Monday, May 20, 2024

అన్ని వర్గాల చూపు బిఆర్‌ఎస్‌ వైపే

తప్పక చదవండి
  • బిఆర్‌ఎస్‌లో చేరిన కాంగ్రెస్‌ నాయకుడు పుశ్వంత్‌రెడ్డి

హైదరాబాద్‌ : రాష్ట్రంలోని అన్ని వర్గాల ప్రజల చూపు పార్టీ వైపే ఉందని సనత్‌ నగర్‌ ఎమ్మెల్యే అభ్యర్థి, మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ అన్నారు. మంగళవారం వెస్ట్‌ మారేడ్‌పల్లిలోని తన నివాసం వద్ద పద్మారావు నగర్‌కు చెందిన కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నాయకుడు హైదరాబాద్‌ సిటీ జనరల్‌ సెక్రటరీ అనుగు పుశ్వంత్‌ రెడ్డి మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ సమక్షంలో ఃఖీూ పా ర్టీలో చేరారు. మంత్రి ఆయనకు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ అధికారంలో ఉన్నంత కాలం అభివృద్ధి, ప్రజల సంక్షేమాన్ని కాంగ్రెస్‌ పార్టీ నిర్లక్ష్యం చేసిందని, మళ్లీ ఇప్పుడు మరొక్క చాన్స్‌ అంటూ వస్తున్నారని విమర్శించారు. జనం మోసకారి కాంగ్రెస్‌ పార్టీని నమ్మడం లేదని చెప్పారు. అనేక అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్న ఐఅఖీ నాయకత్వాన్ని, తెలంగాణ ప్రభుత్వానికి మద్దతు తెలుపుతున్నారని తెలిపారు. తిరిగి అధికారంలోకి రావడం, హ్యాట్రిక్‌ సాధించడం ఖాయమని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో పద్మారావు నగర్‌ బీఆర్ఎస్ పార్టీ ఇంచార్జి గుర్రం పవన్‌ కుమార్‌ గౌడ్‌, బన్సీలాల్‌ పేట డివిజన్‌ అధ్యక్షుడు వెంకటేషన్‌ రాజు, జనరల్‌ సెక్రెటరీ మహేందర్‌, నాయకులు ఏసూరి మహేష్‌, మినుముల సురేష్‌ తదితరులు ఉన్నారు.

నిర్మల్‌లో మంత్రి మంత్రి ఇంద్రకరణ్‌ రెడ్డి సమక్షంలో చేరికలు
నిర్మల్‌ నియోజకవర్గంలో బీఆర్‌ఎస్‌లోకి వలసల జోరు కొనసాగుతున్నది. సీఎం కేసీఆర్‌ సారధ్యంలోనే అభివృద్ధి సాధ్యమని నమ్మి కాంగ్రెస్‌, బీజేపీ నేతలు, కార్యకర్తలు బీఆర్‌ఎస్‌ లో చేరుతున్నారు. మంగళవారం సోన్‌ మండలం కడ్తాల్‌ గ్రామానికి చెందిన యువసేన యూత్‌, రెబల్‌ స్టార్‌ యూత్‌, గరుడ యూత్‌, హల్‌ చల్‌ యూత్‌, శ్రీరామ్‌ యూత్‌, రెబల్‌ యూత్‌తో పాటు కాంగ్రెస్‌, బీజేపీకి చెందిన మహిళలు100 మంది మంత్రి ఇంద్రకరణ్‌ రెడ్డి సమక్షంలో బీఆర్‌ఎస్‌లో చేరారు. మామాడ మండలం పులిమగుడుగు గ్రామం, నిర్మల్‌ పట్టణంలోని మహాలక్ష్మి వాడకు చెందిన బీజేపీ, కాంగ్రెస్‌ కార్యకర్తలు గులాబీ జెండాకు జై కొట్టారు. వీరందరికీ మంత్రి ఇంద్రకరణ్‌ రెడ్డి గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ..అభివృద్ధి, సంక్షేమ పథకాల అమలు, ప్రజల సమస్యమల పరిష్కారమే ప్రధాన ఎజెండగా పని చేస్తున్నామన్నారు. అభివృద్ధిని చూసి కారు గుర్తుకు ఓటేసి గెలిపించాలని కోరారు. బీజేపీ, కాంగ్రెస్‌ పార్టీలు ఎన్నికల్లో ఎలాంటి కుట్రలు చేస్తున్నాయో ప్రజలు గమనించాలన్నారు. ఈ కార్యక్రమంలో బీఆర్‌ఎస్‌ సీనియర్‌ నాయడు సత్యనారాయణ గౌడ్‌, తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

సిఎం కెసిఆర్‌ సమక్షంలో బిఆర్‌ఎస్‌లో చేరిన నాగం జనార్దన్‌రెడ్డి
మాజీ మంత్రి నాగం జనార్ధన్‌ రెడ్డి బీఆర్‌ఎస్‌ పార్టీలో చేరారు. తెలంగాణ భవన్‌లో ముఖ్యమంత్రి కేసీఆర్‌ సమక్షంలో గులాబీ గూటికి చేరారు. ఈ సందర్భంగా నాగం జనార్ధన్‌ రెడ్డికి కేసీఆర్‌ గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. నాగం మద్దతుదారులు కూడా భారీ సంఖ్యలో కారెక్కారు. సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న నాగం జనార్దన్‌రెడ్డి ఉమ్మడి రాష్ట్రంలో మంత్రిగా పనిచేశారు. వైఎస్‌ హయాంలో ఓబులాపురం మైనింగ్‌ కుంభకోణంపై పోరాటం చేసిన నాయకుడిగా గుర్తింపు పొందారు. బీజేపీలో కొంతకాలం పనిచేశారు. తరువాత ‘తెలంగాణ నగారా’ పార్టీని స్థాపించారు. ఆ తరువాత కాంగ్రెస్‌లో చేరారు. ఇటీవల ఆ పార్టీకి రాజీనామా చేశారు. ఇవాళ బీఆర్‌ఎస్‌లో చేరారు.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు