Saturday, July 27, 2024

మసీద్‌ నిర్మాణ లెక్కలు ఎక్కడ..?

తప్పక చదవండి
  • సెక్రటేరియట్‌లోని మసీద్‌ నిర్మాణానికి ఖర్చు ఎంత అయ్యింది..?
  • టెండర్‌ ఎవరికీ ఇచ్చారు..? టెండర్లో ఎవరెవరు పాల్గొన్నారు?
  • తదితర అంశాలపై క్లారిటీ ఇవ్వని అధికారులు..
  • బీఆర్‌ఎస్‌ మాజీ మంత్రి హస్తం ఉందనే ఊహాగానాలు..?

గత బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ఏంతో ప్రతిష్టాత్మకంగా, నూతన హంగులతో తెలంగాణ సచివాలయాన్ని నిర్మించింది. అయితే సచివాలయం నిర్మిస్తున్న సమయంలో అక్కడున్న మసీద్‌ ను కూల్చివేసి, కొత్త సెక్రటేరియట్‌ మసీద్‌ ను నిర్మించిన విషయం తెలిసిందే.ఇక్కడ వరకు బాగానే ఉన్న మసీద్‌ నిర్మాణానికి ఎంత వరకు ఖర్చు అయింది..?? మసీద్‌ నిర్మాణానికి సంభందించిన పనుల కోసం టెండర్‌ ఎవరికీ అప్పగించారు..?? టెండర్‌ వేసిన సమయంలో ఎవరెవరు పాల్గొన్నారు.? అసలు ఖర్చు ఎంత..? ఇలా అనేక అంశాల పై సంభందిత అధికారులు నోరు విప్పడం లేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. దింతో సెక్రటేరియట్‌ నిర్మాణ విషయంలో అయోమయం నెలకొంది.

వాస్తవానికి ప్రభుత్వ భవనాలు , రోడ్లు , ఇతరతర ప్రభుత్వానికి సంభందించిన నిర్మాణ పనులు ఏవైనా టెండర్‌ పద్దతిలోనే జరగాలి.నిర్మాణానికి టెండర్‌ ఎవరికీ ఇవ్వాలి , ఎంత వరకు ఖర్చు అవుతుంది అనేదాని పైన ప్రభుత్వం అధ్యనం చేసి కమిటీల సలహాలు తీసుకోని టెండర్లు వేసి ఆ టెండర్‌ ఎవరికీ అప్పగించాలనే దానిపై ఒక స్పష్టత వచ్చాక ఆ తర్వాత ప్రభుత్వం బడ్జెట్‌ ను కేటాయిస్తుంది. కానీ సెక్రటేరియట్‌ మసీద్‌ నిర్మాణ విషయంలో అధికారులు ఇదేదీ పాటించకుండానే నిర్మాణాన్ని పూర్తీ చేసి చేతులు దులుపుకున్నారనే ఆరోపణలు వస్తున్నాయి.అధికారుల నుండి సరైన లెక్కలు రాకపోవడంతో అయోమయం నెలకొంది.

- Advertisement -

సెక్రటేరియట్‌ మసీద్‌ నిర్మాణం కోసం ఏర్పాటు చేసిన కమిటీను గెజిట్‌ ద్వారా వక్స్‌ బోర్డుకు అప్పగించాలి. కానీ ఈ ప్రక్రియను పాటించకుండా , రూల్స్‌ కి విరుద్ధంగా మసీద్‌ నిర్మాణం చేపట్టి , సరైన లెక్కలు వివరించడంలో విఫలమయ్యారన్న విమర్శలు వస్తున్నాయి. సుమరుగా 4.5 కోట్లతో నిర్మాణం పూర్తీ అయిందని అధికారులు చెప్తున్నా , నిర్మాణ రంగ నిపుణులు మాత్రం కేవలం కోటిన్నర వరకు ఖర్చు అయ్యే అవకాశాలు ఉన్నాయని , అంత మొత్తంలో ఖర్చు అయ్యే అవకాశం లేదని తెలుపుతున్నారు.

లెక్కల తారుమారు విషయంలో గతంలో బీఆర్‌ఎస్‌ ప్రభుత్వ హయంలో మంత్రి హస్తం ఉండనే ఊహాగానాలు కూడా వినిపిస్తున్నాయి.తనకు తెలిసిన వారికీ టెండర్‌ అప్పగించడం వల్ల అధికారులు సరైన లెక్కలు తెలుపడంతో వెనుకడుగు వేస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం.ఇప్పుడున్న కాంగ్రెస్‌ ప్రభుత్వం దీనిపైనా విచారణ చేపట్టి , సరైన వివరాలు వెల్లడిరచాలనే పలువురి నుండి డిమాండ్స్‌ వినిపిస్తున్నాయి.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు