Thursday, May 2, 2024

అమిత్‌ షా మాటల్లో పసలేదు!

తప్పక చదవండి

భారతీయ జనతాపార్టీ మూలస్థంభంగా చెప్పుకునే అమిత్‌ షా తెలంగాణ రాష్ట్రానికి వచ్చినప్పుడల్లా పోతరాజుల కొరడా దెబ్బల కు కొదువలేనట్టు, తాగిన మైకంలో పాట పాడిన వ్యక్తిలాగా మాట్లాడుతుంటాడు. రాష్ట్ర పర్యటనకు వచ్చినప్పుడల్లా అర్థంపర్థం లేని ప్రేలాపనలు, రాష్ట్ర బీజేపీ మెప్పుకోసం అవాకులు, చెవాకులు షరామామూలే. నవ్విపోదురుకాక నాకేంటి సిగ్గు అన్న మాదిరిగా ఏకంగా డిసెంబర్‌ లో ప్రభుత్వం ఏర్పాటు చేస్తారట? బీజేపీ పాలిస్తున్న రాష్ట్రాల్లో త్రాగునీరు లేక, సాగునీరు లేక అల్లాడిపోతుం టే డబుల్‌ ఇంజన్‌ సర్కార్‌ వస్తే తెలంగాణలో అభివృద్ధి మాట దేవుడెరుగుకాని, దేశానికే తలమానికంగా నిల్పిన రాష్ట్రాన్ని అమ్మకం పెట్టుడు మాత్రం ఖాయం.రాష్టంలో ప్రత్యక్షమైనప్పుడల్లా పాడిరదే పాడరా పాచిపళ్ళ దాసిగా అన్న చందంగా నీళ్ళమీద దెబ్బవేసినట్టు ప్రసంగం చేస్తాడు.కేసీఆర్‌ ను గెలవలేక అయన కుటుంబంపై ప్రేరలాపనలతో ఉదరగొట్టడం అలవాటు అయ్యింది. నల్లమొఖం చట్టాలు తెచ్చి 750మంది రైతులను పొట్టన పెట్టుకొన్నది తెలంగాణ రైతాంగానికి తెలియనట్టు రైతులపై ఎక్కడ లేనంత ప్రేమ కురిపిస్తాడు.ఇప్పటి వరకు ఓబిసి జనగణన ఊసే లేదు. ఎస్సి వర్గీకరణ ప్రస్తావన రాదు, ఎస్టీలకు 10శాతం రిజర్వేషన్లు కల్పించిన ప్రభుత్వంపై అక్కసుతో సామాజికన్యాయం కొరవడిరదంటూ మొసలికన్నీరు కార్చడం పరిపాటిఅయ్యింది.రాజకీయ నాయకుల భాషను బట్టే వారికి పరిస్థితులు సవ్యంగా లేవని,నల్లమొఖం అయ్యేట్టు ఉందిక నుకనే ఊకదంపుడు ఉపన్యాసాలనేది జనానికి అర్థం అవుతుంది. బహుశా ఎన్డీఏకు అధికారం దక్కదన్న అభిప్రాయంతోనే అక్కసుతో అబద్ధాలకు తెరలేపి, అడ్డగోలుగా మాట్లాడుతుంటే ఇక్కడ వారి పతనం మొదలైందని అర్థంచేసుకోవాలి. బీజేపీ రాజకీయం.అధికారం అటుఇటు మారుతోంది. దక్షిణాదిన పాగా వేయాలని రాష్ట్రానికి వచ్చినప్పుడల్లా అటు, ఇటు కుప్పిగంతులు వేస్తున్నారు. కానీ, ఏండ్ల తరబడి అవే శపథాలు, లోపబూయి ష్టమైన వ్యూహాలు, చిల్లర ఎత్తుగడలు. నిలబడని సవాళ్లు. కొత్తదనం లేక ప్రజలకు బోరు కొడుతోంది. అమిత్‌ షా తీరు మారడం లేదు. సీరియస్‌ గా చర్చించుకోవాల్సిన పాలిటిక్స్‌ ప్రజల దృష్టిలో చిల్లర రాజకీయాలను తలపిస్తున్నాయి. ఎన్నికల పుణ్యమా? అని రైతులపై ఉచిత వాగ్దానాలు చేస్తున్నారు.అయితే కాషాయం వ్యూహకర్తగా ఎవరినో ఒకరిని గెలిపించడానికి ప్రయత్నించడం లేదు. తెలంగాణలో అధికారానికి వచ్చే సత్తా తమకు లేదని తెలుసు.అందుకే విభజించి పాలించేందుకు కుట్రలు పన్నుతున్నారు.ఒక్కసారి గత చరిత్ర తిరగేసుకుంటే కొన్ని చారిత్రక సత్యాలు వెలుగులోకి వస్తాయి. ఈ విషయాలు అమిత్‌ షా కు తెలియవని కాదు… కానీ ,మళ్లి ఒక్కసారి గుర్తుచేద్దామనే 1984 లో రెండు సీట్లు ఉన్న బీజేపీ ఈ రోజు మోడీ, అమిత్‌ షా మొద్దులు కొట్టి, కూలి పని చేసి 303 సీట్లతో అజేయునిగా నిలువలేదు.దానివెనుక అజాత శత్రువు అటల్‌ బిహారీ వాజపేయి,ఎల్‌.కె అద్వానీ లాంటి రాజకీయ చాణక్యుల కఠోర శ్రమ,త్యాగం ఉందనేది జగద్విదితం.2013-14 లో వృద్ధి 11శాతం ఉంటే తలసరి ఆదాయాన్ని ఏటేటా గణనీయంగా మెరుగుపర్చుకొని తెలంగాణ 2022-23 కు వృద్ధి 15.1శాతం పెరిగి, తలసరి ఆదాయ గణాంకాల్లో ఏ రాష్ట్రానికి అందనంత ఎత్తులో నిలిచింది. లోకసభలో పూనమ్‌ మహాజన్‌ కుమారి, రమ్యా హరిదాసు అడిగిన ప్రశ్నలకు కేంద్ర గణాంక,ప్రణాళికా, కార్పొరేట్‌ వ్యవహారాల శాఖ సహాయ మంత్రి రావ్‌ ఇంద్రజిత్‌ సింగ్‌ వెల్లడిరచారు. ఐక్యరాజ్యసమితి అభివృద్ధి ప్రోగ్రాం నిర్వహించే మానాభివృద్ది సూచికలో దేశం పేదరికంలో 66 స్థానంలో ఉంటే అవినీతిలో 85శాతం ఉన్నది మర్చిపోయి.. కేసీఆర్‌ పై విరుచకపడడం విడ్డురంగా ఉంది. అమిత్‌ షా ఆదిలా బాద్‌ వేదికగా మాట్లాడిన మాటల్లో ఫసలేదు. అభద్రతా భావంతోనే కుటుంబపార్టీ అంటూ బాదనం చేసే పనిలో పడ్డారు.నిజం గడపదాటేలోపు అబద్దం ఊరంతా తిరుగాలనేది బీజేపీ సిద్ధాంతం. ఇంటి పెద్ద అబద్దం చెప్పితే అలంకార ప్రాయంగా ఉండేలా అబద్దాల యూనివర్సిటీ ఛాన్సలర్‌ అమిత్‌ షా వాండ్ల కాషాయం సోషల్‌ మీడియా కార్యకర్తలకు చేసే బోధ భావితరాన్ని అబద్దాల ఊబిలోకి నెట్టుతుంది.ఒక్కటి మాత్రం నిజం అమిత్‌ షా అబద్దాలు పదేపదే వల్లెవేసిన నిజాలు కావు. నిజం అనేది నిలకడ మీద తెలు స్తుంది. అబ్‌ కి బార్‌ కిసాన్‌ సర్కార్‌ పేరుతో తెలంగాణ మోడల్‌ దేశమంతా విస్తరిస్తుంటే ఓర్వలేక తెలంగాణ లోనే ఆత్మహత్యలు ఎక్కువగా ఉన్నాయని గోబెల్స్‌ ప్రచారానికి దిగడం బీజేపీ దిగజా రుడు తనానికి నిదర్శనం.విభజన చట్టంలోని గిరిజన విశ్వవిద్యా లయం ఏర్పాటు చేయకుండా తొమ్మిదేండ్లుగా తాత్సారం చేసి ఎన్నికలు దగ్గరపడగానే ప్రకటనచేసి ఆలస్యానికి తెలంగాణ ప్రభు త్వం కారణమని బురదజల్లే ప్రయత్నం చేస్తుంది. అసలు కారణం తండాలను,గూడెం లను పంచాయతీలుగా తీర్చిదిద్ది, స్వయం పాలనా సాగించుకుంటున్న గిరిజనులకు విద్య, ఉద్యోగా లలో 10 శాతం రిజర్వేషన్లు అమలు చేస్తూ 1/70 అనుకూలంగా పోడు భూములకు పట్టాలిచ్చి అడవి భూమికి హక్కులు కల్పించినందుకు ఆదరిస్తున్న ఆదివాసీ గిరిజనులను దూరం చేయాలనే కుట్రతో భూమి ఇవ్వలేదని అసత్యాలు తెగపడడం సిగ్గుచేటు.తెలంగాణ ఉద్యమంలో హరీశ్‌ రావు, కేటీఆర్‌, కవిత, సంతోష్‌ క్రియా శీలకంగా పోరాటం చేయకుం డానే పదవులు అనుభవిస్తున్నారా? నిజంగానే కేటీఆర్‌ ముఖ్య మంత్రిని చేద్దాం అనుకుంటే కేసీఆర్‌కు నాడు ఒకే ఒక లింగడు ఉన్న మీ అవసరం దేనికి? ఇంతకూ ఎవరిని రెచ్చగొట్టడానికి మీ ఆరాటం, మీబోడి పెత్తనం ఏమిటో అర్థం కావడంలేదు.ముక్కుసూటిగా చెప్పాలంటే తెలంగాణ సమాజమంతా కేసీఆర్‌ కుటుంబమే.బీజేపీ దుష్ప్ర చారాలు చైతన్యం వంతమైన తెలంగాణలో చెల్లవనేది నిర్వివాదాంశం.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు