Monday, May 20, 2024

ఆదాబ్ స్పందన

తప్పక చదవండి
  • నవీన్ మిట్టల్ ను ఇంటర్ మీడియేట్ ఎడ్యుకేషన్ డైరెక్టర్, బోర్డు అఫ్ ఇంటర్ మీడియేట్ ఎడ్యుకేషన్ సెక్రటరీ బాధ్యతల నుండి
    తొలగింపు
  • బాధ్యతలు చేపట్టనున్న శృతి ఓజా
  • ఉత్తర్వులు జారీ చేసిన సీఎస్ శాంతి కుమారి

ఆయన వెలగబెట్టేది అత్యున్నత వుద్యోగం.. బ్యూరోక్రాట్ గా సవాళ్ళను ఎదుర్కొనే విధులు.. తన విధి నిర్వహణలో ప్రజా ప్రయోజనాలను పరిరక్షించాల్సిన గురుతర బాధ్యత ఆయనది.. కానీ ఉద్యోగం గొప్పదైనా ఆయన బుద్ధిమాత్రం నీచం.. తనకున్న విశిష్ట అధికారాలను అడ్డుపెట్టుకుని అడ్డుగోలుగా ప్రవర్తించడం ఆయనకు అలవాటు.. కింది స్థాయి ఉద్యోగులను అవమానించడం.. బాధించడం.. క్షోభపెట్టడం ఆయనకు ఒక ఫన్నీ గేమ్ లాగా అనిపిస్తుంది.. ఇక ఫైళ్లు మార్చడం.. అక్రమ ఆస్తులు కూడబెట్టడం ఆయనకు వెన్నతో బెట్టిన విద్య.. చివరికి అవినీతి అనే పదం కూడా అతగాడిని చూసి సిగ్గు పడుతుంది.. అంతటి ఘనాపాటి ఆయన.. అయన ఎవరో కాదు నవీన్ మిట్టల్ ఐఏఎస్.. అతగాడి నీచ చరిత్ర తెలుపుతూ.. అక్రమాల ఐఏఎస్ నవీన్ మిట్టల్ అనే శీర్షికతో శనివారం ప్రసరించిన ఆదాబ్ కథనానికి స్పందించిన ప్రభుత్వం ఇంటర్ మీడియేట్ ఎడ్యుకేషన్ డైరెక్టర్, బోర్డు అఫ్ ఇంటర్ మీడియేట్ ఎడ్యుకేషన్ సెక్రటరీ బాధ్యతలను నిర్వర్తిస్తున్న నవీన్ మిట్టల్ ను తప్పించి శృతి ఓజాకు బాధ్యతలను అప్పజెప్పడం జరిగింది. కానీ, నవీన్ మిట్టల్ సిసిఎల్ఏ కమీషనర్ గా, రెవెన్యూ ప్రిన్సిపల్ సెక్రెటరీ గా, స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ కమీషనర్ గా ఇంకా కీలకమైన బాధ్యతల్లో కొనసాగుతున్నారు. ఇతగాడు నిర్వర్తిస్తున్న శాఖలలో అవినీతి, అక్రమాలు జోరుగా కొనసాగుతున్నాయి. అవినీతి పరుడైన నవీన్ మిట్టల్ ను వెంటనే ఆయా బాధ్యతల నుండి తప్పించాలని సామాజికవేత్తలు కోరుతున్నారు. నవీన్ మిట్టల్ చేసిన అవినీతి బాగోతం పై పూర్తి ఆధారాలతో సమాజ దృష్టికి తీసుకురానుంది ఆదాబ్ హైదరాబాద్.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు