Monday, April 29, 2024

ఏషియన్ స్పైన్ హాస్పిటల్ సరికొత్త మైలురాయి

తప్పక చదవండి
  • విజయవంతంగా 200 స్పైనల్ ఫ్యూజన్ సర్జరీలు
  • దేశంలో మొదటిసారిగా కీహోల్ ఎండోస్కోపిక్ స్పైన్ టెక్నాలజీని ఉపయోగించి సర్జరీ

పూర్తి ఎండోస్కోపిక్ స్పైన్ సర్జరీలు నిర్వహించే భారత్‌లోని మొట్టమొదటి సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్స్, ట్రైనింగ్ ఇన్‌స్టిట్యూట్ అయిన ఏషియన్ స్పైన్ హాస్పిటల్ కీహోల్ ఎండోస్కోపిక్ టెక్నాలజీని ఉపయోగించి 200 స్పైనల్ ఫ్యూజన్ సర్జరీలను (ఎండోఫ్యూజన్) విజయవంతంగా పూర్తి చేసినట్టు ఈ రోజు గర్వంగా ప్రకటించింది. ఇది దేశంలో తొలిసారిగా సాధించిన గొప్ప ఘనత. భారత్‌లో అడ్వాన్స్‌డ్‌ స్పైనల్‌ కేర్‌‌ (అత్యుత్తమ వెన్నెముక సంరక్షణ)లో కొత్త శకాన్ని సూచించడమే కాకుండా వైద్య విధానాలను అభివృద్ధి చేయడంలో, వెన్నెముకకు అత్యాధునిక ఎండోస్కోపిక్ చికిత్సను అందించడంలో ఆసుపత్రి అవలంబిస్తున్న నిబద్ధతను కూడా నొక్కి చెబుతుంది. ఏషియన్‌ స్పైన్‌ హాస్పిటల్ సాధించిన ఈ విజయ వేడుకలో ముఖ్య అతిథిగా మ్యాక్సివిజన్ ఫౌండర్, మెంటర్ డాక్టర్ కాసు ప్రసాద్ రెడ్డి, ఏషియన్ స్పైన్ హాస్పిటల్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ సుకుమార్ సూరా, ఏషియన్ స్పైన్ హాస్పిటల్ సీఈఓ, డైరెక్టర్ నరేష్ కుమార్ పగిడిమర్రి, కన్సల్టెంట్ స్పైన్ సర్జన్, డైరెక్టర్ సెంటర్ ఫర్ కాంప్లెక్స్ స్పైన్ సర్జరీ, డిఫార్మిటీ కరెక్షన్ డాక్టర్ ఎం అభినందన్ రెడ్డి, సీనియర్ అనస్థటిస్ట్ , డిపార్ట్‌మెంట్ ఆఫ్ అనస్థీషియాలజీ , పెయిన్ థెరపీ హెడ్ డా. పద్మా రవికంటితో పాటు అనేక మంది ఇతర ప్రముఖులు లో పాల్గొన్నారు. వైద్యరంగంలో అత్యంత గౌరవపాత్రుడైన డాక్టర్ కాసు ప్రసాద్ రెడ్డి ఏషియన్ స్పైన్ హాస్పిటల్ సాధించిన విజయాన్ని ప్రశంసించారు. ‘ఏషియన్ స్పైన్ హాస్పిటల్‌లో 200 విజయవంతమైన ఫుల్ ఎండోస్కోపిక్ స్పైనల్ ఫ్యూజన్ సర్జరీల మైలురాయిని అధిగమించడం కేవలం ఒక విజయం మాత్రమే కాదు. ఇది భారతదేశంలో వెన్నుముక సంరక్షణ చికిత్సల్లో(స్పైన్‌ కేర్) పురోగతికి సారథ్యం వహించే నిబద్ధతను సూచిస్తుంది. ఏషియన్‌ స్పైన్‌ హాస్పిటల్ సాధించిన ఈ ఘనత ఎండోస్కోపిక్ స్పైనల్ సర్జరీ ప్రమాణాలను పెంపొందించడం, దేశ ఆరోగ్య సంరక్షణలో రోగి ఫలితాలను మెరుగుపరచడంలో వారి అంకితభావాన్ని ప్రతిబింబిస్తుంది’ అని కొనియాడారు.

అతి తక్కువ హానికరమైన ఈ పూర్తి ఎండోస్కోపిక్ స్పైనల్ శస్త్రచికిత్సల్లో ఏషియన్ స్పైన్ హాస్పిటల్ అగ్రగామిగా నిలిచింది. అలాగే, తాజా మైలురాయి అధునాత, వినూత్న వెన్ను సంరక్షణ ప్రక్రియల్లో అందరికంటే ముందంజలో ఉన్న విషయాన్ని పునరుద్ఘాటిస్తుంది. ఏషియన్ స్పైన్ హాస్పిటల్ ఛైర్మన్ ,మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ సుకుమార్ సురా ఈ విజయం ప్రాముఖ్యత గురించి మాట్లాడుతూ ..‘200 విజయవంతమైన ఫుల్ ఎండోస్కోపిక్ స్పైనల్ ఫ్యూజన్ సర్జరీల (ఎండోఫ్యూజన్) మైలురాయిని సాధించినందుకు మేం చాలా గర్వపడుతున్నాం. ఈ ఘనత వెన్నెముక ఆరోగ్య సంరక్షణలో అధునాతన సాంకేతికతను ఉపగయోగించుకొని నిబద్ధత, అంకితభావంతో పని చేసే మా వైద్య బృందం చేసిన కృషిని ప్రస్ఫుటిస్తుంది’ అని అన్నారు. ఏషియన్ స్పైన్ హాస్పిటల్‌లో ఎండోఫ్యూజన్ ప్రక్రియల విజయం వెన్నెముక శస్త్రచికిత్సలలో ప్రధాన మైలురాయిని సూచిస్తుంది, ఎండోస్కోపిక్ స్పైనల్ ఫిక్సేషన్ లేదా ఎండోస్కోపిక్ స్పైనల్ ఫ్యూజన్‌ అనేది వైద్యులు, రోగులకు అత్యంత అనుకూలమైన, ప్రభావవంతమైన, తక్కువ హానికర ప్రక్రియగా మారింది. చికిత్స అనంతరం వేగంగా కోలుకునే ఈ అత్యాధునిక చికిత్సను వృద్ధులు నమ్మకంతో చేయించుకోవచ్చు. సాంప్రదాయ ఓపెన్ సర్జరీ, అతి తక్కువ హానికర టెక్నిక్‌ల కంటే ఈ టెక్నిక్ అనేక ప్రయోజనాలను అందిస్తుంది. ఈ విధానంలో పెద్దగా కోతలు అవసరం ఉండదు. కండరాలు, ఎముకలను కత్తిరించాల్సిన అవసరం కూడా లేదు. సాధ్యమైనంత చిన్న కోతల ద్వారా నరాల మీద ఒత్తిడి నుంచి ఉపశమనం కలుగుతుంది. అలాగే, ఎండోస్కోపిక్ పద్ధతిలో స్క్రూ రాడ్‌లను చొప్పించడం ద్వారా అస్థిర ఎముకలను సరిచేయవచ్చు. ఈ ప్రక్రియ శస్త్రచికిత్స అనంతర నొప్పులను తగ్గిస్తుంది. ప్రత్యేకంగా ఇది వృద్ధ రోగులకు ఉపయోగకరంగా ఉంటుంది.

- Advertisement -

కన్సల్టెంట్ స్పైన్ సర్జన్ , డైరెక్టర్ సెంటర్ ఫర్ కాంప్లెక్స్ స్పైన్ సర్జరీ, డిఫార్మిటీ కరెక్షన్ డాక్టర్ ఎం అభినందన్ రెడ్డి ఎండోఫ్యూజన్ ప్రయోజనాలను వివరించారు. ‘ఈ శస్త్రచికిత్సకు పెద్దగా కోతలు అవసరం లేదు. సాధ్యమైనంత చిన్న కోతతో నరాల మీద ఒత్తిడి తగ్గుతుంది. ఎండోస్కోపిక్ టెక్నిక్‌ల ద్వారా స్క్రూ రాడ్‌లను చొప్పించడం ద్వారా అస్థిరమైన ఎముకలు కూడా సరిచేయవచ్చు. ఇందుకు చర్మంపై చేసే చాలా చిన్న రంధ్రాలు సరిపోతాయి. అందువల్ల రక్తస్రావం జరగదు. రోగి త్వరగా కోలుకుంటారు. శస్త్రచికిత్స తర్వాత నొప్పులు చాలా తక్కువగా ఉంటాయి, తద్వారా శస్త్రచికిత్స అనంతరం చాలా వేగంగా కోలుకొని తిరిగి సాధారణ పనులు చేసే స్థాయికి చేరుకుంటారు.ఈ సాంకేతికత ముఖ్యంగా వృద్ధులకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. ఎండోస్కోపిక్ స్పైనల్ ఫ్యూజన్ ద్వారా వెన్నెముక శస్త్రచికిత్సల్లో సంక్లిష్టతలు కూడా బాగా తగ్గాయి’ అని పేర్కొన్నారు. ఏషియన్ స్పైన్ హాస్పిటల్ సీఈవో, డైరెక్టర్ నరేష్ కుమార్ పగిడిమర్రి మాట్లాడుతూ సరికొత్త ఆవిష్కరణలకు, రోగి కేంద్రీకృత వెన్నుముక సంరక్షణకు నాయకత్వం వహించడానికి ఆసుపత్రి నిబద్ధతను కొనియాడారు. ‘ఈ విజయం మా రోగులకు అత్యాధునిక వెన్నెముక చికిత్స , వ్యక్తిగతీకరించిన సంరక్షణను అందించడంలో మా దృఢమైన అంకితభావాన్ని నొక్కి చెబుతుంది. 200 ఫుల్ ఎండోస్కోపిక్ స్పైనల్ ఫ్యూజన్ సర్జరీలు (ఎండోఫ్యూజన్) పూర్తి చేయడం దేశంలో వెన్నెముక ఆరోగ్య సంరక్షణలో గణనీయమైన పురోగతిని సూచిస్తుంది’ అని అన్నారు. ఎండోఫ్యూజన్ అనేది ఎండోస్కోపీతో వెన్నెముకను సరిచేసే శస్త్రచికిత్స. ప్రస్తుతం అందుబాటులో ఉన్న అత్యంత అధునాతనమైన, నైపుణ్యవంతమైన, సురక్షితమైన వెన్నెముక శస్త్రచికిత్స. ఇలాంటి 200 ఫుల్ ఎండోస్కోపిక్ స్పైనల్ ఫ్యూజన్ సర్జరీలు (ఎండోఫ్యూజన్) పూర్తి చేయడం వంటి అద్భుతమైన విజయాలతో పాటు క్లినికల్ ఎక్సలెన్స్‌ విషయంలో ఏషియన్ స్పైన్ హాస్పిటల్ నిబద్ధతకు సాటిలేదు. అధునాత, వినూత్న వెన్నుసంరక్షణ పద్ధతుల్లో ప్రపంచంలోనే ప్రత్యేక స్థానాన్ని కలిగిఉంది. ఎండోస్కోపిక్ వెన్నెముక ప్రక్రియల కోసం డిమాండ్ పెరుగుతున్న కొద్దీ ఏషియన్ స్పైన్ హాస్పిటల్ భవిష్యత్తు అవసరాలను తీర్చడానికి సిద్ధంగా ఉంది. అదే సమయంలో మెరుగైన ఫలితాలు, త్వరగా కోలుకునేలా రోగులకు అధునాతన వెన్నెముక చికిత్సలను అందిస్తోంది.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు