- 69వ జాతీయ సినిమా అవార్డుల్లో సత్తాచాటిని తెలుగోడు..
- 69 ఏళ్లలో తొలిసారి తెలుగు హీరోకు నేషనల్ అవార్డు..
69వ జాతీయ సినిమా అవార్డులు ప్రకటించారు.. అవార్డుల్లో తెలుగోడు సత్తాచాటాడు.. పుష్ప సినిమా హీరో అల్లు అర్జున్‌కు బెస్ట్ హీరో అవార్డు, ఉత్తమ నటిగా అలియా భట్‌కు అవార్డులు రావడంతో తెలుగు సినిమా పరిశ్రమలో హర్షాతిరేకాలు వెల్లువెత్తాయి.. కాగా ట్రిపుల్ ఆర్ సినిమాకు అవార్డుల పంట పండింది.. ఉత్తమ స్టంట్ కొరియో గ్రాఫర్‌గా కింగ్ సాల్మన్.. ఉత్తమ కొరియోగ్రాఫర్‌గా ప్రేమరక్షిత్.. ఉత్తమ విజువల్ ఎఫెక్ట్స్ సూపర్ వైజర్‌గా శ్రీనివాస మోహన్.. ఉత్తమ గాయకుడు కాలభైరవ (ఆర్‌ఆర్‌ఆర్).. ఉత్తమ నేపథ్య సంగీతం కీరవాణి.. ఉత్తమ సంగీత దర్శకుడు (పుష్ప) దేవీశ్రీ ప్రసాద్. ఉత్తమ ప్రాంతీయ చిత్రంగా ఉప్పెన ఉత్తమ గీత రచయితగా చంద్రబోస్ (కొండపొలం).. బెస్ట్ ఫిల్మ్ క్రిటిక్ (తెలుగు) అవార్డ్ పురుషోత్తమాచార్యులు అవార్డులు అందుకోవడంపై సర్వత్రా అభినందనలు అందుతున్నాయి..
2021 ఏడాదికి 24 కేటగిరీల్లో జాతీయ అవార్డులు :
ఉత్తమ ప్రాంతీయ చిత్రం (హిందీ) సర్దార్ ఉద్దమ్.. ఉత్తమ ప్రాంతీయ చిత్రం (కన్నడ) 777 చార్లీ.. ఉత్తమ ప్రాంతీయ చిత్రం (తమిళం) కడైసి వ్యవసాయి.. అవార్డుల లిస్టులో ఉన్నాయి..