Thursday, May 16, 2024

పది రోజుల్లో గ్రూప్‌-4 ఫైనల్‌ కీ..

తప్పక చదవండి
  • తుది ఫలితాలు అక్టోబర్ నెలలో..
    హైదరాబాద్ : గ్రూప్‌-4 ఫలితాలపై టీఎస్‌పీఎస్సీ ముమ్మరంగా కసరత్తు చేస్తున్నది. ఇప్పటికే ప్రిలిమినరీ ‘కీ’ విడుదల చేసిన కమిషన్‌.. తుది ఫలితాలను వెల్లడించే పనిలో నిమగ్నమైంది. రాష్ట్రంలో 8,180 గ్రూప్‌-4 ఉద్యోగాలకు 9.51 లక్షల మంది అభ్యర్థులు దరఖాస్తు చేశారు. జూలై 1న పరీక్ష నిర్వహించగా.. 7,62,872 మంది అభ్యర్థులు హాజరయ్యారు. ఆగస్టు 28న ప్రిలిమినరీ ‘కీ’ని టీఎస్‌పీఎస్సీ విడుదల చేసింది. ఆగస్టు 30 నుంచి సెప్టెంబర్‌ 4 వరకు ప్రిలిమినరీ కీపై అభ్యంతరాలు స్వీకరించారు. అభ్యర్థుల నుంచి వచ్చిన అభ్యంతరాలపై నిపుణుల కమిటీ కమిషన్‌కు తుది నివేదిక ఇచ్చినట్టు తెలిసింది. అన్నింటినీ ఒకటికి రెండుసార్లు పరిశీలించిన టీఎస్‌పీఎస్సీ.. పదిరోజుల్లోగా ఫైనల్‌ కీ ఇచ్చేందుకు ఏర్పాట్లు చేసినట్టు సమాచారం. తుది ఫలితాలను అక్టోబర్‌లో ఇవ్వాలని కమిషన్‌ భావిస్తున్నది.
-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు