Tuesday, May 21, 2024

బీహార్‌ గోల్డ్‌మ్యాన్‌ ప్రేమ్‌సింగ్‌ ఒంటిపై 5 కిలోల బంగారం

తప్పక చదవండి

పాట్నా : బంగారు ఆభరణాలు మితంగా ధరిస్తే అలంకారం.. మితివిూరితే నడిచే దుకాణం అంటాం. బిహార్‌కు చెందిన ప్రేమ్‌సింగ్‌కు నిలువెల్లా బంగారమే. మెడలో 30కు పైగా గొలుసులు, రెండు చేతులకు కలిపి 10 ఉంగరాలతో ఏకంగా 5.2 కేజీల నగలను ఆయన ఒంటిపై ధరిస్తున్నారు. కళ్లద్దాలు, మొబైల్‌ కవర్‌.. ఇలా అన్నింటికీ బంగారమే. ఎక్కడికి వెళ్లినా ఈ ఆభరణా లన్నీ ధరించే వెళ్తారు. భోజ్‌పుర్‌కు చెందిన ప్రేమ్‌సింగ్‌కు చిన్ననాటి నుంచే బంగారం అంటే ఆసక్తి. ఈ అభిరుచి వయసుతోపాటు మరింత ఎక్కువైంది. ‘భూస్వామ్య కుటుంబంలో పుట్టిన నేను ప్రస్తుతం కాంట్రాక్టరుగా పనిచేస్తున్నా. వచ్చిన ఆదాయంతో పసిడి ఆభరణాలు కొనుగోలు చేస్తుంటా. వేడుకలకు వెళితే ప్రజలు నాతో సెల్ఫీలు తీసుకోవడం చూసి ఆనందంగా ఉంటుంది‘ అంటారు ప్రేమ్‌సింగ్‌. బయటకు వస్తే తనతోపాటు ఇద్దరు భద్రతా సిబ్బంది ఉంటారని.. పసిడి వస్తువులకు సంబంధించిన అన్ని పత్రాలు ఎప్పుడూ ఉంటాయన్నారు.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు