- పోలీసులే లక్ష్యంగా మందుపాతర పేల్చివేత
ఛత్తీస్‌గఢ్ : ఛత్తీస్‌గఢ్‌లో అసెంబ్లీ ఎన్నికల ఫలితాలకు ముందురోజు మావోయిస్టులు రెచ్చిపోయారు. పోలీసులే లక్ష్యంగా మందుపాతర పేల్చారు. బర్సూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో మావోయిస్టులు శనివారం మధ్యాహ్నం ఐఈడీ బ్లాస్ట్ చేశారు. ఈ ఘటనలో ఇద్దరు సీఆర్పీఎఫ్ జవాన్‌లు తీవ్రంగా గాయపడ్డారు. పలువురికి గాయాలు కావడంతో వారిని ఆస్పత్రికి తరలించి చికిత్స అందజేస్తున్నట్లు దంతెవాడ పోలీసులు వెల్లడిరచారు. అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడేందుకు ఒకరోజు ముందు ఈ ఘటన జరగడంతో అందరూ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కాగా నవంబరులో తొలి దశ ఎన్నికల పోలింగ్ సమయంలో ఛత్తీస్‌గఢ్ సుక్మా జిల్లాలోని తొండమార్క ప్రాంతంలో మావోయిస్టులు ఇదే తరహా ఘటనకు పాల్పడ్డారు. ఎఇఆ పేలుడులో అఖీఖఈ కోబ్రా బెటాలియన్‌కు చెందిన ఒక జవాన్ గాయపడ్డారు. ఛత్తీస్‌గఢ్ అసెంబ్లీ ఎన్నికల తొలి విడతలో కుంట అసెంబ్లీ నియోజకవర్గానికి నవంబర్ 7న పోలింగ్ జరిగింది. ఎన్నికల విధుల కోసం నియమించిన సీఆర్పీఎఫ్ జవాన్‌లను లక్ష్యం చేసుకుని ఆనాడు మావోయిస్టులు మందుపాతర పేల్చారని సుక్మా జిల్లా ఎస్పీ కిరణ్ చవాన్ వెల్లడించారు.