Thursday, April 25, 2024

Aaj Ki Baat

ఆజ్ కి బాత్

ఎలక్షన్ అఫిడవిట్లంటే తమాషాగా మారిపోయింది..ఉన్న ఆస్తులు ఒకటి.. చూపించే ఆస్తులు మరొకటి ..ఎన్నికల సంస్కరణలు బూజుపట్టిపోయాయి..అఫడవిట్ ను పరిశీలించే కనీస బాధ్యతను మరిచిపోయారు..ఒక్కో నాయకుడు ఒక్కో ఎన్నికలో ఒక్కో అఫిడవిట్ సమర్పిస్తుంటే..చోద్యం చూస్తున్న ఎన్నికల సంఘానికి సిగ్గు వచ్చేదెన్నడు..?ప్రజా స్వామ్యంలో ప్రజలు నమ్మకంగా జీవించేదెన్నడు..?ప్రజలు ఎన్నుకునే ఎన్నికల ప్రసహనంలో అబద్దాలు రాజ్యమేలుతుంటే..చేతగాని ఎన్నికల సంఘం...

సీఎం కొత్త రాగం

కాంగ్రెస్ బీసీ సీఎం రాగం ఎత్తుకోగానే..దొరవారి బుర్రలో మరో ఎత్తుగడరూపుదిద్దుకుంది..బీసీలకు లక్ష రూపాయల సాయంఅనే తాయిలం ప్రకటన వెలువడింది..బీసీలు ఇంకా నీ మత్తులోఉన్నారనుకుంటున్నావా..?కొంతమందికి మాత్రమే అనౌన్స్ చేసిమిగతావారికి తిక్క రేపి.. వాళ్లలో వాళ్లకుచిచ్చుపెట్టాలని చూస్తున్నావ్..నీ కుయుక్తులు గ్రహించలేని స్థితిలోవారు లేరు.. మాయమాటలతోనెత్తిన పెట్టుకున్న సీఎం కిరీటాన్నినేలకూల్చే సమయం ఆసన్నమైంది..బీ కేర్ ఫుల్.. బీవీఆర్ రావు

అక్షరాన్ని నమ్ముకున్నఅక్షర యోధులు

సమాజం కోసం కలం పట్టిన చేతులు..గూడు కోసం చేయి చాపి అడుక్కుంటున్నాపట్టించుకోని నేతలు…కలానికి రెండంచుల ఖడ్గం అని అంటారే..కానీ..పక్షపాత ధోరణితో పాలకుల కుటిలబుద్ధిదేనికి నిదర్శనం..అక్షరాన్ని నమ్ముకున్నఅక్షర యోధులకు..గూడు కోసం జాగ ఇవ్వడం అంత కష్టమా…మీ కబ్జాలు అడిగామా !?ధన ధాన్యాలు అడిగామా!?మణి మాణిక్యాలు అడిగామా!?కాస్తంత నీడ కోసం గుంటెడు జాగఇమ్మని పోరాడుతున్నాo…పట్టించు కోని పాలకులనుఏమని...

సారు రూటే సపరేటు..

సారు రూటే సపరేటు..ఎప్పుడూ ఏమి చేయాలో సారుకు బాగా తెలుసు..సమ్మె చేస్తే కానీ సారు క్రమబద్దీకరణ చెయ్యడు..మొన్న విఆర్ఏలను క్రమబద్దీకరణ చేశాడు..నిన్న కార్యదర్శులను క్రమబద్దీకరణ చేశాడు..రేపు గిరిజనులకు పోడు భూములపట్టాలు పంచుడు అంటుండు..ఎలక్షన్ వచ్చిందా నిరుద్యోగులకు ఉద్యోగాలంటాడు..ఇగ ఇచ్చిన హామీలు అన్ని నేరవేర్చాము..ఇప్పుడు దేశాన్ని ఉద్ధరించడం మన వంతు అంటాడుపిచ్చి జనాలు మళ్ళీ సంకలు...

ఇది పేరుకే ప్రజలస్వామ్యం..

ప్రజాస్వామ్యం ఇది పేరుకే ప్రజలస్వామ్యం..ఎవరు వచ్చిన పీకేది ఏమి లేదు..మధ్యతరగతి కుటుంబాల్లోమార్పు తెచ్చిందేమి లేదు..పాలకులు ఎవరు వచ్చినాలేనోడు లేనట్టే ఉంటున్నాడు..ఉన్నోడు ఇంకా బలిసిపోతూనే ఉన్నాడు..ఇది ప్రజాస్వామ్యం కాదు..అవినీతిపరుల దోపిడీ రాజ్యం..అవినీతి పరులను అంతమొందించేసమయం దగ్గర పడుతుంది..ఓ ఓటరన్న మేలుకో అవినీతినిఅంతమొందించి నీ ఓటుతో బుద్ది చెప్పు.. ప్రవీణ్‌ గౌడ్‌ రామస్వామి

ఎందుకు ఈ ఆహంకారం

మట్టి కలిపితే ఇటుకగా మారుతుంది..ఇటుకలన్ని కలిపితే గోడలా మారుతుంది..గోడలన్నీ కలిపితే భవనంలా మారుతుంది..ప్రాణం లేని వాటికి ఉన్నఐక్యత జీవమున్నమనుషులకు లేదు…ఏ చెట్టులో అహంకారం లేదు. వాటి ఫలాలను తిన్నమరి మనుషులు కు ఎందుకు ఈ ఆహంకారంమట్టిలో స్వార్థం లేదు.మట్టిలో ఒక గింజ నాటితే వేల గింజలను ఇస్తుంది.వేల గింజలను కలిపి ఆహారంగా చేసుకొని తింటాడు.కానీ...

ఎవరు మారాలి..?

ఎవరు మారాలి..?ఎవరి కోసం మారాలి.?పొద్దున లేచి అరగంట వ్యాయామంచేయడం చేతకాదు కానీ…100 యేళ్లు బ్రతికెయ్యాలిఓటు వేయడం చేతకాదు కానీదేశం మారాలి.తిరగబడే దమ్ము లేదు కానీఅవినీతి అంతమవ్వాలి.ఒక్క మొక్కను కూడా నాటలేంకానీ కాలుష్యం తగ్గాలి…బాధ్యతుండక్కర్లేదా…? ఛీ..ఛీ అరుణ్ రెడ్డి పన్నాల..

అయ్యో దేవుడా ఆగమైపోతిమి…

అయ్యో దేవుడా ఆగమైపోతిమి…దొరను గెలిపించుకొని మా భవిష్యత్ తరాలకుతీరని పాపం చేసుకుంటిమి…ఒక్కనికీ ప్రజల గోస పట్టదాయె…సమస్యలున్నయి అంటే ఎమ్మెల్యే రానియ్యడు,మంత్రి మర్లబడవట్టె.. కొత్త సచివాలయానికొద్దామంటేపోలీసోళ్ళు గెదుమవట్టె .. రైతుల తిప్పలు,నిరుద్యోగుల ఏడుపులు, ముసలోళ్ల మూలుగులతో,తెలంగాణ రాష్ట్రం సవు సారా రూపాయి కార అంటూతాగుబోతు రాష్ట్రము చేస్తివి దొరా…ఇప్పటికైనా మాకు సోయి వస్తేనీకు కర్రు కాల్చి...

హైదరాబాదులో రౌడీ షీటర్ల హవా..

హైదరాబాదులో రౌడీ షీటర్ల హవా..రాజకీయ నాయకులకు జాతర..నేతల అండతో భూ దందాలు, సెటిల్మెంటులు ..కోట్లల్లో వాటాలు…పీడీ కేసులు ఎత్తివేత .. అసెంబ్లీకి బాటపెరుగుతున్న నిరుద్యోగం..కడుపు కాలి అడిగితే పీడీ కేసులు ..అసెంబ్లీకి రౌడీలు… కాటికి యువత..తొమ్మిది సంవత్సరాల దొర పాలనలో..నిరుద్యోగం నివురు గప్పిన నిప్పులా ఉంది..ఉద్యమకారుల గుండెల్లో ఏర్పడ్డ గాయాలు..చేదు అనుభవాలు ఎన్నటికీ సమసిపోవు..దొరా...

అవ్వ కావాలి బువ్వ కావాలి అన్నట్టు…

అవ్వ కావాలి బువ్వ కావాలి అన్నట్టు…ఈమధ్య బిఆర్ఎస్ కార్యకర్తలు,సర్పంచులు, కొందరు ఉద్యోగస్తులు కూడారిపోర్టర్ల అవతారమెత్తుతున్నారు..మీటింగ్ లలో కండువా వేసుకుంటారు..రోడ్డుమీదికొచ్చి రిపోర్టర్ ను అంటారు…ఈ మధ్య కొన్ని పత్రిక యాజమాన్యాలకుతోడెం దుడ్లు ఇస్తే చాలు వాడు కార్యకర్తనా,సర్పంచా, ఉద్యోగా అని ఏం తెలుసుకోకుండానేఐడి కార్డులు ఇచ్చి జనంలోకి వదిలేస్తున్నారు.వీళ్ళని చూసి రిపోర్టర్ అని చెప్పుకోవాలంటేనిజమైన జర్నలిస్టులు...
- Advertisement -

Latest News

శంభునికుంటకు ఎసరుపెట్టిన అమీన్ పూర్ మున్సిపల్ చైర్మన్..

అక్రమ నిర్మాణాన్ని ప్రాథమిక స్థాయిలోనే గుర్తించి హెచ్చరించిన ఆదాబ్.. అనుమతులు లేకపోయినా ఉన్నట్లు కలరింగ్.. కాలరెగరేసుకుని దర్జాగా అక్రమ నిర్మాణ పనులు.. చైర్మన్ భార్య పేరుపై యథేచ్ఛగా నిర్మాణం.. అవినీతి మత్తులో...
- Advertisement -