- డఖిణాఫ్రికాను వెంటాడుతున్న కష్టాలు..
న్యూ ఢిల్లీ : దక్షిణాఫ్రికా క్రికెట్ జట్టు వరల్డ్ కప్ కోసం భారత్‌కు బయలు దేరింది. ఇండియాకు వెళ్లే ముందు సఫారీ ఆటగాళ్లకు సన్మాన కార్యక్రమం నిర్వహించారు. అనంతరం కెప్టెన్ తెంబా బవుమాతో పాటు 15 మంది ఆటగాళ్లు, సహాయక సిబ్బంది భారత విమానం ఎక్కారు. దక్షిణాఫ్రికా జట్టుకు ఇది 9వ వరల్డ్ కప్. అయితే.. ఈ మెగా టోర్నీకి ముందు సఫారీ జట్టుకు పెద్ద షాక్ తగిలింది. ప్రధాన పేసర్లు అన్రిచ్ నార్ట్జ్, సిసండ మగల గాయంతో టోర్నీ నుంచి వైదొలిగారు. దాంతో, నార్ట్జ్, మగల స్థానంలో అండిలే పెహ్లూవాకియో, లిజాద్ విల్లియమ్స్ లను ఎంపిక చేశారు. ఈ విషయాన్ని సఫారీ జట్టు కోచ్ రాబ్ వాల్టర్ వెల్లడించాడు.