Friday, July 26, 2024

అయోధ్యముహూర్తం 84సెకన్లు మాత్రమే

తప్పక చదవండి
  • అప్పుడే అనేక శుభకార్యాలకు శ్రీకారం
  • పెళ్లిళ్లు.. జననాలు, వ్యాపారలకు ముహూర్తాలు

అయోధ్య : అయోధ్యలో శ్రీరాముడికి జనవరి 22వతేదీన ప్రాణ ప్రతిష్ఠ జరుగుతుంది.. ఆరోజు మధ్యాహ్నం 12 గంటల 29 నిమిషాల 8 సెకన్ల నుంచి 12 గంటల 30 నిమిషాల 32 సెకన్ల మధ్య ముహూర్తం ఉంది. అంటే కేవలం 84 సెకన్లు.. అంటే ఒకటిన్నర నిమిషం కూడా లేదు.. కేవలం 84 అంటే 84 సెకన్లు.. ఈ 84 సెకన్లలోనే అయోధ్య శ్రీ రాముడికి ప్రాణ ప్రతిష్ఠ జరగబోతుంది.. ఇది ఎంతో అద్భుతమైన, శుభకరమైన ముహూర్తం అని అంటున్నారు. లేకపోతే అయోధ్యలో రాముడికే ప్రాణ ప్రతిష్ఠ ఎలా చేస్తారు.. అందుకే ఈ దివ్యమైన.. మంగళమైన ముహూర్తం అని భావిస్తున్నారు జనం. ఈ దివ్యమైన అద్భుతమైన 84 సెకన్లు ఉన్న సమయంలోనే.. ఉత్తర భారతంలోని వేలాది మంది.. ఈ ముహూర్తంలో పిల్లలను కనటానికి రెడీ అవుతున్నారు. ఈ ముహూర్తంలో సిజేరియన్‌ ఆపరేషన్లు చేయటానికి డాక్టర్లను కోరుతున్నారు. వేలాది మంది పెళ్లిళ్లు చేసుకోవటానికి సిద్ధం అయ్యారు.. ఈ 84 సెకన్లలోనే తమ పిల్లలకు నామకరణాలు చేయటానికి ముహూర్తం పెట్టుకున్నారు. అంతేనా ఈ 84 సెకన్లలోనే షాపులు ఓపెన్‌ చేసుకుంటున్నారు..కొత్త వ్యాపారాలు ప్రారంభిస్తున్నారు.. కొత్త ఉద్యోగాల్లో చేరేందుకు సిద్దమవుతున్నారంటే.. రాములోరికి ఆ దివ్య ముమూర్తంలో ప్రాణ ప్రతిష్ట చేస్తున్నారంటే.. ఆ 84 సెకన్ల దివ్య ముహూర్తం ఎంత బలమైందో తెలుస్తోంది. అందుకే ఈ ముహూర్త బలాన తమ కార్యక్రమాలు నిర్వహించేందుకు సిద్దపడుతున్నారు ప్రజలు.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు