Thursday, April 25, 2024

పది కోట్ల జర్నలిస్టు సంక్షేమ నిధి ఏమైంది?

తప్పక చదవండి
  • జర్నలిస్టుల మహాధర్నాకు బిఎస్పి మద్దతు
  • వేల ఎకరాల భూమి అమ్ముకుంటరు కానీ జర్నలిస్టులకు ఇవ్వరా?
  • కేసీఆర్ ప్రభుత్వాన్ని గద్దె దించుడే
  • బహుజన్ సమాజ్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు డా.ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్

హైదరాబాద్ : 2014 ఎన్నికల మేనిఫెస్టోలో జర్నలిస్టుల సంక్షేమ నిధి పది కోట్లతో ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చి ప్రభుత్వం కావాలని మరిచి పోయిందని బిఎస్పి రాష్ట్ర అధ్యక్షులు డా.ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ విమర్శించారు. గురువారం రోజు హైదరాబాద్ యూనియన్ ఆఫ్ జర్నలిస్ట్స్ ఆధ్వర్యంలో జర్నలిస్టుల ఇళ్ల స్థలాల కోసం జరిగిన మహాధర్నా కు ఆయన సంఘీభావం ప్రకటించారు. జర్నలిస్టులకు ఇండ్ల స్థలాలు, ఇండ్లు ఇస్తామని మేనిఫెస్టోలో ప్రకటించి ఇప్పటివరకు ఎందుకు నెరవేర్ఛలేదని నిలదీశారు. భూపాలపల్లి, ఇతర కొన్ని జిల్లాల్లో జర్నలిస్టుల కోసం కేటాయించిన ఇళ్ల స్థలాలను అధికార పార్టీకి చెందిన నాయకులే కబ్జా చేయాలని చూస్తే అక్కడి జర్నలిస్టు మిత్రులు ధర్నా నిర్వహించి కాపాడుకున్నారని గుర్తు చేశారు. అన్ని హంగులతో హైదరాబాద్ నగరంలో జర్నలిస్టు భవన్ నిర్మిస్తామని చెప్పి ఎందుకు కట్టించలేదని ప్రశ్నించారు. ప్రింట్, ఎలక్ట్రానిక్ జర్నలిస్టులందరికీ అక్రిడియేషన్ కార్డులు ఇస్తామని, హెల్త్ కార్డులు అందజేస్తామని చెప్పి ఇంతవరకు ఎంతమందికి ఇచ్చారో లెక్క జెప్పాలని డిమాండ్ చేశారు. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం తమ కలాలతో అలుపెరగని పోరాటం చేసిన యోధులు జర్నలిస్టులని కొనియాడారు. తెలంగాణ వచ్చి పదేళ్లవుతున్నా, 2014 మేనిఫెస్టోలో కెసిఆర్ వారికి ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా, ప్రశ్నించితే మీడియా మేనేజ్ మెంట్లకు ఫోన్ చేసి, ఉద్యోగాలను ఊడపీకుతున్నారని, నిజాలు రాస్తే బెదిరింపులకు గురిచేస్తున్నారని మండిపడ్డారు. జర్నలిస్టులకు ఇండ్లు ఇవ్వాల్సిందేనని హెచ్చరించారు. ప్రభుత్వం వేల ఎకరాల ప్రభుత్వ భూమిని అమ్ముతుంది, కానీ జర్నలిస్టులకు ఇవ్వడానికి ఎందుకు వెనకడుగు వేస్తుందని అడిగారు. సుప్రీం కోర్టు కేసు క్లియర్ అయిన తర్వాత కూడా గత ప్రభుత్వం కేటాయించిన స్థలాలను ఇవ్వడం లేదని పేర్కొన్నారు. జర్నలిస్టులు తమ న్యాయమైన హక్కుల సాధన కోసం చేస్తున్న పోరాటానికి బిఎస్పి సంపూర్ణ మద్దతు ఉంటుందని తెలియజేశారు. రాబోయే బహుజన రాజ్యంలో అర్హులైన జర్నలిస్టు మిత్రులందరికీ ఇండ్ల స్థలాలు ఇస్తామని హామి ఇచ్చారు.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు