Saturday, June 15, 2024

అయ్యో దేవుడా ఆగమైపోతిమి…

తప్పక చదవండి

అయ్యో దేవుడా ఆగమైపోతిమి…
దొరను గెలిపించుకొని మా భవిష్యత్ తరాలకు
తీరని పాపం చేసుకుంటిమి…
ఒక్కనికీ ప్రజల గోస పట్టదాయె…
సమస్యలున్నయి అంటే ఎమ్మెల్యే రానియ్యడు,
మంత్రి మర్లబడవట్టె.. కొత్త సచివాలయానికొద్దామంటే
పోలీసోళ్ళు గెదుమవట్టె .. రైతుల తిప్పలు,
నిరుద్యోగుల ఏడుపులు, ముసలోళ్ల మూలుగులతో,
తెలంగాణ రాష్ట్రం సవు సారా రూపాయి కార అంటూ
తాగుబోతు రాష్ట్రము చేస్తివి దొరా…
ఇప్పటికైనా మాకు సోయి వస్తే
నీకు కర్రు కాల్చి వాత పెట్టాలి ..
లేకుంటే ఇలాగే బానిసలుగా నీ బాంచెన్
అంటూ బతకాల్సిందే..

  • తుప్పతి శ్రీనివాస్
-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు