Tuesday, April 30, 2024

నేడే ఓట్ల లెక్కింపు

తప్పక చదవండి
  • కౌంటింగ్‌ కేంద్రాల వద్ద భారీ భద్రత
  • 8గంటలకు కౌంటింగ్‌ ప్రారంభం
  • 10కల్లా తొలి ఫళితం వెలువడే ఛాన్స్‌
  • భారీగా భద్రాతా ఏర్పాట్లు చేసిన ఈసీ

హైదరాబాద్‌ : తెలంగాణ వ్యాప్తంగా నేడు జరిగే కౌంటింగ్‌కు భారీగా ఏర్పాట్లు చేశారు. ఫలితాలను ఎప్పటికప్పుడు ప్రకటించేలా విస్తృతంగా ఏర్పాట్లు జరిగాయి. ఎన్నికల సంఘం ఆదేశాలతో పోలీసులు భారీగా మొహరించారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జర్కుండా ముందస్తు చర్యలు తీసుకున్నారు. 49 కౌంటింగ్‌ కేంద్రాల్లో భారీ భద్రత చోటు చేసుకుంది. 119 నియోజకవర్గాల వారిగా కౌంటింగ్‌కు ఏర్పాట్లు పూర్తి చేశారు. ఉదయం 10గంటల కల్లా తొలి ఫలితం వచ్చేస్తుందని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి వికాస్‌రాజ్‌ తెలిపారు. కౌంటింగ్‌ కోసం అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేస్తున్నారు. మరోవైపు తెలంగాణ ఎన్నికల ఫలితాలపై రాష్ట్ర ప్రజలంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఏ పార్టీ అధికారంలోకి వస్తుందో తెలుసుకోవాలని ఆతృత పడుతున్నారు. కౌంటింగ్‌ కేంద్రాల వద్ద మూడంచెల భద్రత, సీసీ కెమెరాలతో పర్యవేక్షణ నిర్వహించనున్నారు. హైదరాబాద్‌, రంగారెడ్డి, మేడ్చెల్‌ జిల్లాలో 29 కౌంటింగ్‌ కేంద్రాలు ఏర్పాటు చేయడం జరిగింది. కౌంటింగ్‌ కేంద్రాల వద్ద పోలీసుల ఆంక్షలు, 144 సెక్షన్‌ అమలు చేశారు. కౌంటింగ్‌ సందర్భంగా రోడ్లపై ర్యాలీలు, టపాసులు కాల్చడం, ఊరేగింపులపై నిషేధం విధించడం జరిగింది. రాష్ట్రవ్యాప్తంగా నేడు మద్యం దుకాణాలు బంద్‌ చేశారు. ఉదయం 5గంటలకే కౌంటింగ్‌ కేంద్రాలకు అధికారులు, సిబ్బంది చేరుకోనున్నారు. లెక్కింపునకు ముందు గంటపాటు ఉద్యోగులకు దిశ నిర్దేశర చేయడం జరిగింది. ఆర్వో ధృవీకరించిన తర్వాత 20 నిమిషాల్లో ఒక్కో రౌండ్‌ ఫలితం వెలువడనుంది. వేగంగా ఫలితాలు ఇచ్చేందుకు ప్రత్యేక సాప్ట్‌ వేర్‌ ఏర్పాటు చేయడం జరిగింది. స్ట్రాంగ్‌ రూముల వద్ద 40 కేంద్ర కంపెనీల బలగాలతో భద్రత పెంపొందించనున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 2,290 మంది అభ్యర్ధుల భవితవ్యం తేలనుంది. మొత్తం 1766 టేబుల్స్‌ ఏర్పాటు చేయడం జరిగింది.ఆదివారం ఉదయం 8గంటల నుంచి ఓట్ల లెక్కింపు ప్రారంభకానుండగా… ఫలితాల కోసం ఏర్పాట్లు కూడా జరిగాయి. గురువారం రాత్రే ఈవీఎంలను పార్టీ ఏజెంట్ల సమక్షంలోనే స్ట్రాంరూంలకు తరలించారు. ఈవీఎంలు భద్రపరిచిన గదుల దగ్గరకు ఎవరినీ అనుమతించడం లేదు. స్ట్రాంగ్‌ రూంల దగ్గర సీసీ కెమెరాల పర్యవేక్షణ ఉంది. డీసీపీ స్థాయి అధికారి ఇద్దరు సీఐలు, నలుగులు ఎస్‌ఐలతో పాటు కేంద్ర బలగాలు స్ట్రాంగ్‌ రూముల దగ్గర పహారా కాస్తున్నాయి. మొత్తం 40 కంపెనీల కేంద్ర బలగాలు ఈవీఎంల దగ్గర బందోబస్తు విధుల్లో ఉంచారు. ఓట్ల లెక్కింపు పక్రియ ప్రారంభమయ్యే వరకు రాష్ట్రంలో 144 సెక్షన్‌ అమల్లోనే ఉంటుంది. తెలంగాణ ఎన్నికల కౌంటింగ్‌కు పకడ్బంధీ ఏర్పాటు చేసినట్టు రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి వికాస్‌రాజ్‌ తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా 49 కేంద్రాలు ఏర్పాటు చేశారు. వీటిలో హైదరాబాద్‌ నగరంలో అత్యధికంగా 14 లెక్కింపు కేంద్రాలు పెట్టారు. ఖైరతాబాద్‌, జూబ్లీహిల్స్‌ నియోజకవర్గాల ఓట్ల లెక్కింపు కోట్ల విజయభాస్కర్‌ రెడ్డి స్టేడియంలో చేపడుతున్నారు. మిగిలిన 13 నియోజకవర్గాలకు విడిగా కేంద్రాలు ఏర్పాటు చేశారు. అలాగే… రంగారెడ్డి జిల్లాలో నాలుగు, మిగిలిన జిల్లాల్లో ఒక్కొటి చొప్పున ఓట్ల లెక్కింపు కేంద్రాలను సిద్ధం చేశారు అధికారులు. కౌంటింగ్‌ కేంద్రాల వద్ద మూడంచెల భద్రత ఏర్పాటు చేశామన్నారు. కౌంటింగ్‌ కోసం మొత్తం 17వందల 66 టేబుల్స్‌ ఏర్పాటు చేశారు. జీహెచ్‌ఎంసీ పరిధిలో 500 పోలింగ్‌ కేంద్రాల కంటే ఎక్కువగా ఉన్న ఆరు నియోజకవర్గాల్లో 28 టేబుల్స్‌, మిగిలిన నియోజకవర్గాల్లో 14 చొప్పున ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. ప్రతి కౌంటింగ్‌ టేబుల్‌ వద్ద నలుగురు ఎన్నికల సిబ్బంది ఉండనున్నారు. ఒక్కో టేబుల్‌ దగ్గర మైక్రో అబ్జర్వర్‌, ఒక కౌంటింగ్‌ సూపర్‌ వైజర్‌, ఇద్దరు అసిస్టెంట్లను కేటాయించారు. చిన్న నియోజకవర్గంలో ఉదయం 10గంటలకల్లా ఫలితం వెలువడే అవకాశం ఉంది. ఇక, పోస్టల్‌ బ్యాలెట్‌ల లెక్కింపు కోసం ప్రత్యేకంగా 500 ఓట్లకు ఒక టేబుల్‌ చొప్పున ఏర్పాటు చేస్తున్నామన్నారు. పోస్టల్‌ బ్యాలెట్‌ ఓట్ల లెక్కింపు కూడా సమాంతరంగా జరుగుతుందని చెప్పారు వికాస్‌రాజ్‌. లక్షా 80వేల మంది పోస్టల్‌ బ్యాలెట్‌ ద్వారా ఓటు హక్కు వినియోగించుకున్నార న్నారు. తెలంగాణ ఎన్నికల బరిలో 2వేల 290 మంది అభ్యర్థులు ఉండగా… వీరిలో 221 మంది మహిళలు, ఒకరు ట్రాన్స్‌జెండర్‌. తెలంగాణలో మొత్తం 71.06 శాతం పోలింగ్‌ జరిగిందన్నారు రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి వికాస్‌రాజ్‌. మునుగోడులో అత్యధికంగా 91.5 శాతం పోలింగ్‌ నమోదు కాగా.. యాకుత్‌పురాలో అత్యల్పంగా 39.6శాతం పోలింగ్‌ నమోదైనట్లు వికాస్‌ తెలిపారు. గత ఎన్నికలతో పోలిస్తే మూడు శాతం పోలింగ్‌ తగ్గిందని చెప్పారు. రాష్ట్రంలో ఎక్కడా రీపోలింగ్‌కు అవకాశం లేదని స్పష్టం చేశారు. రాష్ట్రంలో 79 నియోజకవర్గాల్లో 75శాతం కంటే ఎక్కువ పోలింగ్‌ నమోది. స్ట్రాంగ్‌ రూంలకు అన్ని రకాలుగా భద్రత చర్యలు తీసుకున్నామని, సీసీ కెమెరాలు ఏర్పాటు చేశామని వెల్లడిరచారు. 49 ప్రాంతాల్లో లెక్కింపు కేంద్రాలు ఉన్నాయని వివరించారు. కౌంటింగ్‌ కేంద్రాల వద్ద మూడంచెల భద్రతా వ్యవస్థను ఏర్పాటు చేశారు. ప్రతి కౌంటింగ్‌ టేబుల్‌ వద్ద నలుగురు ఎన్నికల సిబ్బంది ఉంటారని వెల్లడిరచారు. పోస్టల్‌ బ్యాలెట్‌ ద్వారా 1.80 లక్షల మంది ఎన్నికల సిబ్బంది ఓటు హక్కు వినియోగించుకున్నారని పేర్కొన్నారు. కూకట్‌పల్లి, ఉప్పల్‌, మల్కాజ్‌గిరి, పఠాన చెరువు, నియోజకవర్గాల్లో పోలింగ్‌ కేంద్రాలు 400 పైగా ఉండటంతో ఇక్కడ మాత్రం 20 టేబుల్స్‌ ఏర్పాటు చేశారు. రాజేంద్రనగర్‌, ఎల్బీనగర్‌, శేర్‌లింగంపల్లి, మహేశ్వరం, మేడ్చల్‌ నియోజకవర్గాల్లో 500 పైగా పోలింగ్‌ కేంద్రాలుండటంతో 28 టేబుల్స్‌ ఏర్పాటు చేయడం జరిగింది.రేపు జరుగనున్న కౌంటింగ్‌ ఏర్పాట్లపై సీపీలు, ఎస్పీలతో డీజీపీ అంజనీ కుమార్‌ టెలీ కాన్ఫరెన్స్‌ నిర్వహించారు.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు