Wednesday, May 15, 2024

శ్రీవారిని దర్శించుకున్న చంద్రబాబు

తప్పక చదవండి
  • భార్య భువనేశ్వరితో కలసి రాక
  • తన ఇష్టదైవం వెంకటేశ్వరుడని వెల్లడి

తిరుమల : మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు తిరుమల శ్రీనివాసుడిని దర్శించుకున్నారు. భార్య భువనేశ్వరితో కలిసి ఉదయం స్వామి సేవలో పాల్గొన్నారు. వైకుంఠం కాంప్లెక్స్‌ వద్ద అధికారులు ఆయనకు స్వాగతం పలికారు. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో చంద్రబాబుకు ఆశీర్వచనాలు అందించి తీర్థప్రసాదాలు అందించారు. చంద్రబాబుతోపాటు పలువురు టీడీపీ నేతలు కూడా తిరుమలేశుడిని దర్శించుకున్నారు. తాను వేంకటేశ్వర స్వామి పాదాల చెంత పుట్టానని… అంచెలంచెలుగా ఎదిగి ప్రజాసేవకు అంకితం అయ్యాను అన్నారు చంద్రబాబు. వెంకటేశ్వర స్వామి తమ ఇంటి దైవం, ఎప్పుడూ ఆయన్ని ప్రార్ధించి ఏ కార్యక్రమంమైనా ప్రారంభిస్తామన్నారు. 2003 బ్రహ్మోత్సవాల్లో దేవుడికి పట్టు వస్త్రాలు సమర్పించేందుకు వచ్చిన సమయంలో అలిపిరి వద్ద 24 క్లైమోర్‌ మైన్స్‌ దాడి చేశారని గుర్తు చేశారు. ఆ టైంలో సాక్షాత్తు శ్రీ వేంకటేశ్వరస్వామి ప్రాణభిక్ష పెట్టాడని అభిప్రాయపడ్డారు. మొన్న నాకు కష్టం వచ్చినప్పుడు వేంకటేశ్వర స్వామికి మొక్కుకున్నానని అందుకే ఆయన దర్శనం చేసుకున్న తర్వాతే వేరే కార్యక్రమం చేస్తానని చెప్పానని అన్నారు. ఆ మొక్కును ఇవాళ తీర్చుకున్నట్టు పేర్కొన్నారు. శ్రీ వేంకటేశ్వరస్వామి వారిని ఎల్లప్పుడూ తలచుకుంటూనే ఉంటానన్నారు. ఆయన్ను తలచుకున్న తర్వాతే ఏ పనికైనా శ్రీకారం చుడుతానని వెల్లడిరచారు.

ధర్మాన్ని కాపాడాలని మాత్రమే ఆయన్ని కోరుకుంటాననన్నారు. కలియుగంలో వెంకటేశ్వరుడి అవతారంలో పుట్టి, ధర్మాన్ని రక్షించేందుకు ఆయన రావడం జరిగిందని తెలిపారు. భారతదేశం ప్రపంచంలో అగ్రస్ధానంలో ఉండాలనేది తన కోరికని… భారతదేశంలో తెలుగుజాతి నెంబర్‌ వన్‌ జాతిగా ఉండాలనేది ఆకాంక్ష, దాని కోసమే పని చేస్తున్నానని అన్నారు. రాబోయే రోజుల్లో ప్రపంచంలోనే అత్యున్నత నాగరికత భారతదేశానిదని, అందులో తెలుగు ప్రజానికం ఎల్లప్పుడూ ముందు ఉంటుందన్నారు. నా ద్వారా ప్రజల సంకల్పం ముందుకు తీసుకుని వెళ్ళేందుకు శక్తిని ఇవ్వాలని స్వామిని ప్రార్ధించానన్నారు. తాను కష్టాల్లో ఉన్న సమయంలో ప్రపంచంలో ఉండే ప్రజలంతా సంఫీుభావం తెలిపారని వారందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నానని అన్నారు. కొండపై రాజకీయాలు మాట్లాడనని స్పష్టం చేశారు. కొండపై గోవింద నామస్మరణ తప్ప వేరే ఏవీ కూడా పలకడానికి వీలేదని వివరించారు. అన్ని విషయాలు రాబోయే రోజుల్లో అందరికి తెలియజేస్తానన్నారు. 45 సంవత్సరాలుగా ప్రజల కోసం ఎప్పటికప్పుడు అధ్యాయనం చేస్తూ, ప్రజలకు సేవ చేస్తూ వచ్చానని వివరించారు. ఇప్పటికే భారతదేశానికి మంచి గుర్తింపు వచ్చింది, అందులో తెలుగువారు అగ్రస్థానంలో ఉన్నారన్నారు.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు