Saturday, May 4, 2024

పంజాబ్‌ను వణికించిన భూకంపం

తప్పక చదవండి

చండీగఢ్‌ : పంజాబ్‌లోని రూప్‌నగర్‌ బుధవారం వేకువ జామున భూకంపం సంభవించింది. రిక్టర్‌ స్కేల్‌పై 3.2 తీవ్రతతో 1.13 గంటల సమయంలో ప్రకంపనలు వచ్చాయని నేషనల్‌ సెంటర్‌ ఫర్‌ సిస్మోలజీ పేర్కొంది. రూప్‌నగర్‌లో భూమికి పది కిలోవిూటర్ల లోతులో భూకంప కేంద్రం గుర్తించినట్లు తెలిపింది. రాత్రి సమయంలో ఒక్కసారిగా ప్రకంపనలు రావడంతో జనం భయాందోళనకు గురయ్యారు. ఇళ్ల నుంచి బయటకు పరుగులు పెట్టారు. అయితే, ఇప్పటి వరకు ప్రకంపనలతో ఎలాంటి నష్టం జరిగినట్లు నివేదికలు అందలేదని అధికారులు పేర్కొన్నారు. ఇదిలా ఉండగా.. చైనా దక్షిణ జిన్‌జియాంగ్‌లోనూ ప్రకంపనలు వచ్చాయి. రిక్ట్‌ స్కేల్‌పై 5.5 తీవ్రతతో భూ కంపం వచ్చినట్లు యూరోపియన్‌ మెడిటరేనియన్‌ సిస్మోలాజికల్‌ సెంటర్‌ పేర్కొంది. భూమికి ఎనిమిది కిలోవిూటర్ల లోతులో ప్రకంపనలు వచ్చాయని పేర్కొంది.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు