Saturday, May 18, 2024

అభివృద్ధి బాధ్యత బిఆర్‌ఎస్‌ది

తప్పక చదవండి
  • బిఆర్‌ఎస్‌ను గెలిపించే బాధ్యత ప్రజలది..
  • సంక్షేమ పథకాలే బిఆర్‌ఎస్‌కు శ్రీరామ రక్ష : మంత్రి నిరంజన్‌రెడ్డి

వనపర్తి : గెలిపించే బాధ్యత ప్రజలది అయితే.. అభివృద్ధి బాధ్యత బీఆర్‌ఎస్‌ పార్టీది రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్‌ రెడ్డి స్పష్టం చేశారు. బీసీ కులాలకు చెందిన దివ్యాంగులకు మంత్రి నిరంజన్‌ రెడ్డి బ్యాటరీ వాహనాలను అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి నిరంజన్‌ రెడ్డి మాట్లాడుతూ.. దివ్యాంగులకు తెలంగాణ ప్రభుత్వం అండగా నిలిచిందన్నారు. దివ్యాంగులకు రూ. 4016 పెన్షన్‌ ఇస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ మాత్రమే అని స్పష్టం చేశారు. విూరంతా ఏకపక్ష తీర్పును ఇస్తే తాను సిపాయిలా పనిచేస్తానని తేల్చిచెప్పారు. సంక్షేమ పథకాలే బీఆర్‌ఎస్‌ పార్టీకి శ్రీరామ రక్ష అని మంత్రి పేర్కొన్నారు. ప్రతి గడపకు సంక్షేమం, ప్రతి గల్లీలో అభివృద్ధి కనబడుతుందన్నారు. ప్రభుత్వం ప్రవేశపెట్టిన ప్రతి ప్రభుత్వ పథకాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లి వివరించాలి. దేశంలో ఎక్కడా లేని విధంగా సంక్షేమ పథకాల అమలవుతున్నాయి. దేశానికి ఆదర్శంగా తెలంగాణ రాష్ట్రం నిలిచిందన్నారు. ప్రతి సంక్షేమ పథకం అమల్లో ఎలాంటి పైరవీలకు తావు లేకుండా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకుంటే అర్హులైన వారికి నేరుగా వారి ఖాతాల్లోనే నగదు జమ చేస్తున్నామని తెలిపారు. మండలంలోని ప్రతి గ్రామంలో పాత, కొత్త నాయకులు సమిష్టిగా పని చేయాలని మంత్రి నిరంజన్‌ రెడ్డి పిలుపునిచ్చారు. ఇక సోమవారం ఉదయం మర్రికుంటలో 33/11 కేవీ సబ్‌ స్టేషన్‌ నిర్మాణానికి మంత్రి శంకుస్థాపన చేశారు. ఖిల్లా ఘనపురం మండలం ఆగారం గ్రామానికి చెందిన 100 మంది నాయకులు, ఎస్సీ మోర్చా జిల్లా అధ్యక్షుడు కుమార్‌, జిల్లా అధికార ప్రతినిధి బాబురావులు బీఆర్‌ఎస్‌లో చేరారు. వీరందరికి మంత్రి నిరంజన్‌ రెడ్డి గులాబీ కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. అంతకుముందు బండారు నగర్‌లో రూ.14 లక్షలతో నిర్మించిన మహిళా సమైక్య భవనం ప్రారంభించారు. అనంతరం క్యాంపు కార్యాలయంలో క్రీడాకారులకు స్పోర్ట్స్‌ కిట్లు, గోపాల్‌ పేట, రేవల్లి మండలాల జర్నలిస్టులకు ఇండ్ల పట్టాలు పంపిణీ చేశారు.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు