Monday, May 6, 2024

జంతువుల పేరుచెప్పి దోచేస్తున్నారు..

తప్పక చదవండి
  • హైదరాబాద్ జూ పార్క్ లో వెలుగుచూసిన దోపిడీ..
  • టెండర్లు పిలవకుండానే మెటీరియల్ కొనుగోలు..
  • జూ క్యూరేటర్ల చేతివాటం..?
  • బదిలీ అయినా చక్రం తిప్పుతున్న నెహ్రూ జూలాజికల్ పార్క్
    క్యూరేటర్ ప్రశాంత్ భాజీరావు పాటిల్..
  • అడ్వాన్స్ గా రూ. 50 లక్షలు అడ్వాన్ తీసుకుని
    వర్క్ చేస్తున్న అసిస్టెంట్ క్యోరేటర్లు శ్రీదేవి, లక్ష్మణ్ లు..
  • వీరికేమైనా స్పెషల్ జీఓ ఉందా..?

హైదరాబాద్ లో నెహ్రూ జూలాజికల్ పార్క్ ఎంతో పేరెన్నికగన్నది.. ప్రతిరోజూ వేలాదిమంది సందర్శకులు ఈ పార్క్ కు వచ్చి జంతువులను చూసి ఆనందం పొందుతుంటారు.. జూ నిర్వహణ కోసం అవసరమైన సామాగ్రి కొనడానికి ప్రభుత్వం కొంత నిధులను కేటాయిస్తూ ఉంటుంది.. అవసర నిమిత్తం రూ. 50వేల వరకు ఖర్చుపెట్టవచ్చు.. అత్యవసర పరిస్థితుల్లో రూ. 3 లక్షలవరకు ఖర్చుపెట్టే వెసులుబాటు ఉంటుంది.. కానీ రూ. 50 వేలకు మించి ఖర్చుబెట్టాల్సి వస్తే.. తప్పని సరిగా టెండర్లు పిలిచి అవసరమైన మెటీరియల్ కొనుగోలు చేయవలసి ఉంటుంది.. కానీ ఈ నిబంధనలను అతిక్రమిస్తూ ఇప్పటికే బదిలీ అయిన జూ క్యూరేటర్ ప్రశాంత్ బాజీరావు పాటిల్, ఐ.ఎఫ్.ఎస్. తన చేతికి పని చెప్పారు..? ఎలాంటి టెండర్లు పిలవకుండానే అధిక ధరలకు అవసరమైన మెటీరియల్ కొనుగోలు చేసి, చెక్కులు కూడా ఇష్యూ చేసినట్లు తెలుస్తోంది..దీనికి కారణాలు ఏమిటి..? బదిలీ అయినా ఆగస్టు 21 తరువాత ఇంత ఆగమేఘాలమీద కోట్ల రూపాయల్లో చెక్కులు ఇష్యు చేయడంలో ఆంతర్యం ఏమిటి..? ఆగస్టు 25 వ తేదీ వేసి ఇష్యూ చేయడం ఇప్పుడు సంచలనంగా మారింది.. ఆ చెక్కులు క్రెడిట్ అయినట్లు కూడా తెలుస్తోంది.. నాశిరకం కెమెరాలను అధిక ధరలకు కొనడం.. అలాగే డస్ట్ బిన్స్, మార్బుల్ చైర్స్, ఆఫీసు చైర్స్, టీవీ, లాంటివి కొనుగోలు చేశారు.. మార్కెట్ ధరలను మించి ఈ మెటీరియల్ కొనుగోలు చేయడం గమనార్హం.. గతంలో విజిలెన్స్, ఎన్ ఫోర్స్ మెంట్ అధికారులు హెచ్చరిస్తూ, కొన్ని విధి విధానాలను ఏర్పరచిన వాటిని తోసిపుచ్చుతూ అక్రమంగా మెటీరియల్ కొనుగోలు చేసి లక్షలాది రూపాయలు కొల్లగొట్టినట్లు తెలుస్తోంది.. అసలు హైదరాబాద్ నెహ్రూ జూలాజికల్ పార్క్ లో ఏమి జరుగుతోంది.. అధికారులు ప్రభుత్వ సొమ్మును ఎలా దోచుకుంటున్నారు..? దీనిపై నియంత్రణ అనేది లేదా..? అన్న విషయాలపై పూర్తి ఆధారాలతో మరో కథనం ద్వారా వెలుగులోకి తీసుకుని రానుంది ‘ ఆదాబ్ హైదరాబాద్ ‘.. ‘ మా అక్షరం అవినీతిపై అస్త్రం ‘..

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు