Sunday, May 5, 2024

ఒడ్డుకు వచ్చిన నాలుగు టన్నుల తిమింగలం

తప్పక చదవండి

ముంబయి : తిమింగలం పిల్ల తీరానికి వచ్చి ఇసుకలో కూరుకుపోయింది. అది అక్కడే కొట్టుమిట్టాడుతుండగా గమనించిన స్థానికులు, పర్యాటకులు కలిసి 40 గంటలు శ్రమిం చి దానిని తిరిగి నీళ్లలోకి పంపించగలిగారు. మహారాష్ట్రలోని రత్నగిరి జిల్లా గణపతిపులే తీరంలో ఈ ఘటన చోటుచేసుకుంది.దీని బరువు నాలుగు టన్నులు ఉండడంతో ఇసుక నుంచి బయటకు లాగి, దీనిని సముద్రంలోకి పంపించేందుకు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. ఒక బెల్టుకు దీనిని కట్టి లాగే ప్రయత్నం చేస్తే ఆ ప్రాణికి గాయాలయ్యాయి. దీంతో వాటిని నయం చేసే వైద్యుల్ని రప్పించారు. పోలీసులు, తీరగస్తీ దళం కూడా రంగంలో దిగాల్సి వచ్చింది. సోమవారం ఉదయం నుంచి ప్రయత్నాలు మొదలైతే బుధవారం పడవ సాయంతో ఆ ప్రాణిని సముద్రం లోపలకు 7`8 నాటికల్‌ మైళ్ల దూరం లాక్కొని వెళ్లి వదిలారు.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు