యటిస్తారు. బోధన్‌లో బీడి కార్మికులు, గల్ఫ్‌ వర్కర్స్‌ కుటుంబాలతో భేటీ అవుతారు. అలాగే.. నిజాం షుగర్‌ ఫ్యాక్టరీని సందర్శించనున్నారు. ఆ తర్వాత.. సాయంత్రం నాలుగు గంటలకు ఆర్మూరులో పసుపు రైతులతో భేటీ కావడంతోపాటు బహిరంగ సభలో పాల్గొననున్నారు. ఇక.. ఆయా పర్యటనల సందర్భంగా పలు ప్రాంతాల్లో రాహుల్ పాదయాత్ర చేయనున్నారు. వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో కాంగ్రెస్‌ అధికారంలోకి వస్తుందన్నారు రాహుల్‌గాంధీ. కర్నాటకలో కాంగ్రెస్‌ ఖతం అవుతుందని బీజేపీ ప్రచారం చేయగా.. అక్కడ ఆ పార్టీయే ఓటమి పాలైందన్నారు. అందుకే.. కాంగ్రెస్‌ను తక్కువ అంచనా వేయోద్దన్నారు రాహుల్‌గాంధీ. మొత్తంగా.. రాహుల్‌, ప్రియాంక పర్యటనకు సంబంధించిన ఏర్పాట్లు శరవేగంగా కొనసాగుతున్నాయి. సభాస్థలం వద్ద ఏర్పాట్లను పరిశీలించారు ములుగు ఎమ్మెల్యే సీతక్క. హెలీప్యాడ్‌తోపాటు బహిరంగ సభ ప్రాంతాన్ని సందర్శించారు పోలీసు ఉన్నతాధికారులు. భద్రతా ఏర్పాట్లకు సంబంధించి అధికారులకు దిశానిర్దేశం చేశారు. అయితే, రాహుల్, ప్రియాంక పర్యటన నేపథ్యంలో తెలంగాణ కాంగ్రెస్‌లో ఫుల్ జోష్ నెలకొంది. రాహుల్, ప్రియాంక బస్సు యాత్రలకు భారీగా జనసమీకరణకు కాంగ్రెస్ ప్లాన్ చేస్తోంది. దీనికనుగుణంగా ఆయా నియోజకవర్గాల్లోని నేతలను రాష్ట్ర నేతలు అలర్ట్ చేశారు.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు