Tuesday, May 7, 2024

పశువుల పాకలో భారీ కుంభకోణం

తప్పక చదవండి
  • చందంపేట ఎంపీడీవో కార్యాలయం చుట్టూ అలుముకున్న అవినీతిమయం
  • ఎంజీఎన్ఆర్ఇజిఎస్ నిధులు గోల్మాల్
  • నిరుపేదలకు దక్కాల్సిన పథకాలను ఎంపీడీవో ఇంట్లోకి నేరుగా చేర వేస్తున్న అధికారా బృందం
  • పశువులకు నిలువ నీడ లేకుండా చేసిన ఎంపీడీవో రాములు నాయక్

చందంపేట : చందంపేట మండలం అడవికి ఆనుకొని ఉండడంతో గ్రామంలో నివసించే ప్రతి ఒక్కరికి జీవనాధారం ఏదైనా ఉందంటే మూగజీవాలతోనే వారికి సత్సంబంధాలు బలంగా ఏర్పడ్డాయి అని చెప్పాలి ఇలాంటి తరుణంలో గత కొన్ని సంవత్సరాలుగా చందంపేట మండలానికి ఎంపీడీవోగా విధులు నిర్వహిస్తూ అమాయక ప్రజలకు మాయ మాటలు చెబుతూ అందినకాడికి దోచుకు తింటూ.అందలమెక్కిన ఎంపీడీవో రాములు నాయక్.

పోతి వివరాల్లోకి వెళితే:-డిమాండ్-ఆధారిత వేతన ఉపాధి కార్యక్రమం రాష్ట్రాలు,కేంద్రపాలిత ప్రాంతాలకు నిధుల విడుదల నిరంతర ప్రక్రియ పని కోసం డిమాండ్‌ను దృష్టిలో ఉంచుకుని కేంద్ర ప్రభుత్వం నిధులు అందుబాటులో ఉంచుతోంది.రాష్ట్రాలు,కేంద్రపాలిత ప్రాంతాలకు నిధుల విడుదల ప్రక్రియను మరింత వివరించింది,ఇది అంగీకరించిన లేబర్ బడ్జెట్,ఓపెనింగ్ బ్యాలెన్స్,మునుపటి సంవత్సరంలో పెండింగ్‌లో ఉన్న అప్పులు,ఏదైనా ఉంటే,మొత్తం పనితీరు ఆధారంగా ఉంటుంది.ఎంజిఎన్ఆర్ఇజిస్ కోసం అవసరమైనప్పుడు భూమిపై పని కోసం డిమాండ్‌ను తీర్చడానికి అదనపు నిధులను కోరుతుంది.అని అది ఇంకా పేర్కొంది.గ్రామలలో ఉన్న నిధులను దోచేయడమే పనిగా పెట్టుకుని గ్రామాలలో ఉన్న నిధులు కొల్లగొట్టి తమ బినామీల పేర్ల మీద నిధులు మళ్లించిన ఘనులు మండల పరిషత్ అధికారులు.చందంపేట మండలం పరిషత్ కార్యాలయంలో ఆధ్వర్యంలో 28 గ్రామపంచాయతీలో ఉండగా గత కొన్ని సంవత్సరాలుగా గ్రామాలకు రావలసిన నిధులను పక్కదారి పట్టిస్తున్నారని ఎన్నో అపాహాలు ఉన్నా.వాటిని పట్టించుకోకుండా ఎలాంటి అక్రమాలకు తావు లేదన్నట్టు వ్యవహరిస్తూ.పశువుల పాక పేరుతో పశువులకు నిల్వ నీడ వేయకుండానే నిధులు దోచేసిన ఘనత ఎంపీఓ రాముల నాయక్ కు దక్కింది.చందంపేట మండలంలో కొన్ని గ్రామాలలో ఉన్నాయని నిధులు దొంగలించి పశువుల పాకలు వేయకుండా నిధులను సొంతంగా నేరుగా తమ ఇంట్లోకి తెచ్చుకున్న ఘనత ఎంపీడీవో రాముల నాయక్ మాత్రమే చెందుతుందని చందంపేట మండల రైతులు వాపోతున్నారు. గ్రామ ప్రథమ పౌరులను గ్రామాల్లో ఉన్న ప్రజలను వారి ఆలోచనలను పక్కదారి పట్టే విధంగా నడుచుకుంటూ కొన్ని లక్షల కోట్ల రూపాయలు కొల్లగొట్టిన చందంపేట మండల పరిషత్ అధికారి. దేవరకొండ నియోజకవర్గంలో అత్యంత వెనుకబడిన మండలం ఏదైనా ఉందంటే అది చందపేట మండలం అని ఏ ఒక్కరిని అడిగిన చెబుతారు అలాంటి మండలానికి భారీ ఎత్తున వచ్చిన నిధులను తమకు మాత్రమే సొంతం అన్నట్టు మండల అధికారులు ఎంపీడీవో అప్పనంగ దోచుకుంటూ తమ బినామీల పేరుమీద భద్రపరిచిన తీరును చూస్తే ప్రతి ఒక్కరూ ఆచర్యపడాల్సిందే,ఎంపీడీవో రాములు నాయక్.గ్రామపంచాయతీ నిధులు ఎటు దారి మల్లయో తెలియక అవస్థలు పడుతున్న గ్రామ సర్పంచులు,ఇదంతా తెలిసి తమకు సంబంధం లేనట్టు వ్యవహరిస్తున్న గ్రామ కార్యదర్శులు.ఈ తాతంగమంతా గత కొన్ని సంవత్సరాలుగా జరుగుతున్న ఏ ఒక్కరు కూడా గుర్తించలేదు.గత కొన్ని నెలలుగా గ్రామానికి సంబంధించిన ఖాతాలో నుండి డబ్బులు పోతున్నట్టు కార్యదర్శిలతో చర్చించగా తమకు ఏమీ తెలియదని నిర్లక్ష్యంగా సమాధానం చెప్పే సాగుతూ ఉండగా తమ గ్రామపంచాయతీ నిధులను సర్పంచులకు తెలియకుండా తన బినామీలు అయినటువంటి కంప్యూటర్ ఆపరేటర్ హరిబాబు,ఎంజీఎన్ఆర్ఈజీఎస్ ఫీల్డ్ అసిస్టెంట్ గెలబోయిన మల్లయ్య బ్యాంక్ ఖాతాలోకి అక్రమంగా నిధులను మళ్లించిన వైనం.ఏదేమైనా గ్రామపంచాయతీ నిధులు పక్కదారి పట్టిస్తున్నారు.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు