రంగారెడ్డి : మైలార్‌దేవ్‌పల్లిలో మంగళవారం అర్ధరాత్రి దోపిడీ దొంగలు బీభత్సం సృష్టించారు. దొంగలను అడ్డుకునేందుకు వచ్చిన సెక్యూరిటీగార్డును దారుణంగా హత్య చేశారు.ఆరాంఘర్ చౌరస్తాలోని ఓ పరిశ్రమలో దొంగతనం చేసేందుకు మంగళవారం అర్ధరాత్రి దొంగలు వచ్చారు. దొంగలను గమనించిన సెక్యూరిటీ గార్డు ఆసిఫ్ వారిని అడ్డుకునేందుకు యత్నించాడు. కానీ దొంగలు ఆసిఫ్‌పై దాడి చేసి చంపారు. అనంతరం గోడౌన్‌లోని విలువైన ఐరన్ రాడ్స్‌తో పాటు ఆరు సీసీకెమెరాలను అపహరించారు.
ఆసిఫ్ హత్యకు గురైనట్లు గోడౌన్ యజమానికి సమాచారం అందింది. అక్కడికి చేరుకున్న యజమాని ఆసిఫ్ మృతదేహాన్ని చూసి భయంతో వణికిపోయాడు. పోలీసులకు సమాచారం అందించాడు. ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు, మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. యజమాని ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. దోపిడీ దొంగల కోసం గాలిస్తున్నారు. ఆరాంఘర్ ఏరియాలో ఉన్న సీసీటీవీ కెమెరాల ఫుటేజీని పరిశీలిస్తున్నారు.
తప్పక చదవండి
-Advertisement-