Friday, October 11, 2024
spot_img

నీ నుంచి కావాల్సింది బ్యాటింగ్‌ కాదు.. బౌలింగ్‌

తప్పక చదవండి

అఫ్ఘనిస్తాన్‌తో జరుగుతున్న మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో టీమిండియా ఆటగాడు శివమ్‌ దూబే హైలెట్‌ గా నిలిచాడు. ఆడిన రెండు మ్యాచ్‌ ల్లో వరుసగా రెండు హాఫ్‌ సెంచరీలు బాదాడు. అంతేకాకుండా.. మ్యాచ్‌ని ముగించిన తీరు, స్పిన్నర్లపై స్ట్రోక్‌లు కొట్టిన తీరు.. మేనేజ్‌మెంట్‌ను తెగ అట్రాక్ట్‌ చేశాయి. అయితే.. ఈ ఫర్మార్మెన్స్‌ టీ20 ప్రపంచ కప్‌ 2024లో ఆడేందుకు బాటలు వేసింది. ఇదిలా ఉంటే.. బీసీసీఐ శివమ్‌ నుండి కొత్త డిమాండ్‌ ను కోరుతుంది. దూబే తన బౌలింగ్‌ సామర్థ్యాన్ని కూడా చూపించాలని బీసీసీఐ చెబుతోంది. కాగా.. ఇండోర్‌లో 22 బంతుల్లోనే హాఫ్‌ సెంచరీ సాధించగా.. శివమ్‌ కేవలం 32 బంతుల్లోనే 63 పరుగులు చేసిన తీరు అభిమానులకే కాదు మాజీ వెటరన్లకు కూడా ఫిదా అయిపోయారు. మొహాలీలో కూడా దూబే 60 పరుగులు చేశాడు. శివమ్‌ దూబే వీలైనంత ఎక్కువ బౌలింగ్‌ చేయాల్సి ఉందని బీసీసీఐ వర్గాలు తెలిపాయి. అతను కొన్ని ఓవర్లు బౌలింగ్‌ చేయగలిగితే, జట్టుకు చాలా విలువైనవాడు అవుతాడని పేర్కొంది. హార్దిక్‌ లేని స్థానాన్ని భర్తీ చేయవచ్చని తెలిపింది. కాగా, ఇటీవల రంజీ ట్రోఫీలో శివమ్‌ ఆరు వికెట్లు పడగొట్టాడు. శివమ్‌లో కనిపించిన అద్భుతమైన మార్పు చెన్నై సూపర్‌ కింగ్స్‌లో చేరిన తర్వాత జరిగింది. కెప్టెన్‌ %వీూ% ధోని అతనికి చాలా నమ్మకాన్ని ఇచ్చాడు. దూబేని ప్రోత్సహిస్తూనే.. ధోని అతనిని ఆర్డర్‌లో ఎక్కువ బ్యాటింగ్‌ చేయడమే కాకుండా అతని బౌలింగ్‌లో కూడా ప్రోత్సహించాడు. దాని ఫలితం దూబే ఫిట్‌నెస్‌, విశ్వాసంలో స్పష్టంగా కనిపించింది. గత రెండు మ్యాచ్‌ల్లో అతని దూకుడు బ్యాటింగ్‌ తర్వాత.. మాజీ ఆటగాళ్లు, అభిమానులు దూబే భారీ షాట్‌లను యువరాజ్‌ సింగ్‌తో పోల్చారు. అయితే బ్యాటింగ్‌తో పాటు బౌలింగ్‌ చేయగల సత్తా ఉంది గనుక.. ప్రపంచకప్‌ జట్టులో చోటు దక్కే అవకాశం ఉందని చెబుతున్నారు.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు