Friday, May 3, 2024

డీజీపీ అంజనీకుమార్‌ని సస్పెండ్‌ చేసిన ఈసీ

తప్పక చదవండి
  • కొత్త ప్రభుత్వం ఏర్పడటానికి ముందే తెలంగాణకు కొత్త డీజీపీ నియామకం
  • ఎన్నికల కోడ్‌ ఉల్లంఘించారంటూ అంజనీ కుమార్‌తో పాటు ఇద్దరు అదనపు డీజీ లకు నోటీసులు జారీచేసిన ఈసీ..
  • రవి గుప్తాను కొత్త డీజీపీగా నియమిస్తూ ఈసీ ఉత్తర్వులు..

హైదరాబాద్‌ (ఆదాబ్‌ హైదరాబాద్‌) : కొత్త ప్రభుత్వం ఏర్పడటానికి ముందే తెలంగాణకు కొత్త డీజీపీ నియామకం అయ్యారు. డీజీపీ అంజనీకుమార్‌ యాదవ్‌ ఎన్నికల కోడ్‌ ఉల్లంఘించారంటూ ఆయన్ను ఆదివారం మధ్యాహ్నం ఎలక్షన్‌ కమిషన్‌ సస్పెండ్‌ చేసింది. ఎన్నికల ఫలితాలకు ముందే టీపీసీసీ చీఫ్‌ రేవంత్‌ రెడ్డిని కలిసి శుభాకాంక్షలు చెప్పడంతో అంజనీ కుమార్‌తో పాటు ఇద్దరు అదనపు డీజీలు సందీప్‌కుమార్‌ జైన్‌, మహేష్‌ భగవత్‌కు ఈసీ నోటీసులు జారీ చేసింది. రేవంత్‌కు భద్రత కల్పించే అంశంపై అంజనీకుమార్‌ యాదవ్‌ చర్చించినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో తెలంగాణకు కొత్త డీజీపీని ఎలక్షన్‌ కమిషన్‌ నియమించింది. ఈ మేరకు రవి గుప్తాను కొత్త డీజీపీగా నియమిస్తూ ఈసీ ఉత్తర్వులు జారీ చేసింది. కాగా అంజనీకుమార్‌ యాదవ్‌ తర్వాత సీనియర్‌ పోలీస్‌ అధికారిగా రవి గుప్తా ఉండటంతో ఆయన్ను డీజీపీగా ఈసీ నియమించింది. రవి గుప్తా 1990 బ్యాచ్‌కు చెందిన సీనియర్‌ ఐపీఎస్‌ అధికారి. ప్రస్తుతం ఆయన విజిలెన్స్‌ అండ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ విభాగంతో పాటు ఏసీబీ డైరెక్టర్‌ జనరల్‌గా కొనసాగు తున్నారు. హోంశాఖ ముఖ్య కార్యదర్శిగా విధులు నిర్వహించిన అనుభవం కూడా రవి గుప్తాకు ఉంది.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు